అనుకుంటివా 
ఈరోజు ఒకటి వస్తుందని...
ఇలాంటి రోజులు కూడా ఉంటాయని...

బక్క పల్చని పిల్లలే భరి గీసి నిల్చుంటరని
జంతర్ మంతరే
జనసంద్రమై హోరెత్తుతుందని

కంటివి కదా పగటి కలలు...
ఎల్లకాలం జనాలను
నిద్రమత్తులో ముంచెత్తుతామని

అసాంఘిక శక్తులంటివి
విదేశీ శక్తులంటివి కదా

కాళ్ళు విరిగినా
చేతులు తెగినా
తలలు పగిలినా...
రక్తం ఎరులై పారినా...
తల్లడిళ్లుతూ... తుళ్ళిపడుతూ ...
ఒంటి చేతితో
సైనిక వాహనాలనాపగలరని?


దారిపొంట పోయే,
ఒంటరి మహిలే,
దావానంలా...
వ్యాపించగలదని ?

అనుకుంటివా...?
గాడ్సేను పొగిడేటి నీకాలపు గారడీలు...
సోనం కాలి దూలిగా మారుతుందని ?

ఊహ కాదు ఉత్తుత్తి మాట కాదు,
ఉద్యమమంటే !
నిజంకదా నిజంకదా
జంతర్ మంతర్
నిజమే కదా!

నిలబడ్డాననుకుంటివి
నిటారుగా
ఛాతి విరుచుకుని
జారి పడితివి కదా...
ఒకే ఒక జెన్ జీ ల కుదుపుకు !
కాసుకో.... చుసుకో...
కాలమంతా కాక్రొచులదే !

Leave a Reply