1.	*సామ్రాజ్యాలు పతనం చెందాల్సిందే*! 
మౌమితా ఆలం.
....
రెడ్ ఫోర్ట్ లో ఔరంగజేబు తన తండ్రిని బంధించిన జైలుని చురుకైన గైడ్ ఒకడు వివరిస్తున్నాడు!
సరిగ్గా జాలీ ల వెనక పరిపక్వమైన సూర్యాస్తమయం లోకి మునిగి పోతున్న తాజ్ మహల్ అందంతో సహా!
నేను అతనికి 300 రూపాయలు ఇచ్చి నమస్కారం పెట్టేసాను!
~~
అతను వెంటనే *జైశ్రీరామ్* అన్నాడు.
ఇక నేను నా పేరుని పైకి చెప్పలేక పోయాను.
అది విన్నదో ఏమో మరి ?
దివాన్ -ఏ -ఖాష్ లోపల
రాజు విరిగిన కిరీటం మీద అప్పుడే ఒక పావురం మలవిసర్జన వదిలి రివ్వున ఎగిరిపోయింది!
ఆ క్షణంలో నాకు చాలా శాంతిగా అనిపించింది!
315 రోజులు నాకు కేవలం సంఖ్యలుగా మాత్రమే కనిపించాయి!
నిజానికి ప్రతి రాజ కిరీటం మీద ఈ రకంగా మలవిసర్జన జరిగి తీరాల్సిందే
ఏమంటారు?
--------------------------------------------------------------------------------
2. *ఆగ్రా*!
నగరంలో మరో నగరం నిద్రపోతోంది!
కానీ చూడండి!
యమునా నది ఒడ్డున రాజు ఇంకా విషాదంలోనే మునిగి ఉన్నాడు!
*
ఇక్కడ ఎవరూ కూడా రాజుగారి కోట శిధిలాలను చూసి సంబరాలు చేసుకునే వాళ్ళు లేరు!
కానీ ఎన్నటికీ అంతం కాని ప్రేమని ఉత్సవం చేసుకోవడానికి మాత్రం అక్కడ చేరుతున్నారు.
*.
ఇకనైనా ఓడి, శిధిలమైన పోయిన రాజా ప్రసాదాల కంటే కూడా ప్రేమికుల ప్రేమ మాత్రమే గెలుస్తుంది అనడానికి మీకు ఇంకా సాక్షాలు కావాలా చెప్పండి!

3. *ప్రేమ గానం*!
~~
తాజ్ మహల్ గుండెల్లో ఇమిడిపోవడానికి నాకు రాజకుమారిగా కావడం ఇష్టం లేదు! కడ ఊపిరి దాకా,తాము గుడ్డివాళ్ళై పోయినా సరే అందమైన తాజ్ మహల్ ప్రతి అంగుళాన్ని తీర్చిదిద్దిన చిత్రకారుడు లేదా శిల్పి యొక్క ప్రేమకు నోచుకునే భార్యగా ఉండడమే నాకు ఇష్టం!
...
చలన రహితంగా అక్కడ సమాధి కాబడటాన్ని నేను ఏమాత్రమూ ఇష్టపడను!
దాని బదులుగా రాజు కోసం కాలాన్ని జయించి నిలిచే తాజ్ మహల్ అనే మధురమైన ప్రేమ గానాన్ని సిద్ధం చేసిన ఆ కళాకారుల పక్కన కూర్చోవడానికే ఇష్టపడతాను!


4. తాజ్ మహల్
ప్రియా ప్రేమంటే ఏంటి కాస్త చెబుతావా?
ప్రేమంటే తాజ్ మహలా?
కాదేమో కదా?
ఆ తెల్లని పాలరాతి కట్టడాలు ఏం చెబుతున్నాయి?
అంతఃపురంలో ఎంతోమందితో
స్పర్శించబడినా కానీ ఎవరికీ చెందని
ఏమీ అనుభూతి చెందని
పేరు కూడా తెలియని రాణుల ఖాళీ గుండెల్లో అవిశ్రాంతంగా నిండిన కాళీ తనానికి సాక్షాలు కావా ఆ పాలరాతి కట్టడాలు?
...
చూడు పొరపాటున కూడా నన్ను నీ రాణిగా మాత్రం పిలవకు!
దాని బదులు నా మనసుని లోతుగా స్పర్శించి
నన్ను ఊపిరాడనీయకుండా చుట్టుముట్టిన
మధురమైన అనుభూతిగా మిగిలిపో చాలు!
...
అవునూ ఇంతకీ ప్రేమంటే ఏంటి ప్రియా ?
నీ కళ్ళు కరిగిపోయి
నా అధరాలలోకి నిండిపోయి సముద్రమై, ముంచిన తుఫాను కాదా ప్రేమంటే చెప్పు?

Leave a Reply