ఇంటర్వ్యూ

నన్నిలా ఉండనీయండి

(మొదట్లో అరుంధతి రాయ్ కు తన జ్ఞాపకాలను రాయాలనే ఆలోచన రాలేదు . తనను బాగా ప్రభావితం చేసిన , చికాకు పెట్టిన తన తల్లి మేరీ రాయ్ చనిపోయిన తర్వాతనే (Mother Mary Comes To Me ) రాయాలని భావించింది . ఈ పుస్తకం మేరీ రాయ్ జీవితానికి ఒక కిటికీ వంటిది. మేరీ రాయ్ అంతగా విస్మరించాల్సిన మనిషి కాదు . శూన్యం నుండి బయలుదేరి క్రిస్టియన్ వారసత్వాల కింద పనిచేస్తూ, స్త్రీల  సమానహక్కుల కోసం కొట్లాడిన మనిషామె. కొట్టాయంలో ఆమె జీవితాన్ని ఒక సూపర్ హీరో లాగా నడిపించి, తన 89 సంవత్సరాల 
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజల్లోకి వెళ్లి రాసాను

(ప్రముఖ సాహిత్య, జీవిత చరిత్రల పరిశోధకుడు డా. కె ముత్యం *శ్రీకాకుళ విప్లవోద్యమం - తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 - 90 మధ్య పరిశోధన చేశారు. ఆ సందర్భంగా ఆయన శ్రీకాకుళ విప్లవోద్యమంతో, ఆ  సాహిత్యంతో  పరిచయం ఉన్న అనేక మందిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. వాటిని ఇటీవల ముత్యం  వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా అచ్చుకాని అభిప్రాయాలు ఇవి. ఇందులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ 9-3- 1987  కె ముత్యంతో పంచుకున్న అనుభవాలు పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) 1. శ్రీకాకుళం ప్రాంతమంతా మీరు కలెదిరిగారు
సాహిత్యం సంభాషణ

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
సంభాషణ

ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌ను కలవడానికి వెళ్లిన ఆదివాసుల అరెస్టు

సిలిగేర్‌ ఆందోళనగా మొదలై చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌లలో తొమ్మిది నెలలుగా సాగుతున్న సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటంపై పోలీసుల అణచివేత తీవ్రమైంది. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్ణయం లేకుండా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోడానికి వీల్లేదు. ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం గవర్నర్లకు విశేష అధికారాలను కట్టబెట్టింది. అయితే  సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటం పట్ల అటు ప్రభుత్వంకానీ, గవర్నర్లుగాని, రాజకీయ నాయకులుగాని  స్పందించడం లేదు.  దీంతో తమ సమస్యను గవర్నర్‌కు వివరించడానికి ఆదివాసీ యువకులు సిద్ధమయ్యారు. గవర్నర్‌ అనసూయ ఉయికే కొండగావ్‌లో ఉన్న విషయం తెలుసుకొని ఆదివాసులు ఈ ఉదయం (శుక్రవారం) బయల్దేరారు. వాళ్లు అక్కడికి
సంభాషణ

మీరు నడిచినంత మేరా…

‌రేపో, ఎల్లుండో కలుస్తారనుకున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఇక లేరని. తేరుకోవటానికి కొంత సమయమే పట్టింది. ‌పొడవుగా, చామనఛాయగా ఉన్న కా. రైను పరిచయం ఎఓబి నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు. దాదాపు పది సంవత్సరాల కిందట. ఎస్. ఎల్. ఆర్. తో ఠీవీగా ఉన్న ఆకారం. తన మాటల్లో అర్థమైంది, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని. కానీ తన తెలుగు ఉచ్ఛరణ గమ్మత్తుగా ఉండేది. ఎలాగంటే, చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు అస్మా బేగం మాట్లాడిన 'తురక తెలుగులా'.  . తను వచ్చిన పని
సంభాషణ

బస్తర్‍లో నిర్బంధ రూపాలు

(ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10తేదీల్లో హైదరాబాదులో జరిగిన ఆలిండియా సదస్సు ప్రసంగం) అందరికీ లాల్ జోహార్. ఈరోజు ఇంత మందిని చూసి నాలో కాస్త ఆశ కలిగింది. మనం ఎప్పుడూ బస్తర్ గురించే మాట్లాడుతుంటాం, అందరూ దాని గురించే చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఇదే అతి పెద్ద సమస్య. ఎంతకాలమని చనిపోతూ వుంటాం? ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, దేశానికి వివరించాలి. పోరాటం ఎందుకోసం జరుగుతోంది? నక్సలిజం అనే ఒక పదాన్ని పదే పదే వాడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల
ఇంటర్వ్యూ సంభాషణ

సీమ ఆకాంక్ష‌ల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యం

రాయలసీమ సమాజం ఆశలను, ఆకాంక్షలను సభ్య సమాజం ముందుంచడానికి రాయలసీమ సాగునీటి సాధన సమతి, రాయలసీమ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల సారాంశాలను విస్తృతంగా సమాజం ముందుంచడంలో, వారికీ అవగాహన కల్గించడంలో, చైతన్యం కల్గించడంలో  పత్రికా రంగం  ప్రధాన పాత్ర వహించాల్సివుంది. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన, వెనుబడిన ప్రాంతాల సమస్యలతో పాటు వాటికీ నిర్దిష్ట పరిష్కార మార్గాలను  రాజకీయ వ్యవస్థకు ముందుంచడంలో కుడా  పత్రికా రంగం  బాధ్యతాయుత పాత్ర  వహించాల్సివుంది.  ఆ దిశగా “వసంతమేఘం’ సంపాదకులు, నిర్వహకులు క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికీ ముందుగా అభినందనలు.  అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోస్తా
నివేదిక సంభాషణ

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు