కవిత్వం

యుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..?

ఎప్పటికప్పుడుచెరలు చెరసాలలు దాటుకుని మరీపోరాటం పునరావృతమవుతూనే ఉంది..మళ్లీ మళ్లీ కొత్త జ్ఞానం వికసిస్తూనే ఉంది..పరిణామక్రమమంతా యుద్ధాలమయమే కదా!విశ్వాంతరాళాల్లోప్రకృతి మొదలుపెట్టిన సహజ యుద్ధాన్నిదేశాల మధ్యకు బదిలీ చేసిఒకడెవడో సంతోషిస్తున్నాడు గానీమనిషిలో అంతర్లీనంగాఈ యుద్ధమేనాడో మొదలైంది..సంపద మొదలైననాడుఅది పోగుపడడం మొదలైననాడుగుంపు నుండి ఒక్కడి వైపుమనిషి ప్రయాణం మొదలైన నాడుప్రకృతి పచ్చదనంనోట్ల పరపరలకు అమ్ముడు పోవడం మొదలైన నాడుఉనికి అస్తిత్వం గుర్తింపుఅన్నిటికీవిపణి ముట్టడిలోనేనిర్వచనాలు తయారవుతూపోతుంటేయుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..కింద పడిన ప్రతిసారీపైకి లేసేందుకుజరగాల్సిన యుద్ధాన్ని వదిలేసిపడిపోవడంలోనేపడుకోవడంలోనేరాజీని వెతుక్కుంటున్నప్రతి సందిగ్ధ సమయంలోనూమళ్లీ మళ్లీ యుద్ధం పుడుతూనే ఉందియుద్ధంలో మనిషిమనిషిలో యుద్ధంకలగలిపి చేసేసమాంతర ప్రయాణమే కదా చరిత్ర!మరిప్పుడు మళ్ళీ కొత్తగా మొదలవడమేంటి..? అందుకే వాడిలాగేమనకూ యుద్ధం
కవిత్వం

గిరి ప్రసాద్ చెలమల్లు మూడు కవితలు

మోదుగు పువ్వు ఉద్దండులు అడవిని వీడారుకలిసిరాని కాలం అన్నారుఆయుధమే అప్పగించాంసిద్ధాంతం సజీవం అన్నారు రాజ్యం విధించిన గడువు తీరిపోయిందిరాజ్యాంగమే చేతుల్లోకి వాలిందిఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది చదువుకుంది లేదుకాసింది మేకలుపోలియో అవిటితనం పైగా అమ్మాయిఅయితేనేం సిద్ధాంతాన్ని నమ్మిందిఅడవి బాట పట్టిందిఅంచెలంచెలుగా ఎదిగింది నమ్ముకున్నది తనని తానువంచించటం చేతకాదుదారితప్పుటకు దారులు వెతుక్కోలేదుమాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకునేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే! చావును ముద్దాడాలనుకుందిలొంగి పోనని తెగేసి చెప్పిందిపోయే నాడెలా వెళ్ళిందో దాన్నికోసమే ఆరాట పడింది చివరంటాసహచరుడినెలా చంపారో అలాగే చంపమందినేను నియమించిన వాళ్ళు చంపబడ్డాకనేను లొంగిపోతే నేను మనిషినే కాదన్నది !బలమైన మనోస్థైర్యం ఆమె సొంతం! చిత్రహింసల చావుని
కవిత్వం

తాను ఎంచుకున్న దారి

‘ఏప్రిల్ అత్యంత క్రూరమైన మాసం’వాళ్ళకు ఆమె మీద చాల కోపంగా ఉన్నదిఎర్రటి ఎండల్లో ఎర్రెర్రని జెండా కప్పించుకోడానికివిప్లవపాటలు పాడించుకోడానికిఅమర కామ్రేడ్ అనిపించుకోడానికినీ ఆశయాలను కొనసాగిస్తామనిప్రతిజ్ఞ చేయించడానికిసాయుధ పోరాట ప్రగల్భాలుప్రచారం చేయడానికిమారిన పరిస్థితుల్లో లొంగిపోకుండాఎన్‌కౌంటర్ ఎంచుకున్నందుకువాళ్ళకు ఆమె మీదచాల చాల కోపంగా ఉన్నది అన్నింటికన్న మించి ఇపుడుఆమె ఎలాగూ ఈ కీర్తనగీతాలు వినలేదుగానీతాము వినాల్సి వస్తున్నందుకుతాము చూడాల్సి వస్తున్నందుకుచాల చాల కోపంగా ఉన్నది వాళ్ళను చాలామంది ఇపుడుమార్చ్ 31 తర్వాత దొరికిలొంగిపోనంటే చంపకండిజైల్లో పెట్టండి అని అడుగొచ్చు కదాఅంటున్నారుఅది చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ కిపుడు ఏప్రిల్ 22 కన్నామార్చ్ 31 పవిత్రమైన దినమైందిపార్టీ నిర్మాణం చేసిరాజ్యంపై సాయుధంగా విప్లవించే
కవిత్వం

వర్గ పోరాటపు స్పూర్తి కామ్రేడ్ బుస్కీ

బస్తర్ తరాల చరిత్ర  అంతా ప్రజా పోరుకు మారు పేరు ఒకరి కింద బానిసలుగా మేము వుండమ్ ఈ  అడవి మాదే  అంటూ విస్తృత, వినూత్న    పోరు-సమరాలు నడిపింది ఆ వారసత్వము నుండే నేడు వర్గ పోరాటపు చైతన్యముతో ఆ కాశంలో సగం - సమరంలో సగం అంటూ దండకారణయ్య ఉద్యమంలో సమసమాజ నిర్మాణా కర్తవ్యంతో అడుగేసిన నూపో బుస్కీ సాధారణ ఆదివాసి యువతి అ ఆ లతో పాటూ-యుద్ద నీతిని నేర్చి కమాండర్ గా నాయకత్వంలోకి ఎదిగివచ్చిన విప్లవ వీరాంగణ సల్వజుడుమ్,`సమాధాన్’ సామూహిక సమరాల్లో సహసంగా పోరాడిన  ధీశాలి ఫాసిష్టు  ఆపరేషన్ `కగార్`బాంబుదాడుల్లో కన్ను కోల్పోయినా
కవిత్వం

నీళ్ళు, అడవి, భూమి…

(జల్, జంగల్, జమీన్) సర్కార్ చుట్టరికం ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నదిఅక్కడ నీళ్ళు ప్రవహించవుసత్యమని నమ్మించే పటం మీద గీసిన రేఖలతో ఉన్నది పర్వతాలు ఔన్నత్యంతో కాదుఖనిజాల నిధులుగా మారినవి ఆరావళీ ఛాతీ మీద నడుస్తున్న యంత్రం ఏదో ప్రాచీన శోక గీతం వలెధ్వనిస్తున్నది.కానిప్రజల బాంధవ్యం ఇంకా తెగిపోలేదు ఇప్పుడు కూడ ప్రజలునదిని అమ్మా అంటారు వృక్షాలతో సంభాషిస్తారు మట్టిని తమ నుదుటిమీదఅలంకారంగా దిద్దుకుంటారుప్రకృతిపై వాళ్ళ విశ్వాసం మూఢ విశ్వాసం కాదుఅది ఇతిహాసం అది ప్రతి ఎండాకాలం తర్వాత ఒక పత్రహరితమై తిరిగి వస్తుందినగరం మనల్ని నాగరీకుల్ని చేస్తుందని అంటారు ఎప్పటిదాకా మా ఊపిరితిత్తుల్లో అడవి
కవిత్వం

చివరి వారెవరు?

అతడొక్కడేమిగిలి వున్నాడాఇంకెవరూ లేరనినీ ప్రకటన చూసిసముద్రం నవ్వుకుంటుందిజీవితం నీకు ఆగిపోవచ్చుఅక్కడనుండే మరలమేము మొదలవుతాంచరిత్ర నువ్వుతలకిందులుగా చదువుతావునీ చరిత్ర మట్టిలో కూరుకుపోయేకుళ్ళిన శవం మాత్రమేమేము చరిత్ర నిర్మాతలంమా పేజీలన్నీ నెత్తుటిరేఖలతో లిఖింప పడుతూచిరస్మరణీయమవుతాయిజనం ప్రభంజనమయ్యేరోజు మరల మొదలవుతోందిఅరణ్యం పచ్చగాచిగురిస్తోందినదులన్నీ ప్రవహిస్తూనే వున్నాయిపర్వత సానువలన్నీనిటారుగా నిలబడే వున్నాయిసూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడువెన్నెలా విరగబూస్తోందినువ్వనుకుంటావుఓడిపోయింది తల్లి పేగానిఆ చివరి విలుకాడు నుండిపెల్లుబికి వెళ్లువెత్తేయుద్ధ భేరీ నాదంనీ గుండెలను చీల్చుతుందికాలం మరల మరలతిరిగి తిరిగిముందుకే నడుస్తుందిఇదిసత్యం చెప్పిన మాటఅతడు తిరిగి కొండబారిడివరి కంకులలో గింజ కడుతున్నాడుచీకటి కొండల్లో దాచినబర్మారులో గంధకందట్టించి వస్తున్నాడుమహేంద్ర గిరులలోనుంచినియాంగిరి పర్వత సానువులనుండినలుదిక్కులా ప్రవహిస్తున్నారుఅతడుచివరి వాడూ కాదుఆమెచివరిదీ కాదుఇది ఓటమీ కాదునీది గెలుపూ
కవిత్వం

చీమలు

వాళ్లకు చీమలు సంఘటితంగావడం ఇష్టముండదు అవి రాజకీయాలమీద,సమాజం మీద మాట్లాడడమూ ఇష్టముండదు చీమలు పుట్టేది రాణిగారి గుడ్లనూ , ఆహారాన్నీమోయడానికేనని వాళ్ళ నిశ్చితాభిప్రాయం నిస్సందేహంగా చీమల ధిక్కార భాష అంటే వాళ్లకు పరమద్వేషం కాబట్టి చీమలు చేయి దాటి పోతున్నట్టనిపిస్తే వాళ్లు కాళ్ళ కింద తొక్కేస్తారు
కవిత్వం

నా పేరు ప్రతిఘటన!

విను! నాకు చదవడం వచ్చు! నేను రాస్తాను కూడా! నేను ఏ దుస్తులు ధరించాలో నాకు నేనుగా నిర్ణయించుకుంటాను! మీ అపహాస్యం , అరుపులు ,వెక్కిరింతల మధ్య నేను దృఢమైన సింధూర వృక్షంలా నిలబడతాను అదిగో స్కూలు బెల్లు మోగుతుంది వెళ్ళాలి!*నువ్వు ద్వేషాన్ని కక్కుతావు ! నేను బలాన్ని నాటుతాను ! నువ్వు గేట్లు మూసేస్తావు! నేను నా హక్కుల్ని గుంజుకుంటాను! చూడబోతే నీకు నా స్నేహితులు ఎవరో కూడా తెలియదులా ఉంది! *. నేను కళ్ళు మిరుమిట్లు గోలిపే కాంతిని! రక్తాలు కారుతున్నా నేను లేచి మళ్ళీ నిలబడతాను!నేను మరణించాక మళ్ళీ పుట్టే ఫీనిక్స్ పక్షిని కాదు
కవిత్వం

ఏప్రిల్ 1, 2026

ఏ మట్టి పొత్తిళ్ళలోంచి కన్ను తెరుస్తుందో విత్తనం మళ్ళీ ఆ మట్టిలోకే చేరుతోంది ఏదన్నా మట్టిలోకి ఒరిగిపోవడమంటే మాయమైపోవడం కాదు పోటెత్తే అశ్రుధారా సముద్రమంతా పైకి కనబడని గాయాలనుండి తొణికే కన్నీటి బొట్లే అమ్మ గుండెల్లోంచి పట్టిన పాలవలే కన్నీళ్ళన్నీ కూడా చిక్కటి రక్తమేకన్నీళ్ళతో మట్టి, చిత్తడి మత్తడిగా తడిచిన తర్వాతే తురాయిపూలు ఎర్ర రంగు పులుముకున్నాయి ఆకలేసినవాడికి అన్నం మెతుకులు పండాయి ఆశలకి ఆధారం దొరికిందిచెట్లను కూల్చేయడమంటే అడవి మాయమైపోవడం కాదు కొమ్మల వేల చేతుల్నెత్తి పిల్లల్ని చంకనెత్తుకునే తల్లులందరూ మట్టిలోంచే మళ్ళీ మళ్లీ పుడతారు గుట్టల్ని లోయల్ని జల్లెడపట్టిన డ్రోన్లకి ధాన్యపు కంకుల్లా పుట్టే మట్టి
కవిత్వం

కలల అల్లిక

ఓ కామ్రేడ్ ఎలా చనిపోతాడో అడుగొద్దుభూమి నుండి చెట్టును వేరు చేసినట్టు ఇంటి నుండి గుంజుకుపోయి గాలీ, వెలుతురూ చొరబడని చోటఅండాసెల్లో బందీచేస్తారు క్రమంగా రాజ్యం చెట్టులోని జీవాన్నంతాపీల్చి పిప్పిజేస్తుంది వాళ్లు చెట్టును చంపగలరేమో గాని ఆయన కలం నుండి చక్రాలకుర్చీ లోని చక్రాలనుండిపుట్టుకొచ్చే వేలాది వేర్లనెలా తెంపగలరుఓ కామ్రేడ్ మృతి పట్ల సంతాపం వద్దు.ఓచెట్టు తన ఆకుల్ని బూరలు చేసివిజయ గానాలు వినిపిస్తూనే ఉంటుందియుద్ధమాగదుసాయికి మరణం లేదు **