చాలా సంవత్సరాలుగా 
ఉత్తరాల్లేవ్

ప్రతిరోజు
నా చేతుల్లో మాత్రం
వెలిసిపోయిన చెల్లాచెదురైన అక్షరాలు దర్శనమిస్తాయి

నాది గాని భాష
కాల శిల్పం మీద చెక్కబడినట్లుగా అక్షరాలన్నీ గజిబిజిగా
చెత్తాచెదారం నిండిన మార్కెట్ లాగా
అస్తవ్యస్తమై పరుచుకుని ఉంటాయి

వార్త కోసమో
దుఃఖం కోసమో
సంతోషం కోసమో
ఒక్క లైన్ అయినా
ఒక నిండైన వాక్యమైనా
చదవాలనిపించదు

చాలాకాలంగా
ఉత్తరాల్లేవ్!

మరణించిన మనిషికి
ఉత్తరాలు ఎవరు రాస్తారు....
**

నాసర్ రభా,(పాలస్తీనా) "no mail for years.".కు స్వేచ్ఛానువాదం
అనువాదం : ఉదయమిత్ర

Leave a Reply