పోలీసు, అర్ధ సైనిక, సైనిక జవాన్ లారా!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గత 50 సంవత్సరాలకు పైగా మన దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తోంది. భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మిమ్మల్ని పెద్ద సంఖ్యలో పాలకులు మోహరిస్తున్నారు. ఇప్పటికే దేశానికి ఉత్తరాన కశ్మీర్ లో, ఈశాన్యాన అసోం నుండి అరుణాచల్ ప్రదేశ్ ల వరకు లక్షల సంఖ్యలో మిమ్మల్ని మోహరించారు. మధ్య, తూర్పు భారత రాష్ట్రాలలో మీరు ఆరు లక్షలకు పైగానే మోహరించబడి ఉన్నారు. ఇటీవల 2019 డిసెంబర్ లో జాతీయ భద్రతా సలహాదారు విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నూతనంగా విప్లవోద్యమం నిర్మూలనకు నిర్ణయాత్మక దాడి జరుపాలని ప్లాన్ జరిగింది. దానికి ఆపరేషన్ ప్రహార్ అనే పేరు ఖాయం చేశారు. ఆ ఆపరేషన్ 2020 నవంబర్ లో మొదలైంది. అది 2021 జూన్ వరకు జరుగుతుందన్నారు. ఆ నిర్ణయాత్మక దాడిలో భారత సైనికులను కూడ మొహరిస్తారనే విషయం 2020 మార్చ్ 21నాడు సుక్మా జిల్లా మినప వద్ద జరిగిన కాల్పులలో దొరికిన ఆధారాలతో తేలిపోయింది. కాబట్టి మీరు ఆపరేషన్ ప్రహార్ లో పాలుపంచుకోకూడదనీ విప్లవోద్యమం విజ్ఞప్తి చేస్తోంది.
భారత జవాన్ సోదరులారా!
ఇది దేశ వనరుల లూటీ కోసం జరుగుతోన్న మొహరింపు. దేశంలో నూతనంగా ఏర్పడిన ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు అపార ప్రాకృతిక వనరులకు నిలయాలు. అవి ఆదివాసీ మూలవాసీ ప్రజల ప్రాచీన నివాస కేంద్రాలు. వారిని విస్థాపితులను చేసి అక్కడి వనరులను తరలించుకు పోవాలని దేశీయ, విదేశీ కార్పొరేటు వర్గాలు దీర్ఘకాలంగా పథకాలు రూపొందిస్తున్నాయి. కానీ వారికి అది సాధ్యం కావడం లేదు. వారి పథకాలన్నీ విప్లవోద్యమం మూలంగా వమ్మ పోతున్నాయి. వారు బడా కార్పొరేటు వర్గాల ప్రయోజనాల కోసం సల్వాజుడుం, కేంద్రాలను నడిపారు. అవి ఓడిపోయాక ఆపరేషన్ గ్రీన్ హంట్ ను మొదలెట్టారు. దాన్ని 2017లో సమీక్షించుకొని ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించారు. ఇపుడు అందులో భాగంగానే ప్రహార్ నిర్ణయాత్మక దాడి మొదలైంది. పాలకవర్గాలకు మీరు కేవలం ఆయుధాలవుతే, ఆ ఆయుధాలకు ప్రజలు బలవుతున్నారు. ఈ హత్యాకాండను విప్లవోద్యమం తీవ్రంగా ఖండిస్తున్నది. గత 15 సంవత్సరాలలో వేలాది ప్రజలను మీరు బలిగొన్నారు. వారంతా దేశ ప్రాకృతిక వనరులను కాపాడడానికి మీతో పోరాడక తప్పని మూలవాసీ ప్రజలు. వారిని చంపడానికి మీరు అడవులలోకి రావడాన్ని భారత రాజ్యాంగమే ఆయోదించదు. మీరు మీ రాజ్యాంగాన్ని పాటించండి. మీరు అడవులలో గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించడానికి మీకు ఇప్పటికి పదేళ్ల క్రితమే మాడ్ కొండలలో మీ అధికారులు మీకు శిక్షణను ఇచ్చారు. అప్పటి నుండి ఆ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను గుర్తించండి. వారి న్యాయమైన పోరాటాలతో మమేకం కండి. దేశ ప్రజల, వనరుల రక్షణకు మీరూ తోడ్పడండి.
జాతీయవాదులుగా, దేశభక్తులుగా మీరు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చండి. మావోయిస్టులను నిర్మూలించే పేరుతో మిమ్మల్ని దేశ పాలకులు, మీ అధికారులు రెచ్చగొడుతూ అడవులకు పంపుతున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోండి. మీ అధికారుల నైజాన్ని తెలుసుకోండి. మీ జీవితాలను, ప్రజల జీవితాలను దోపిడీ పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయకూడదని నా విజ్ఞప్తి. మనమంతా కలిసి మన దేశాన్ని దోచుకుంటున్న దోపిడీ శక్తులతో పోరాడుదాం. మీ పాలకులు వామపక్ష ఉగ్రవాదులుగా పేర్కొనే విప్లవోద్యమం మన దేశంలో ఎందుకు యాభై ఏండ్లకు పైగా పోరాడుతుందో మీకు ఇక్కడ స్పష్టం చేస్తాను.
విప్లవోద్యమం ప్రజల ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి దీర్ఘకాలంగా పోరాడుతున్నది. మనకు 1947లో దొరికింది నిజమైన స్వాతంత్ర్యం కాదనీ, అది నామమాత్రమైనదేనని ఉద్యమం ప్రజలకు తెలుపుతోంది. మన దేశంలో అధికారం భూస్వాములకు, టాటాలు, బిర్లాలు లాంటి దళారీ పెట్టుబడిదారులకే దక్కిందనే వాస్తవాన్ని విపవోద్యమం ప్రజలకు చెపుతున్నది. నామమాత్ర స్వాతంత్ర్యానంతరం మన దేశంలో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. రెండు వర్గాల మధ్య అంతరం ఎన్నడూ లేనంతగా పెరిగిపోతోంది. ప్రపంచ మార్కెట్ లో మన దేశాన్ని రోజూ మన పాలకులు పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల అమ్మకాల ద్వార వేలం వేస్తున్నారు. మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. దేశ ప్రజల ప్రాథమిక హక్కులను అందులో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలూ అందులో ఉన్నాయి. కానీ, అవి ఏవీ పేదలకు, శ్రమ జీవులకు దక్కడం లేదు. దేశ ప్రజలకు రాజకీయ సమానత్వం లభించిందనీ బాబా సాహెబ్ అంబేడ్కర్ నిజాయితీగానే నమ్మాడు. కానీ, గత 75 యేండ్ల మన దేశ చరిత్రను నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా అదంతా ఉత్తదేనని సులభంగానే బోధపడుతుంది. కాబట్టి మనం నిజమైన ప్రజల స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, ప్రజాస్వామ్యం కోసం కలసి పోరాడుదాం. రండి, మాతో భుజం భుజం కలపండి. దండకారణ్యం, బిహార్-ఝార్ఖండ్ లోకి నూతనంగా లేదా ముసుగు రూపంలో భారత సైన్యాలను దింపే కుట్రలను వమ్ముచేయండి.
మన దేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. మన దేశంలో ప్రస్తుతం 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ప్రధానమైన మన దేశంలో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు దున్నుకోవడానికి భూములు కావాలనీ మా పార్టీ పోరాడుతోంది. పారిశ్రామిక కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు శ్రమకు తగిన ఫలితం దక్కాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ దేశంలోని భూములు, పరిశ్రమలు శ్రామిక ప్రజలకు చెందాలనే లక్ష్యంతో విప్లవోద్యమం పోరాడుతున్నది. మన దేశంలోని ప్రజల మధ్య అంతరాలను, అంటరానితనాన్ని కుల వ్యవస్థ పెంచి పోషిస్తూ మనుషుల మధ్య సమానత్వానికి, సోదరభావానికి, స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలకు అడ్డుగోడగా నిలిచింది. దానిని నిర్మూలించాలని విప్లవోద్యమం పోరాడుతోంది. మహిళలు పితృస్వామ్య సంకెళ్ల మధ్య బ్రాహ్మణీయ మనువాద సంప్రదాయాలతో నలిగిపోతున్నారు. మహిళలేని విప్లవోద్యమం లేదని విశ్వసిస్తూ ప్రీ-పురుషులు సమానమనే అవగాహనతో మహిళా విముక్తికి పాటుపడుతోంది. మన దేశంలోని నిరుపేదలకు, దళితులకు, ఆదివాసులకు, ముస్లింలకు కనీసం విద్యా వైద్య సౌకర్యాలు లేకుండా, బాబా సాహెబ్ ఆశించిన రిజర్వేషన్లు అందకుండా పోతున్నాయి. అవి సంపన్నులకే లభ్యమవుతున్నాయి. ఈ తారతమ్యాల వ్యవస్థ మారాలనీ విప్లవోద్యమం పోరాడుతోంది. అందుకు విప్లవోద్యమం దీర్ఘకాల ప్రజాయుద్ధ మార్గాన్నెంచుకున్నాం. మీరు ఈ సమస్యలలో భాగం. మీ గ్రామాలు, మీ కుటుంబాలు, మీ జీవితాలు వీటికి అతీతం కాదు. కాబట్టి మీరు ఈ సమస్యలపై పోరాడాలి. మాతో కలిసి ప్రజలలో ఒకరుగా పోరాడాలి. రండి మనం కలిసి పోరాడుదాం. పోరాడే ప్రజల పక్షం మేమంటూ మీరు చాటండి.
పాలక వర్గాల భద్రతా బలగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీరు తమ హక్కుల కోసం, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న దేశ పీడిత ప్రజలను మీ ఉక్కు పాదాలతో అణచివేస్తున్నారు. న్యాయమైన కార్మికుల ఉద్యమాలను, రైతుల పోరాటాలను, దళిత ఉద్యమాలను, ఆదివాసుల తిరుగుబాట్లను, మహిళల పోరాటాలను, విద్యార్థుల ఉద్యోగుల సమ్మెలను, ఖైదీల నిరహార దీక్షలను మీరు మీ ప్రభుత్వాధికారుల ఆదేశాల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా మీ లాఠీలతో, తుపాకులతో దౌర్జన్యంగా అణచివేస్తున్నారు. మీరు సమ్మెలకు దిగితే! మీ పైకీ మీ పైవారు అవే ఆయుధాలతో దిగుతారు. కానీ, మన దేశంలో ఎవరు ఎందుకు పోరాడుతున్నారో మీరు నిజాయితీగా ఆలోచించండి. వారంతా మీకు చెందినవారే! మీ వాళ్లే! వాళ్ల సమస్యలు మీ సమస్యలు వేరు కాదు. వారి నుండి, వారి సమస్యల నుండి మీరు విడివడిలేరు. మీకు వేతనాలు లభిస్తున్నది దేశ ప్రజలు ప్రభుత్వాలకు చెల్లిస్తున్న శిస్తులు, పన్నులు, లెవీల నుండే. దీన్ని గ్రహించండి. అత్యున్నత అధికారులు, పాలకులు మిమ్ములను అడ్డు పెట్టుకొని వారిని దోచుకుంటూ పరాన్న జీవులుగా జీవిస్తున్నారు. విప్లవోద్యమం ఇది మారాలని పోరాడుతోంది. మేం పోరాట ప్రజల పక్షం. మీరూ పోరాట ప్రజల పక్షం నిలవాలి. వారి పై మీ థర్డ్ డిగ్రీ పద్ధతుల శిక్షణా సామర్థ్యాన్ని ప్రదర్శించకండి. దుర్మార్గ అధికారుల మాటలకు మోసపోకండి.
ప్రజల పక్షాన నిలిచి పోరాడేవారిని దోపిడీ ప్రభుత్వాలు ఉగ్రవాదులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా, విచ్చిన్నకులుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజల ప్రజాస్వామిక, పౌర హక్కుల గురించి మాట్లాడేవారిని వారి అనుయాయులుగా చిత్రిస్తున్నాయి. మత సామరస్యం, కుల నిర్మూలనం, అంటరానితనం, లౌకికవాదం, హేతువాదం, మహిళా సమానత్వం బోధించేవారిని హిందూ మత వ్యతిరేకులుగా దుమ్మెత్తి పోస్తున్నాయి.
జాతుల ఆకాంక్షలను వ్యక్తం చేసేవారిని వేర్పాటువాదులుగా ఉగ్ర ధ్వజమెత్తుతున్నాయి. ఈ దేశం హిందువులదనీ, ఇక్కడ హిందువులే ఉండాలనీ, రాముడే దేవుడనీ హిందుత్వ పాలకులు, కాషాయ బ్రిగేడ్ శక్తులు కట్టుకథలతో ప్రజలకు మత విద్వేష మత్తెక్కిస్తున్నారు. వీరి మత మౌఢ్యాన్ని, అశాస్త్రీయ భావాలను మా పార్టీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నది. మీరు శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోండి. ప్రజలే గురువులుగా వారి నుండి నేర్చుకోండి. వారికి నేర్పండి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు మత విద్వేషానికి గల లంకెను గ్రహించండి.
పోలీసులను, అర్ధ సైనిక బలగాలను, భారత సైనికులను విప్లవోద్యమం వర్గ సోదరీ సోదరులుగానే గుర్తిస్తుంది. మీరు మీ విధుల నిర్వహణలో పై అధికారులకు బానిసల్లా ఉండక తప్పడం లేదని తెలుసు. కార్మికులంతా వేతన బానిసలే అన్నాడు కార్ల్ మార్క్స్. మీరు మీ విధుల నిర్వహణలో ఉద్యోగులకు చెందాల్సిన చట్టపర హక్కుల నుండి వంచించబడుతున్నారు. మీరు మీ కుటుంబాలకు దూరంగా ఎక్కడో విధులలో ఉంటూ మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మీ బాధలను ఎవరితోనూ పంచుకోలేని ఏకాంతంలో జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. మిమ్మల్ని అణచివేత యంత్రాలుగానే మీ ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయన్న వాస్తవం. మీలో కొందరిని ఎంపిక చేసి కరుడుగట్టిన హంతకులుగా మారుస్తు కమాండోలంటూ, కూరమైన జంతువుల పేర్లు తగిలిస్తున్నారు. వాళ్ల దృష్టిలో మీరు రేసు కుక్కలు, గద్దలు, తేళ్లు, త్రాచులు, గండు పిల్లులు. మీ జీవితాలను అలాగే మలుస్తారు. పైపూతలా ‘పోలీసు మిత్ర’ పేరు పెట్టుకున్నంత మాత్రాన బుద్ధి మారదు. పోరాడే మహిళలను చెరపట్టే దుర్మార్గానికి మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు. మీలోనూ మహిళా కమాండోలను ఏర్పరుస్తున్నారు. వారి జీవితాలు ఎంత ఘోరంగా అఘోరిస్తున్నాయో దిన పత్రికలే చెపుతున్నాయి. మీలో మానవత్వాన్ని మిగల్చకుండా చేస్తున్నారు. అందుకే మీరు మనుషులుగా జీవించాలంటే మనుషుల మధ్యకు రండి. మానవ విలువలు తెలియని హీన సంస్కృతికి మట్టు పెట్టండి.
మీరు సెలవులకు నోచుకోకుండా విధులు నిర్వహించే చోట ఎదురవుతున్న ఒంటరితనం, వివక్ష, అభద్రత, అవమానాలతో ఎదురవుతున్న అనేక వత్తిళ్లను తట్టుకోలేక మీరు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు లేద పరస్పరం కాల్చుకుంటున్నారు. మీ వత్తిడి నివారణకు మీ అధికారులు ‘రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించినట్టు’ మీకు సంగీతం విన్పిస్తున్నారు. మీ జీవితాలు నరకప్రాయం అనేది హృదయం ఉన్నవారు కాదనలేరు. మిమ్మల్ని మీ అధికారులు కనీసం సాటి మనుషులుగానైనా గుర్తించరనే విషయం మీకు అనుక్షణం ఎదురవుతుంది, కాదంటారా! మేం మిమ్ములను సైతం మీ సమస్యలపై పోరాడాలనే విప్లవోద్యమం చెపుతున్నది. విప్లవోద్యమం మీకు అండగా ఉంటుందని, మీ పోరాటాలకూ నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేస్తున్నాం. మీ అధికారులు చెప్పే అబద్దాలను నమ్మకండి. వాస్తవాలను ప్రజల నుండి తెలుసుకోండి. పాఖండీ ప్రభుత్వాల కాఠిన్యం ఎలాంటిదంటే మీచేతనే పోరాడే ప్రజలను అంటే మీ కన్నవారిని, తోబుట్టువులను, మీ సహచరులను, మీ బంధు మితృలనే హత్య చేయిస్తున్నారు. దీనినే బ్రాహ్మణవాద చాణక్యం లేద రాజనీతి అంటారు.
భారత ప్రభుత్వం 2005లోనే దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు అనకుండానే వామపక్ష ఉగ్రవాదాన్ని ఏకైక అతి పెద్ద ముప్పుగా ప్రకటించిన విషయం మీకు తెలసిందే. 2005 నుండి వరుసగా మాపై మిమ్ములను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రెచ్చగొడుతుంది. మొదట శ్వేత మిలీషియాల నాయకత్వంలో దండకారణ్యంలో సల్వాజుడుం, ఝార్ఖండ్ లో సేంద్ర; ఆ తదుపరి భారత భద్రతా బలగాల ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా ఆపరేషన్ గ్రీన్ హంట్, అందులో భాగంగా ఆపరేషన్ లాల్ గఢ్, ఆపరేషన్ అనకొండ, మిషన్-2016 లాంటి పాశవిక ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించి మావోయిస్టుపార్టీ పై, విప్లవోద్యమ ప్రాంతాల ప్రజలపై, వారికి అండగా నిలిచిన దేశ ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ సంస్థలపై, శక్తుల పై రాజ్యం మిమ్మల్ని ఉసికొల్పింది. 2017 మధ్యలో తమ దాడుల ఫలితాలను సమీక్షించుకొని లక్ష్యం నెరవేరడం లేదనీ ఐదేళ్ల కాలవ్యవధితో ఆపరేషన్ ‘సమాధాన్’ను రూపొందించింది. ఇప్పటికి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. ఇందులోనూ వారాశించిన ఫలితాలు లభించడం లేదు. దానితో 2019 డిసెంబర్ లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో నిర్ణయాత్మక దాడికి జాతీయ భద్రతా సలహాదారు, ట్రిగ్గర్ హ్యాపీ సీ.ఆర్.పీ విశ్రాంత డీ.జీ. విజయ్ కుమార్ నాయకత్వంలో 8 మాసాల ప్లాను రూపొంది 2020 నవంబర్ లో మొదలైంది. ఈ కెంపెయిన్ లో భారత సైన్యాలకు చెందిన జవాన్లు కూడ పాల్గొననున్నారనేది 2020 మార్చ్ 21 నాడు పీఎల్ జీఏతో సుక్మా జిల్లా మినప వద్ద జరిగిన కాల్పులలో దొరికిన ఆధారాలను పట్టి తేలిపోయింది. భారత ప్రజలపై భారత సైన్యాలు దిగడాన్ని భారత రాజ్యాంగమే ఆమోదించదు. కానీ, దేశ పాలకులకు రాజ్యాంగం ఏ లెక్కలోది? అది కేవలం ప్రజలను నమ్మించే పస లేని పుస్తకంగా తయారైంది. ఇప్పటికీ ఆ రాజ్యాంగానికి 125 పర్యాయాలు సవరణలు జరిగాయి. నిజానికి ఆ రాజ్యాంగాన్ని తగుల పెట్టడమే హిందుత్వ శక్తుల ప్రకటిత లక్ష్యం. ఈ నిజాలన్నీ మీరు తెలుసుకోవాలనే విప్లవోద్యమం విజ్ఞప్తి చేస్తున్నది.
దండకారణ్యం, ఝార్ఖండ్లలోకి భారత సైన్యాలను దింపాల్సిన అవసరం ఏమొచ్చిందో మీరే ఆలోచించండి. మూలవాసీ ప్రజలు మన దేశ వనరులను మనం కాపాడుకుందామంటే వారిపైకి భారత సైన్యాలను దించుతారా! ఆలోచించండి. ఈ వనరులను కొల్లగొట్టుక పోవడానికే కార్పొరేటు వర్గాలు మిమ్మల్ని అడవులకు తరలిస్తున్నాయి. సల్వాజుడుం కాలంలో 644 గ్రామాలను మీరు ఎవరి కోసం వల్లకాడులుగా మార్చారు? రెండున్నర లక్షల మందిని విస్థాపితులను చేశారు! ఐదువేల మందిని ఎందుకు పొట్టన పెట్టుకున్నారు. సల్వాజుడుం హింసా బీభత్సాలకు, విస్థాపనకు, మారణ హోమానికి సుప్రిమోగా నిల్చిన మహేంద్రకర్మను ప్రజా సైనికులు మట్టు పెట్టక తప్పలేదు. మన దేశంలో ఖాకీలు ఎక్కడున్నా జరిగేదిదే. మీరు దేశ పాలకులకు భద్రతా దళాలు. వారి సంపదలకు కావలికుక్కలు. అందుకే మీకు అడవులలో స్థానం లేదని ఆదివాసీ ప్రజలు గత కొద్ది సంవత్సరాలుగా తెగించి పోరాడుతున్నారు. మీరు వాచ్ డాగ్ వృత్తి వదలుకొని ఆ ప్రజల పక్షం నిలవండి.
మీరు ఖాకీ దుస్తులలో లేదా సైనిక యునిఫారంలు ధరించి దేశ శాంతి భద్రతలు, రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తు కొన్ని సందర్భాలలో ప్రాణత్యాగం చేస్తున్నారు. కానీ ఆ త్యాగం ఎవరి కోసం? ఎందుకోసం? చేస్తున్నారనే విషయాన్ని మూలాలలోకి వెళ్లి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నారో లోతుగా పరిశీలించండి. మీ పట్ల సాధారణ ప్రజలలో ఉన్న అభిప్రాయాలను గమనించండి. మిమ్మల్ని ఏ ఒక్కరూ మితృలుగా ఎందుకు చూడరో తెలుసుకోండి. ప్రస్తుతం జరుగుతున్న దిల్లీ ముట్టడి రైతుల ఆందోళనలలో ఆ రైతులు మీ పట్ల ఎంత ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించారో ఒక్కసారి గమనించండి. మీతో గల అనుబంధాన్ని, ఐక్యతను వారి మాటల్లో చాటారు. మీరంతా రైతుల బిడ్డలేననీ, మీరు వారిపై లాఠీలు, తుపాకులు లేపడానికి సాహసించరనే నమ్మకాన్ని ప్రకటించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకండి.
మిమ్మల్ని ఒక దగ్గర పోలీసు అంటే మరో దగ్గర అర్ధ సైనికులంటే ఇంకో దగ్గర జవాన్లంటున్నారు. మీరంతా కార్మిక కర్షక బిడ్డలే! జై జవాన్, జై జవాన్ అని నినదించే మన దేశంలో మీరు ప్రజల పక్షం నిలవండి. ఇటీవల కొంతమంది భారత జవాన్లు రైతుల ఆందోళనకు మద్దతుగా తమ శౌర్య పతకాలను ప్రభుత్వాలకు తిప్పికొట్టారు. దానిని మావోయిస్టు పార్టీ స్వాగతించింది.
మీరు ప్రజా ఉద్యమాలపై ఆయుధాలు ఎక్కుపెట్టకండి. మీ ద్వార భారత పాలకులే ప్రజలకు యుద్ధం నేర్పుతున్నారు. నిన్న ఆదివాసీ ప్రజలు ‘ కోస్క్/పాయిక’ (పరాయివారు) అంటే పరుగు తీసేవారు. కానీ, నేడో! పోలీసులు, అర్ధ సైనికులు, ప్రత్యేక కమాండోలతో వారు దీటుగా పోరాడుతున్నారు. ఇక ఇపుడు వారి ముంగిట్లోకి భారత జవాన్లో వచ్చినా వారు కచ్చితంగా పోరాడి తీరుతారు. అది తప్పదు. భారత జవాన్ల తదుపరి పాలకులకు దిక్కెవరు! అమెరికా సైనికులను అరువు తెచ్చుకున్నా (అలాంటి ఒప్పందాలు కూడ మన పాలకులు ముందుచూపుతో ఇప్పటికే చేసి పెట్టుకున్నారు) సమస్యలున్నంత వరకు ప్రజలు వెనక్కి వెళ్లేదే ఉండదు. వారికి యుద్దాన్ని నేర్పుతున్న మీరు కృతజ్ఞులు. కానీ మీరు వారితో కలిసి స్వాతంత్ర్యోద్యమ కాలంలో సైనికులు బ్రిటిష్ వారిపై పోరాడిన చందంగా మీరు ఈనాటి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడండి. ఇదే దేశం కోరుకుంటున్నది.
మీరు అడవులలోకి రావద్దు. మాడ్ కొండలలో మీకు గెరిల్లా శిక్షణను ఇవ్వడానికి కేంద్రం కైవశం చేసుకున్న మాడియా ఆదివాసి ప్రజల భూమిని మీకు ఇచ్చేది లేదని అక్కడి ప్రజలు పోరాడుతున్నారు. వారు మన దేశ అడవులకు యజమానులు. వారు స్వయం పాలన కోసం నినదిస్తున్నారు. అలాంటి ఆదివాసీ ప్రజలపై మీరు అత్యాచారాలకు, హత్యలకు పూనుకోకూడదు. మీరు దళితులపైకి, ముస్లింల పైకి ఒంటికాలు మీద పరుగెత్తుక రావద్దు. వారంతా సకల సంపదలు సృష్టిస్తున్న మన దేశ శ్రామిక జనాలు. వారితో సమైక్యం కండి. మీ అధికారులూ వారి యజమానులైన దుష్ట పాలకులు మీకు అబద్దాలు, చరిత్ర వక్రీకరణలు నూరిపోస్తారు. వాటిని నమ్మకండి. మీరు చదవండి. తెలుసుకోండి. పీడిత ప్రజలతో మమేకం కండి. దేశం కోసం, దేశ ప్రజల కోసం మాతో భుజం భుజం కలిపి పోరాడండి. ఇదే మీకు మా ఆహ్వానం. మనమంతా ఈ భూమ్మీద దోపిడీకి తావులేదని మన పోరాటాల ద్వార చాటుదాం. కుల విముక్తిని, స్త్రీ విముక్తిని, అవినీతి రహిత, మత విద్వేష రహిత భారతాన్ని, ప్రజల ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మిద్దాం. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ నినాదం మన దేశ వైవిధ్యాన్ని మంట గలుపుతుంది. నయా ఉదార వాదాన్ని, బ్రాహ్మణ హిందుత్వకు గోరీ కడుదాం.
తేదీ: 8 ఫిబ్రవరి, 2021