దశ -1
••
మొదట్లో తాత, తాత ముత్తాత పుట్టబోయే బిడ్డ ఆడదని గుర్తించి చంపేశాడు!
తరువాత అది వంశ పారంపర్య ఆచారంగా స్థిర పడి పోయింది!
కిచ కిచ లాడే పక్షి ఎవరికి కావాలి చెప్పండి?
దాని కోసం పాపం
అమ్మ ఒక్కతే ఏడ్చింది!
పుట్టింది ఆడపిల్ల మరి!
వాళ్ళు వదిలించుకోవాలని ఆదేశించారు!
~
బాత్రూమ్ నేలకి ఆ ప్రవాహం ఏంటో బాగా తెలుసు.
మరణంలో కూడా అది ఎర్రగానే ఉంది!
ఆ రోజు నాన్న ఒక అదనపు బకెట్ నీళ్లు తెచ్చాడు!
భారం తుడిచిపెట్టటానికి ఆ అదనపు బకెట్ నీళ్లు సరి పోయాయి!
~
దశ -2
దూద్ పీతీ
••
ఎక్కడ నుంచి వస్తోంది ఆ పీక నొక్కేయబడిన శిశువు గొంతులోంచి ఆ రోదన?
వెంటనే నిశ్శబ్దం అయిపోయింది!
చచ్చిపోయిన కూతురుతో, పాలతో ఆ బకెట్ బరువుగా ఉంది.
అవును మరి చనిపోయిన కూతురెప్పుడూ,బతికున్న కూతురి కంటె కూడా చాలా తేలికగా ఉంటుంది!
అతనికెప్పుడూ కొడుకుని మోయడం కోసం ఒక వదులైన భుజం కావాలి!
~
దశ -3
"అన్నీ ఆసుపత్రులలో - అన్ని చోట్లా"!
ఎందుకు శాపాలన్నీ ఆడదాని శరీరంతో ఉన్నాయి?
మన ఆడవాళ్ళ భాష అంతా కూడా రేపిస్టులతో అనుసంధానించబడి ఉంది?
ఎందుకు రేప్ బాధితురాళ్ళందరూ వొంటి నిండా రక్తపు గాట్లతో చెక్కబడిన శాపాలను మోస్తున్నారు!
ఎందుకంటే, కొడుకు!కొడుకు!కొడుకు!
అవును! కోట్లమందికి పట్టిన పిచ్చి కాదూ ఇది?
కొడుకే కావాలన్న సామూహిక పూనకం కాదూ ఇది?
~
దశ -4
~
అవును! ఎందుకు శాపాలన్నీ ఆడదాని శరీరంతో
రక్తపు గాయాల గాట్లతో చెక్కబడి ఉన్నాయి?
~
వైద్యుడు స్త్రీ శవాన్ని కోస్తాడా?
ఆ దరిద్రపు ముండల శరీరం నుంచి భరించలేని ఖంపు వస్తుందని ముక్కు మూసుకుంటాడు!
~
ఇక బయట అధికారులు ఇష్టమొచ్చినట్లు తీర్పులు ఇస్తూంటారు.
ఆమె సెమినార్ హాల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంది?
ఆమె ఎందుకంత పొట్టి బట్టలు వేసుకుంది?
ఆమె ఎందుకు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నది?
ఆమె తన ప్రేమికుడితో రాత్రి బయటకి ఎందుకు వెళ్లాలి?
రేప్ కాదా మరి?
అవును!
ఎందుకు?ఎందుకు?ఎందుకు?
చెప్పండి మీరే!
~
దశ - 5
రాత్రిని సొంతం చేసుకోవడం
••
మాకు న్యాయం కావాలి!
అవును మాకు న్యాయం కావాలి!
దుఃఖంతో వాళ్ళ గొంతులు ఆక్రోశిస్తాయి.
ఈ దేశపు దేవతలు కూడా భయంతో కంపించి పోతుంటారు!
రాత్రులలో పనుల మీద ఒంటరిగా ప్రయాణించే స్త్రీల మీద జరిగే లైంగిక అత్యాచారాలను ఖండిస్తూ వాళ్ళు న్యాయం అడుగుతున్నారు!
~
ఓహ్! వాళ్ళ చుట్టూ ఎన్నెన్ని కథలూ - లెక్కకు మించి పురుషులు?
అయినా కొంత మంది మొండిగా భయం లేని రాత్రుళ్ళని స్వంతం చేసుకోవాలనుకుంటున్నారు!
సరైన పదాల కోసం పుస్తకాల్లోని కాగితాలను చిందర వందర చేస్తున్నారు!
~
అదే సమయంలో వాళ్ళ పురుషులందరూ దళంగా దడి కడతారు!
బాధ్యత తీసుకుంటారు!
పెత్తనం చేస్తారు!
ప్రమాణాలు కూడా చేస్తారు!
లాఠీ ఛార్జ్ చేస్తారు!
బాధితురాళ్లనే నిందిస్తారు!
నోరెత్తితే రేప్ చేసిపడేస్తామని బెదిరిస్తారు!
~
కానీ ఆ స్త్రీల గొంతులు చాలా పెద్దవి!
ఇకనేం! నల్లని రాత్రిని కప్పిన వస్త్రానికి నిప్పు అంటుకుంది.
రాత్రి కన్నులు రక్త కన్నీరు కారుస్తాయి!
~
(Doodh Peet: నవ జాత ఆడ శిశువుల్ని ఆవు పాలల్లో ముంచి హత్య చేయడం భ్రూణ హత్య)
Related