సంభాషణ

Mother’s anguish

That was January 2024 New Year. The world was full of happiness. Some people drunk at 12 midnight, may have drunk again in the morning before the dizziness subsided and drowned in happiness. We adivasis do not know such things. We have since 2005, tears of hardship, Greenhunt since 2017, Samadhaan since 2022 and then Surajkund attack. We don't know what the new year means. All we know is how
పత్రికా ప్రకటనలు

నిర్బంధంలో ఆదివాసీ నేతసుర్జు టేకమ్‌

సర్వ ఆదివాసీ సమాజ్ ఉపాధ్యక్షులు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్, సుర్జు టేకమ్‌ను 2024ఏప్రిల్ 2  న క్రూర ఉపా, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్  కింద అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. సుర్జు "మావోయిస్ట్ సానుభూతిపరుడు" అనే సాకుతో తెల్లవారుజామున 4 గంటలకు, ఛత్తీస్‌గఢ్‌లోని మన్‌పూర్-మొహ్లా-అంబగఢ్ జిల్లాలోని కల్వార్ గ్రామంలోని అతని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, అతని ఇంట్లో జరిగిన మొదటి దఫా సోదాలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి ఏమీ దొరకలేదు. కానీ ఆ తర్వాత వారు తిరిగి లోపలికి వెళ్లి, సర్జు టెకామ్ మావోయిస్టు సానుభూతిపరుడు,
కవిత్వం

కగార్  యుద్ధం

తల్లి అయితేనేం ఒడిలో పసిపిల్ల అయితేనేం తూటా తుపాకి నుంచి దూసుకొచ్చిందంటేనెత్తురు తాగకుండా నేల రాలదుముగ్గురయితేనేం మావోయిస్టులు పదముగ్గురయితేనేంపట్టాలు తప్పిన డబుల్‌ ఇంజన్‌ రైలురక్తదాహానికి నాలుగు నెలల్లో ఏభయి అయితేనేం ఎందరయితేనేంమనుషులుగా ఆటంకమైన వాళ్లందరూఅసువులు బాయందే అడవిలో కంపెనీ కాల్మోపలేదుపక్షులయినా అడవిలో కాయో పండో తిని విహాయసంలో ఎగిరినపుడు విత్తనాలు వెదజల్లుతాయిఎదురిచ్చే కృతజ్ఞతతో బాక్సైట్‌ దోచుకొని ఆకాశంలోకెగిరిన భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు మాత్రంచెట్టు చేమలనూ, జనావాసాలనేకాదునేల సారాన్ని ధ్వంసం చేసి ఆదివాసీ ఉసురు తీసిగానీ ఎగురవు అర్థంకాని పరాయి లోకపులోహ విహంగం ఆకారంగాహృదయ రహిత రాజ్యం నీడగామనుషుల మధ్య భీతావహంగా అసహ్యంగాలూటీ సర్కారు జనతన సర్కార్‌సరిహద్దుల్నే చెరిపేసేదాక
సంపాదకీయం

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర కోసమే కగార్‌

కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే
వ్యాసాలు

ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

ఇండియాలో స్త్రీలు అనగానే కట్టు బొట్టు అంటూ మొదలుపెడతారు. అందం మాటున అణచివేత ఉంది. సాంస్కృతిక కట్టడి ఉంది. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఆహార్యం స్త్రీలకు నిర్దేశితమైంది. తరాలు మారినా, ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా ఇష్టంగానో అయిష్టంగానో ఈ గుదిబండను స్త్రీలు మోస్తూనే ఉన్నారు. ‘తగలెయ్యాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్త్రీవాదులతో సహా. ఎందుకంటే అది వదిలించుకోవడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది సమాజంలో నీ ఉనికిని, గుర్తింపును, గౌరవాన్ని నిర్దేశించేది. ఒక కుటుంబానికి సంబంధించిన, సమూహానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల భారాన్ని మోయవలసింది స్త్రీలే.
సంపాదకీయం

టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం.  వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లోశాంతి చర్చలు

ఏ రాజకీయ పార్టీ (కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి) అధికారంలో ఉన్నా వర్గ పోరాటానికి సంబంధించి సామ్రాజ్యవాద ` భూస్వామ్య (అర్ధ వలస ` అర్ధ భూస్వామ్య) దళారీ రాజ్యానికి విప్లవోద్యమం పట్ల ఒక దీర్ఘకాలికమైన వ్యూహం, ఆయా సందర్భాలకు ఎత్తుగడలు ఉంటాయి. 2004లో కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి మావోయిస్ట్టు పార్టీ ప్రతిపాదించిన ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి చర్చలకు పిలిచింది కానీ పీపుల్స్‌వార్‌తో చేసిన చర్చల ప్రతిపాదనను అది ఎం.సి.సి. వంటి మరో సాయుధ విప్లవ పార్టీతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి చర్చలకు వచ్చిందనే ఎరుక కలగగానే రెండవ విడత చర్చల వాగ్దానాన్ని
సంభాషణ

తల్లి ఆవేదన

అది జనవరి 2024 కొత్త సంవత్సరం. ప్రపంచం సంతోషంలో మునిగి ఉంది.  కొంతమంది రాత్రి 12 (ఉదయం అనుకోవచ్చు) తాగిన మైకం గూడ దిగక ముందే పొద్దున మళ్ళీ తాగి సంతోషంతో మునిగి పోయి వుండొచ్చు. మాకు ఆదివాసులకు అలాంటివి తెలియవు. మాకు 2005 నుండి, కష్టాలు కన్నీళ్ళ, తర్వాత గ్రీన్‌హంట్‌ 2017 నుండి సమాధాన్‌ 2022 నుంచి సూరజ్‌కుండ్‌ దాడి  జరుగుతూనే వుంది. అందుకే కొత్త సంవత్సరం అంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈరోజు మంచిగా ఎలా గడుస్తుందనే. అదే మాకు  మంచి రోజు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్‌ తర్వాత ఎక్కువ కేంద్ర బలగాలు ఉన్నది
stories

Teachers

‘It looks like our comrades who have gone to the village have returned’. As soon as they heard these words, some of the guerillas walked towards the make-shift kitchen holding mugs in their hands. The place they call kitchen has not yet taken the shape befitting the name. A make-shift stove was made by placing three stones in a triangular shape. Fire was lit by gathering firewood and placing it
దండకారణ్య సమయం

ఏకకాలంలో శాంతి చర్చలు – సైనిక చర్యలు

దేశంలో దండకారణ్యం వంటి విశాలమైన ఆదివాసీ ఆవాస భూగోళంలో, జనతన రాజ్యం వంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అక్షరాలా సాయుధ వర్గ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడుతూ ఎన్‌కౌంటర్‌లు మొదలు కేంద్ర ప్రభుత్వ వాయు సైన్య ఆకాశ బాంబింగ్‌కు కూడ గురవుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌ రాష్ట్రాలు మొదలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమాజాలు జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌ (ఆదివాసి స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు ప్రతిఘటన మాత్రమే కాదు, ఇంకా విస్తృతార్థంలో అస్తిత్వ స్వీయ గౌరవ చైతన్యం)లను కాపాడుకోవడానికి నూతన పోరాట రూపాలు ఎంచుకుంటున్నారు. అటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణ రూపాలను