ఆర్ధికం

కార్పొరేట్‌ దురాశ వల్లే అసమానతలు

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల (480 కోట్లు) మంది అంటే జనాభాలో 60శాతం మంది మరింత పేదలుగా మారారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే 229 సంత్సరాలు పడుతుందని అంచనా వేసిన ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ప్రచురించిన నివేదికను దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా జనవరి 14న విడుదల చేశారు. ‘ఈ అంతరాలను మేం గమనిస్తున్నాం. కొవిడ్‌, ద్రవ్యోల్బణం, యుద్దాలు వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద
ఆర్ధికం కాలమ్స్

శ్రమజీవుల రణన్నినాదం

                                                                                          'ప్రజలను కాపాడండి- దేశాన్ని రక్షించండి' అన్న ప్రధాన నినాదంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో దేశ కార్మికవర్గం సమర శంఖం పూరించింది. బిజెపికి అనుబంధంగా ఉన్న బి.ఎం.ఎస్‌ తప్ప మిగిలిన పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండురోజుల సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం 'ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయం... దేశాన్ని కాపాడుకుంటాం.. ప్రజల్ని రక్షించుకుంటాం... కార్మిక కోడ్‌లను తిప్పికొడతాం... కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయాలి, ఏ రూపంలో
సమకాలీనం

ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థల బహిష్కరణ

"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్,
ఆర్ధికం

‘బేరు’ మంటున్న రూపాయి

విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా... పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది.
లోచూపు కాలమ్స్

అస్తిత్వాలు, ఆధునికత, ప్రగతిశీల సామాజిక పరివర్తన

అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.     చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక
ఆర్ధికం

మందగమనంలో ఆరిక్థ వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక  వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్‌ను సృష్టిస్తున్నది. తమ పాలనలో భారత్‌ 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకుంటున్నది. ఇదంతా తమ పాలనలో తీసుకున్న విధాన నిర్నయాల కారణంగానేనని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ నుంచి ఆ పార్టీ కీలక నాయకుల వరకు ఇదే మాటలు చెప్తున్నారు. టివీ డిబేట్లలో, సోషల్‌ మీడియాలో తమ, తమ అనుబంధ గోడీ మీడియా ద్వారా ఆర్థిక వ్యవస్థపై హైప్‌ను బిజెపి ఊదరగొడుతున్నది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం
ఆర్ధికం

‘వికసిత భారత్‌’ ఓ ప్రహసనం

భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అని ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే రాజకీయాల్లో ‘అచ్చేదిన్‌ ఆనే వాలేహై’ అనేది బిజెపి నినాదం. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో బిజెపి విడుదల చేసిన గంభీరమైన వాగ్దానాలను అమలుచేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అన్ని వాగ్దానాల గాలి మాటలు గాలి మాటలుగానే మిగిలాయి. మోడీ అమలులోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) భారతదేశ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేశాయి. మోడీ
లోచూపు

స్వచ్ఛ భారత్లో స్వచ్ఛత ఎక్కడ’?

మన ఇంటికి గోడలు ఎంత అవసరమో కిటికీలు, దర్వాజలు అంతకంటే ఎక్కువ అవసరం. అవి లేకుండా మనం గోడల మధ్య బందీలమైతే మనను బైటి గాలులేవీ తాకవు. బయటి వెలుతురేదీ మనకు సోకదు. మన ఇంటి గోడల బయటి కైవారాలు సురక్షితంగా ఉన్నాయా, లేదా కూడా మనకు తెలియదు. కనుక మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే మనం గోడలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ఇళ్లకు చెందిన బయటి గోడలను పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ ఇళ్ల గోడల మధ్యన ఉన్న రక్షక వ్యవస్థలను పరిరక్షించుకోవలసి ఉంటుంది. విధ్వంసక వ్యవస్థలను రూపుమాపుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాగే మన స్వీయ అస్తిత్వాలను
కథావరణం సాహిత్యం కాలమ్స్

దేవుడా ? మనిషా? ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు?

మనుషుల  కష్టాలను, సమస్యలను, దుఃఖాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అసమ సమాజంలో  వివిధ సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య పూడ్చలేని అగాధాలను, అంతరాలను సృష్టించింది ఎవరు? ఈ హద్దులు అంతరాలు అగాధాలను అధిగమించడానికి ఎవరు  ఏం చేయాలి? శ్రామిక వర్గాల శ్రమను నిరంతరం  నామమాత్రపు వేతనాలతో  నిలువు దోపిడి చేస్తున్న  బూర్జువా పెట్టుబడిదారి ఉన్నత తరగతుల వర్గాలు ఆ శ్రామిక వర్గాల కోసం, కనీసం కృతజ్ఞత చూపించకపోవడాన్ని, ప్రాణాపాయ పరిస్థితులలో సైతం ఎంత మాత్రము డబ్బు సహాయం చేయడానికి ముందుకు రాని వైనాన్ని , మనుషుల కోసం ఏమీ చేయలేని మనుషులు దేవుడి కోసం మాత్రం దేవుడి
లోచూపు కాలమ్స్

గుండెల్నిమండించే మంటో కథలు

మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి