లోచూపు కాలమ్స్

త‌త్వ‌శాస్త్ర ప్ర‌థ‌మ వాచ‌కం

తత్వశాస్త్రం అంటే సామాన్యులకు అర్థంకాని  నిగూఢమైన విషయమని చాలామంది అనుకుంటారు. అందుకు భావవాద తత్వవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వాస్తవికతను మరుగుపరిచి , తత్వశాస్త్రం పట్ల మార్మికతతో వ్యవహరించడమే ప్రధాన కారణం. ఇహలోకంలోని  సామాజిక జీవితంతో సంబంధం లేని, మానవ అనుభవంలోకి రాని 'పరలోకపు' విషయాలతో గందరగోళపరచడం వల్ల సామాన్యజనం తత్వశాస్త్రాన్ని నిగూఢమనుకునేలా చేశారు. పైగా ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని దైవ సృష్టి అనడంతో ప్రజల్ని నిమిత్తమాత్రుల్ని చేశారు. అందుకే విప్లవ రచయిత చెంచయ్య గారు ప్రకృతిని, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే సరైంది కాదని ఈ పుస్తకంలో అంటారు. ఎందుకంటే- ఎవరు సృష్టించారన్న ప్రశ్నలోనే అది 'సృష్టించబడిందన్నది వాస్తవం'
లోచూపు కాలమ్స్

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
లోచూపు కాలమ్స్

అస్తిత్వాలు, ఆధునికత, ప్రగతిశీల సామాజిక పరివర్తన

అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.     చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక
లోచూపు కాలమ్స్

గుండెల్నిమండించే మంటో కథలు

మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి
లోచూపు కాలమ్స్

అంటరానితనం గాయాలకు అక్షరభాష్యం ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’

ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి. ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన
లోచూపు కాలమ్స్

సమకాలీన అంబేద్కర్ వాదులు-సంక్షోభం,సవాళ్ళు – ఒక చర్చ

గతంలో కంటే భిన్నంగా అంబేద్కర్ కృషి, ఆలోచనల ప్రాసంగికతను నానాటికి విస్తరిస్తోన్న  ప్రజాపోరాట శక్తులు మరెప్పటి కంటే ఎక్కువగా ఇటీవలి కాలంలో గుర్తిస్తూ ఉండడమే పాలకవర్గాల రాజకీయ వ్యూహంలోని మార్పుకు ప్రధాన కారణం. గతంలో చాలాకాలం అంబేద్కర్ ను  గుర్తించకుండా నిరాకరించడం లోనూ, నేడు ఎంతో గుర్తించినట్లు కనబడుతూ ఆరాధించడం లోనూ ఆయన మూల తాత్వికతను ప్రజలు గ్రహించకుండా చేయడమనే  పాలకవర్గాల కుటిలత్వమే దాగి  ఉన్నది.     ముఖ్యంగా  సమకాలీన సమాజంలో చాలామంది అంబేద్కర్ వాదులు కూడా అంబేద్కర్ మూల తాత్వికతను గ్రహించకుండా వారు నిర్వహిస్తున్న సామాజిక, రాజకీయ పాత్రను ఎత్తిచూపడానికి  2011 లోనే   ఆనంద్ తేల్ తుంబ్డే గారు
లోచూపు

మానవాకాశంలో వానవిల్లులా  సప్త వైవిధ్యాలు

మనం మనుషులతో సహా దేన్నైనా మామూలుగా దంద్వాలలో విలువ కట్టడం చేస్తూ ఉంటాం. మంచి, చెడు, తప్పు, ఒప్పు లాంటి తీర్పులు చెబుతూ ఉంటాం. అలాగే లింగపరంగా మనుషులను ఆడ, మగ అనే ద్వంద్వంలో వర్గీకరించడం కూడా పరిపాటిగా వస్తోంది. కానీ మొదట ఒకే ముద్దగా ఉన్న చిన్న మానవ సమూహం సుదీర్ఘకాల చరిత్ర గతిలో ఎంతెంత విస్తరించి, ఎన్నెన్ని శకలాలుగా విభజితమైపోయిందో ఇదివరకెప్పుడో మనకు తెలిసి వచ్చింది. ఇటీవల కాలంలోనైతే అది మరింత వైవిధ్యపూరితంగానూ, వైరుధ్య పూరితంగానూ మన అనుభవంలోకి వస్తోంది.మరి ఈనాటి సామాజిక సందర్భంలో మనుషులను సామాజికంగా గాని, లింగపరంగా గాని కేవలం ద్వంద్వాలలో విలువ
లోచూపు కాలమ్స్

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
లోచూపు కాలమ్స్

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక
లోచూపు కాలమ్స్

కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు      అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.      ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది.