గడువు ముగిసిన పన్నెండవ రోజు
అప్పటి వరకుఆమె భుజాల మీద ఏ బాధ్యత కూర్చుండ వచ్చునో భూమి కన్నీళ్ళు తుడుస్తూనోఅడవి వీపు నిమురుతూనోకాల్పుల్లో అనాదైన ఆదివాసీ చిన్నారిఆకలి కడుపు తీడుతూనో ఏ దుఃఖంఆమె కాళ్ళను చుట్టుకొని ఉంటుందో అడవిలోరాలి పడిన నెత్తుటి జెండాల్నేరుతూనోకాల్పుల్లో కూలిన శిరస్త్రాణాల గుండె కత్తుకుంటూనోవిరిగి పడిన ఆయుధాల ఆనవాళ్ళు కుప్పేస్తూనో లొంగుబాటులల్లనో అరెస్టులల్లనో కనిపించని'రూపి'ఏ ఆర్తి అమ్మలా కమ్ముకొనిఆమెను అడవికి కట్టేసుకోనుంటుందో కొంత ఫాసిజంఊడలైన సహచరత్వం నడుమకొంత ఆశయాలు పారి పోయిన మనుషుల నడుమకొంత పిరికితనం పొగచూరిన అడుగుల మధ్య ఎర్రజెండా రెపరెపలాడ్తూఆమెను ఏ దృశ్యం నిలబెట్టి ఉంటుందో ! అమ్మకలల్నో నాన్న కలల్నోకొంచెం ఊపిరి పీల్చిఆశల చెట్టు ఆకుల్లా

