చదువు!
‘చదువు’ ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది. నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి. అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని










