సంపాదకీయం

సాయుధ ప్రతిఘాతుకం.. ఉల్కా పతనం

 14 అక్టోబర్‌ కామ్రేడ్‌ అక్కిరాజు హరగోపాల్‌ రెండేళ్ల క్రితం దండకారణ్యం - బస్తర్‌లో మరణించిన రోజు - అమరత్వం పొందిన రోజు.  జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం..  మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం..  అని 11 అక్టోబర్‌ 2004లో గుత్తికొండ బిలం అమరుడు చారుమజుందార్‌ స్మారక స్థూపం దగ్గర వేలాది మంది ప్రజల ముందు దేశంలోని కోట్లాది పీడిత ప్రజలకిచ్చిన మాట ఆయన నిలుపుకున్నాడు. అప్పటికొక 25 ఏళ్లుగా సాయుధ విప్లవాచరణలో ఉన్నాడు.  నల్లమల విప్లవోద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించాడు. సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే రెండు విప్లవ పార్టీల
సంపాదకీయం

ఈసారి లోపలి నుంచి…

చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని  కొందరు హితవు పలికారు.   వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద,
సంపాదకీయం

జైలు గోడల మీదా, ఆడవి అంచుల మీదా..

మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాడో తెలియదుగాని ఖైదీల పోరాటానికి ఆయన సంకేతం. జాతీయోద్యమం కాలంలో జితేందాస్‌ తదితరుల జైలు పోరాటాల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ 26, 1994 నుంచి 21 ఫిబ్రవరి 1995 దాకా జరిగిన  రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల పోరాటమే గుర్తుకు వస్తుంది. విప్లవమంటే స్వేచ్ఛా మానవుల నిర్మాణం. దాన్ని  ఈ సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే జైలు తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తుంది. మానవులంటే మానవ సంబంధాల సమాహారం.
సంపాదకీయం

వాకపల్లి అత్యాచారం నుంచి వైమానిక దాడుల దాకా

వాకపల్లి ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన వాళ్ల మీద   కేసును  ఏప్రిల్‌ 6న కోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజు ఇంకా తెల్లారక ముందే చత్తీస్‌ఘడ్‌లోని పామేడ్‌ ప్రాంతంలో భారత ప్రభుత్వం రెండో విడత వైమానిక దాడులు చేసింది. ఈ రెండు ఘటనలు వరుసగా జరగడం యాదృశ్చికం కావచ్చు. కానీ వాటి మధ్య పోలిక ఉన్నది. సంబంధం ఉన్నది.  ఈ రెండు ఘటనలకు మధ్య పదహారేళ్ల ఎడం ఉన్నది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆదివాసీ గ్రామం వాకపల్లి. ఆగస్టు 20, 2007న ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో విప్లవకారులను హత్య చేయడానికి  కూబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి మహిళల
సంపాదకీయం

‘రాహుల్‌ వాదం’ వినిపించాల్సిందేనా?

రాహుల్‌ గాంధీ ఉదంతాన్ని సాధారణ అధికార రాజకీయాల్లో భాగంగా చూడ్డానికి లేదు. పాలకవర్గంలోని ముఠా తగాదాగానే చూడ్డానికి లేదు.  దేశ రాజకీయాలు వేగంగా కొత్త దశలోకి చేరుకుంటున్నాయనడానికి ఇది గుర్తు. ఫాసిస్టు పాలనలో దేశమంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయి, అనేక మంది జైళ్లపాలై, అనేక మంది అనర్హతలను, నిషేధాలను, అణచివేతలను ఎదుర్కొంటున్న సందర్భంలో పాలక పార్టీ నాయకుడైన రాహుల్‌గాంధీకి కూడా అలాంటి అనుభవమే కలిగింది.  ఫాసిజానికి వ్యతిరేకంగా దేశమంతా  నిరసనలు, ఉద్యమాలు పదునెక్కుతున్న తరుణంలో రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అనేవి ప్రజా క్షేత్రంలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫాసిజం పాలకశక్తులను కూడా
సంపాదకీయం

అమరావతి ఎప్పటికీ వర్తమానమే…

వర్షం కురుస్తున్నప్పుడు ఆంధ్రుల రాజధాని ఎలా ఉంది అనే సందేహం దూరంగా ఉన్న తెలుగువారికి రావచ్చు. అమరావతి మునకలో ఉందా, లేదా వర్షపు నీటి వెలుపల ఉందా! ఇవి రెండు పాక్షిక సత్యాలు. 'నీరు పల్ల మెరుగు ' అనే సామెత తెలుగువారిదే. ఇరవై  ఎనిమిది   గ్రామాలు పూర్తిగా నీటిలో ఉండవు. కొన్ని గ్రామాలు ఉండవచ్చు. ముప్పై రెండువేల ఎకరాల లో రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు భోరున కురిసే వర్షానికి నీరు చేరడం సహజం. దానిని ఒక కాలపు రివాజుగా చూడాలి. వర్షం కురిస్తే భారతీయ నగరాలు జీవనదిలో ఉన్నట్లు ఉన్న దృశ్యాలు  సహజం. అమరావతి కూడా దీనికి
సంపాదకీయం

విప్లవం తీర్చిదిద్దిన మనిషి

ఆగస్టు 13న చత్తీస్ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం. వాళ్ల గ్రామస్థులు కావచ్చని, అందుకే వాళ్ల వివరాలు ప్రకటించడం లేదని అనుమానం. ఇప్పటికి పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసీ, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్. విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఎందరిని అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో .. చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తనా క్రమాలను ముందుకు నడుపుతుందో. ఇందులో పాల్గొనే కోటానుకోట్ల మందికి ప్రతినిధులనదగిన లక్షలాది మందిని ఉదాహరణలు
సంపాదకీయం

మావోయిస్టురహిత భారత్‌‍లో 2024 ఎన్నికలు

త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు.
సంపాదకీయం

శాంతి, సమానత్వం కోసం..

మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదన లక్ష్యం సాధారణ ప్రజల ప్రాణ రక్షణేనా? అంతకంటే విశాలమైన ఉద్దేశం మరేదైనా ఉన్నదా? హింస లేని సమాజం కావాలనే వాళ్ల కోరికను ఎలా అర్థం చేసుకోవాలి? అనే చర్చ జరుగుతున్నది. గతంలో మవోయిస్టులకు-ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలను చూసిన సమాజం అలిసిపోకుండా, నిరాశకు గురికాకుండా మళ్లీ అట్లాంటి ప్రయత్నానికి మానసికంగా సిద్ధమవుతున్నది. ఇది మన సమాజ స్థితిని ఎత్తిపట్టే బలమైన సూచిక. సమాజం చాలా చెడిపోయిందని, ఎవ్వరి గురించి ఎవ్వరికీ పట్టని చైతన్యరహిత దశకు చేరుకున్నదనీ కొందరు అంటూ ఉంటారు. ఇదేమీ దురభిప్రాయం కాదు. అవాస్తవం కానే
సంపాదకీయం

ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధ సేనాని

స్టాలిన్‌ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్‌ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్‌ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్‌ అజరామర పాత్ర మీద  అంతులేని