వాళ్లకు
చీమలు సంఘటితంగావడం
ఇష్టముండదు
అవి రాజకీయాలమీద,సమాజం మీద
మాట్లాడడమూ ఇష్టముండదు

చీమలు పుట్టేది
రాణిగారి గుడ్లనూ , ఆహారాన్నీ
మోయడానికేనని
వాళ్ళ నిశ్చితాభిప్రాయం

నిస్సందేహంగా
చీమల ధిక్కార భాష అంటే
వాళ్లకు పరమద్వేషం

కాబట్టి
చీమలు చేయి దాటి పోతున్నట్టనిపిస్తే
వాళ్లు కాళ్ళ కింద తొక్కేస్తారు

Leave a Reply