కవిత్వం

భయం

ప్రశ్నంటే ఎందుకంత భయం ప్రశ్నలచుట్టూ ఇనుప కంచె ఎందుకు ప్రశ్న వైపు నిలుచుని చూడ్డం నీకు రాదు గర్జించే ప్రశ్నకు తుపాకీ కాపలా పెట్టిన్నాడే నీ భీతి తెలిసింది ప్రశ్నను గాయపరచటం రక్తాన్ని కళ్ళచూడ్డం జైల్లో ప్రశ్నను బాధించటం ఉరికొయ్యకు ప్రశ్నను వేలాడదీయాలనుకోవడం నీ తాత్కాలిక ఊరట మాత్రమే ప్రశ్న ప్రజా సమూహం ప్రశ్న అలుపెరుగని పరంపర జవాబు చెప్పడం రాని నీకు ప్రశ్న మీద Fir అసహనాన్ని వ్యక్తం చేస్తావు రహస్యంగా రెక్కి చేసి మేధకు నాన్ బెయిలబుల్ తాళం వేస్తావు ప్రజలనుంచి దూరం చేసి ఏకాకితనంలోకి విసిరేస్తావు ఒక్కటి గుర్తుంచుకో సముద్రం లోని చేపల్ని వేటాడగలవు
కవిత్వం

అతడి మరణం

అతడి మరణం పొద్దుకు తెలిసిందికన్ను తెరిచే వేళన వేకువ గాయపడ్డది.గుడిసెను తాకుతున్న తొలికాంతికన్నీరులా చల్లబారింది.అతడి మరణం నేలను తాకింది.వాలిపోతున్న సాహసానికి ఒడిని చాపింది. మహా ప్రళయాలకు లొంగని పచ్చని గరిక నెత్తురుగా దుఃఖ పడ్డది.అతడి మరణం గాలినీ తాకింది.శూన్యం కాని శూన్యమంతావెక్కిళ్ళలో ధ్వనించింది.అతడి మరణం ప్రాణాలఆశను ఛేదించిందితత్వశాస్త్రం లయ తప్పినట్టుగానమ్మకాలన్నీ బూడిదకుప్పల్లాతేలిపోయాయి.అణచబడ్డ మానవుల శోకానికిసమాధానమతడు.అతడి మరణం పల్లవి తెగిన పాటలాఎదలో సంచరిస్తోంది.అతడి మరణం అడవిని చేరింది.భాషలేని బాధ దుఃఖమై తడిపింది.సద్దుమణగని నినాదంలాకొండకోనల్లో నిలిచింది.అతడి మరణం నిశబ్దం కాదు.కాగుతున్న డప్పులాకాలానికి కంఠాన్ని పొదుగుతుంది.
కవిత్వం

మ‌హా యోధ

వెన్నెల కురిసిన రాత్రిలోఒక పువ్వు వికసించింది .ఆ పువ్వు వికసించడానికి కారణం చీకటిఅడవి తల్లి రక్షణ కోసం.ఆయుధంలా జన్మించాడుప్రజల స్వప్నాల్లో మొక్కలా మొలకెత్తాడుప్రజల ఆశనే, తన లక్ష్యంగా ములుచుకున్న త్యాగమూర్తి అతడుఅన్యాయాన్ని ఎదిరించి గిరిజన ధీరుడయ్యాడురాత్రీ, పగలు అడవి తల్లిని తన కన్నబిడ్డలా కాపాడాడుఅడవికి, జనాలకు అండగానిల్చిన యోధుడతడుఆ కుమురం భీం నుంచిఈ హిడ్మా దాకా అడవి పోరాటం కొనసాగుంది.
కవిత్వం

వాళ్లెక్కడ లేరు?

పసిపాప పాల కోసం ఏడిస్తేతల్లి పాడే జోల పాటలో వారున్నారుబంజరు పట్టిన నేలనుపంటగా మార్చే రైతన్న నాగలిలో ఉన్నారు కొంగు నడుముకు సుట్టుకునిబురదలో నాట్లేసే నాటు పాటలో ఉన్నారు కులం పేర దాడి జరిగితేఆత్మగౌరవం కోసం చేసేపోరాటపు డప్పులు ఉన్నారుఅత్యాచారం చేయబడిన స్త్రీలతిరుగుబాటు పిడికిళ్లలో వారున్నారుపింఛన్ కోసం వెళితేలంచాలకు మరిగిన ఆఫీసర్లనునిలదీతలో వారున్నారుడిమార్ట్లో, ట్రెండ్స్లో చాలీ చాలని జీతాలతో బతుకీడుస్తున్నప్రతి కార్మికుడి కష్టంలో ఉన్నారు అందరికీ దిక్సూచిగా ఉన్నఎర్రని జెండాలో వారున్నారు.
కవిత్వం

రూపాంతరం

గాలి ఒక్కసారిగా సుళ్ళు తిరుగుతూ సాగరాన్ని తాకుతుంది సాగరం తన లోలోపలి అలజడితో ఎగసిపడుతూ నింగిని ముద్దాడుతుంది పగిలిన పెదవితో నింగి అరణ్యాన్ని కౌగిలించుకుంటుంది అరణ్యం తన చేతులలో నిన్ను పొదువుకుంటుంది నువ్వు మరోసారినదిగా మారి పల్లంవైపు ఉరకలేస్తావు!!
కవిత్వం

మందరపు హైమావతి రెండు కవితలు

1 గెలుపు గుర్రాలం ఇక వెనకడుగులన్నీ ముందడుగులే కుంటి గుర్రాలన్నీ పరిగెత్తే పారశీక జవనాశ్వాలే పాత చరిత్రలు పాత కథలన్నీ పాదమట్టం బండరాళ్లకు రెక్కలు మొలిచిన అద్భుతం అటు అగ్రకులాల ఆధిపత్య భావనల పావురాలనెగరయ్యలేక కింది కులాల ధిక్కారస్వరంతో గొంతు కలపలేక ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే అత్తిపత్తులం స్వేచ్ఛ సీతాకోకచిలుక రెక్కలు విరిచి కాళ్లకు బదులు మనసుకు సంకెళ్లు వేసి అమానవీయ అంటరానితనం కొరడా దెబ్బలు వెలివాడల బహిష్కరణల బహుమతులు మాత్రమే తక్కువ తరతరాలుగా చాకలోళ్లు మంగలోళ్లు కుమ్మరోళ్లు కంసాలోళ్ళు అంటూ మా మనసు పుస్తకాలపై చెరగని అవహేళనల రాతలు 'పిల్లలకు పట్టింపులేమిట' ని వసారాలోవడ్డించి ఎంగిలాకులు ఎత్తించిన కటిక
కవిత్వం

అవిశ్రాంత యోధుడు

ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూసిన వాడు బహు ధ్రువ ప్రపంచాన్ని వర్ణించిన వాడు వైరుధ్యాలను పసిగట్టి ఇంటర్ రిలేషన్ షిప్ కు దారులు వేసిన వాడు అవిశ్రాంత యోధుడు మాతృభూమి రక్షణకు నిలిచిన వాడు గుండె నిశబ్దాన్ని హేళన చేసిన వాడు కాలం వీరులకే సలాం చేస్తూందన్నాడు ఓ మహాకవి అది నీవే కదా మిత్రమా నీవే కదా నేటి వీరుడవు.
కవిత్వం

హజర్ దిన్ మేరా ప్యార్ ఉమర్ మియా..

"జనగన మన" పాడకుండా ఉంటే దేశ ద్రోహి అయ్యే ఫాసిస్ట్ దేశంలో నీవు జాతి కోసం గొంతెత్తవు మనల్ని మనుషులుగా గుర్తించని నేల లో మనకు స్వేచ్ఛ కావలన్నావ్.. ద్వేషం కక్కే హిందూ మతోన్మదాం పై ప్రేమ గెలవాలన్నావ్.. జీవించే,మాట్లాడే హక్కును చిదిమేసిన నగ్నపు రాజ్యానికి నీ మాట తూటాల కనిపించింది.. నిన్ను "హజర్ దిన్" బందీ చేసి తాను గెలిచాను అనుకుంటుంది.. తనకు తెలీదు అది ని ముందు మొకరిల్లిందని... ( ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ రీసెర్చ్ స్కాలర్ ఉమర్ ఖలీద్ ని బందీ చేసి 1000 రోజులు అవుతున్న సందర్భంగా)
కవిత్వం

విప్లవానికి మరణం లేదు

విప్లవం చనిపోదు రక్తం ఎండిపోతే రగిలే మంట అది!నిజం నలిగితే నినదించే గళం అది!గుండెలో దాచిన ఆవేశం కాదు గోళాల కంటే గట్టిగా పేలే శబ్దం అది!జనాల ఊపిరిలో పుడే తుపాన్ అది!అణగారిన ప్రతి కన్నీటిలోనూవిప్లవం మళ్లీ మళ్లీ పుడుతుంది!దాన్ని చంపలేరు, దాన్ని ముంచలేరు దాన్ని నెమ్మదించించలేరు!విప్లవం అంటేన్యాయం కోసం లేచిన గుండె ధైర్యం!మౌనాన్ని విరిచే కేక!అది మన రక్తంలో ముద్రైపోయిన నినాదం!“విప్లవం చనిపోదు — విప్లవం మళ్లీ పుడుతుంది!”
కవిత్వం

సికాస నిప్పు

విచ్చుకత్తుల బోనులో శత్రువుతో చెడుగుడు ఆడి బొగ్గు గనుల్లో ఉద్యమ ఊపిరులు ఊది సింగరేణిలో విప్లవ మంటలను రాజేసిన సికాస సింహం నీవు నూనూగు మీసాల నవ యవ్వనంలో జగిత్యాల జైత్రయాత్రవై ఇంద్రవెళ్లి తుడుం మోతవై ఆదివాసీ అగ్గిబరాటవై జనతన సర్కారు నిర్మాతవై శ్రామిక రాజ్యపు సారధివై ఎత్తిన ఎర్రజెండాను యాభై ఏళ్లుగా విరామమెరుగక మోసిన విప్లవ ప్రేమికుడివి నీవు పాలక పోలీసు ఎత్తుగడలను చిత్తు చేస్తూ, చివరి వరకు శత్రువుకు చిక్కని 68 ఏళ్ల చిచ్చర పిడుగువు సింగరేణిలో రాజుకొని దేశమంతా వెలుగులు జిమ్మిన సికాస నిప్పువు నీవు వసంత గీతమై వెదురుగానమై దండకారణ్యమంతా విస్తరించిన దూద్