సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
వ్యాసాలు అనువాదాలు

కోవిడ్ 19 విపత్తుని ఎదుర్కోవడంలో క్యూబా సహకారం

‘వారు తెలివైన ఆయుధాలను కనిపెట్టారు. కానీ మేము మరింత ముఖ్యమైనది కనిపెట్టాము: ప్రజలు ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు.’ ఫెడల్ కాస్ట్రో అనేక పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రజారోగ్య విధానాలలో వైఫల్యాన్ని COVID-19 విపత్తు బహిర్గతం చేసింది. IMF, ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడిన ఆరోగ్యం, విద్యా కార్యక్రమాలలో కోతలు చేసిన దశాబ్దాల నయా ఉదారవాద కాఠిన్యం, ఇప్పుడు లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా అంతటా వ్యాప్తిస్తున్న ప్రమాదకరమైన అంటువ్యాధులు, మరణాలలో ఫలితాలను చూపుతోంది. పాశ్చాత్య దేశాలలో, క్యూబా సమర్థతకు ఒక ఉదాహరణగా నిలిచింది. విపత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరొక మార్గం సాధ్యమని చూపించింది. సంఖ్యలు
వ్యాసాలు

ఒక జిజ్ఞాసి లోతైన ఆలోచనలు

చిరకాల మిత్రుడు రమేష్ పట్నాయక్ తాను రాసిన ఐదు వ్యాసాలను ఒక సంపుటంగా ప్రచురిస్తూ దానికి ముందుమాట రాయమని నన్ను అడగడం ఒక ఆశ్చర్యం. ఈ ఐదు వ్యాసాలలో రెండు నా సంపాదకత్వంలోని ‘వీక్షణం’ లోనే వెలువడినప్పటికీ, ఆ రచనల్లో వ్యక్తమైన రాజకీయావగాహనలతో నాకు ఏకీభావం లేదని కొత్తగా చెప్పనవసరం లేదు. అలా ఏకీభావం లేకపోయినా ప్రగతిశీల శిబిరంలోని అన్ని భావాలనూ, భావఛాయలనూ ఆహ్వానించే ఒక వేదిక సంపాదకుడుగా ఆ వ్యాసాలను ప్రచురించడం వేరు, నేరుగా ఆ రచనల సంపుటానికే ముందుమాట రాయడం వేరు. అయితే ఎంత ఏకీభావం లేని విషయంతోనైనా చర్చ, సంభాషణ, సంవాదం జరపాలని, స్థూలంగా
వ్యాసాలు అనువాదాలు

పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి డాక్టర్‌ అమితవ చక్రవర్తి ఫిబ్రవరి 4, 2021 పశ్చిమ బెంగాల్‌లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్‌యస్‌య‌, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్‌లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్‌యస్‌యస్‌ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని
వ్యాసాలు

దేశవాళీ ప్రాంతీయ ప్రాతినిధ్య కథకుడు సభా

ఇది కె. సభాగారి శత జయంతి సంవత్సరం (01-07-1923  -  04-11-1980) దేశవాళీ గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె .సభా గారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి  పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్య వృత్తి నుండి   బయటపడి  పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసిన
వ్యాసాలు

భారత రాజ్యాంగం వైరుధ్యాల పుట్ట

(రాజ్యాంగంపై  అనేక వైపుల నుంచి చ‌ర్చ జరుగుతున్న‌ది.  దీనికి అమ‌రుడు ప్రొ. శేష‌య్య‌గారు రాసిన ఈ వ్యాసం  త‌ప్ప‌క దోహ‌దం చేస్తుంది.  చారిత్ర‌కంగా రాజ్యాంగం రూపొందిన తీరును ఈ వ్యాసంలో ఆయ‌న వివ‌రించారు.  మ‌న సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో రాజ్యాంగానికి ఉండ‌వ‌ల‌సిన పాత్ర‌ను ఎత్తిప‌డుతూనే ఆందులో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్న‌దీ విశ్లేషించారు.  రాజ్యాంగ ప‌రిశోధ‌కుడిగా, న్యాయ‌శాస్త్ర ఆచార్యుడిగా, పౌర హ‌క్కుల ఉద్య‌మ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిశీల‌న‌లు  ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌కు  కొత్త కోణాలు ఆవిష్క‌రిస్తాయ‌ని పున‌ర్ముద్రిస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీ) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్ వివరిస్తూ *ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు,
వ్యాసాలు

పాఠ్య ప్రణాళిక సమస్యలు

పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అంశాల్లో సమస్యలు కొనసాగుతుండగా లేదా తీవ్రతరం అవుతుండగా,  ఇప్పుడు కొత్తగా పాఠ్య ప్రణాళిక సమస్య ముందుకు వచ్చింది. పూర్వ పరాలు పరిశీలిస్తే: 1986 లో ‘‘విద్యలో జాతీయ విధానం 1986’’, దానిననుసరించి 1989లో ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 1989’’ వచ్చాయి. అది ప్రధానంగా కాంగ్రెస్‌ జాతీయ వాదం, కాంగ్రెస్‌ సెక్యులరిజం, కాంగ్రెస్‌ శాస్త్ర దృక్పథంపై ఆధారపడి ఉండిరది. కొన్ని ప్రముఖ ప్రగతిశీల విషయాలు కూడా ఉండినాయి. ఏదేమైనా ఆనాటి విధానాలు భారత రాజ్యాంగ విలువలను స్పష్టంగా పునరుద్ఘాటించి, అట్టి విలువల సాధనకై రూపొందించబడినట్లు ప్రకటించాయి. ఆచరణలో చాలా సమస్యలుండినాయనేది
సాహిత్యం వ్యాసాలు

మయన్మార్‌లో సైనికకుట్ర – తదనంతర పరిణామాలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి
వ్యాసాలు

ప్రజా యుద్ధకల్పనా రూపం అజ్ఞాత కథ

 (2010 జనవరిలో  మొదటిసారి, 2016  ఫిబ్రవరిలో మరోసారి విరసం పునర్ముద్రించిన *ముప్పై ఏళ్ళ దండకారణ్య సాహితి సాంస్కృతోద్యమ చరిత్ర (1980 -2010) పుస్తకంలో అజ్ఞాత కథ గురించి దండకారణ్య రచయితలు రాశారు. దండకారణ్య సాహిత్య కళా ప్రచార వేదిక ఝన్కార్ గురించీ రాశారు. వియ్యుక్క కథా సంపుటాలు విడుదల అవుతున్న సందర్భంలో అజ్ఞాత విప్ల కథా వికాసాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని ఈ భాగాలను పునర్ముద్రిస్తున్నాం -వసంత మేఘం టీం) దండకారణ్య సమాజంలో ప్రజల జీవితాలతో, ప్రకృతితో ముడిపడిన కథలు కోకొల్లలు. మనిషికీ-ప్రకృతికీ ఉండే సంబంధాలను, ఉత్పత్తి సంబంధాలను తెలిపే కథలు ప్రజలు ఎన్నైనా చెపుతారు. అలాగే
వ్యాసాలు

మేధావి, సృజనశీలి కామ్రేడ్ మిళింద్

18 నవంబర్‌ 2021 మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్‌చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్‌ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దీపక్‌ (మిలింద్‌ బాబూరావ్‌ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ