జీరంఘాటి దాడుల్లో హత్య చేయబడిన కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సల్వాజుడుమ్లో భాగస్వాములు అయినవారే. ప్రధానంగా మహేంద్ర కర్మ . ఇండియన్ ఆర్మీ మద్దతుతో సాగిన సాల్వాజుడం ఒక దుర్మార్గమైన అణచివేత చర్య. ఆదివాసీ గ్రామాలు దాడులకు గురైనాయి, చాలా ఊర్లు తగలబడ్డాయి, ఎంతో మంది హత్యకు గురైనారు మరియు మహిళలు అత్యాచారం చేయబడ్డారు. చివరికి సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుని సాల్వాజుడం ను నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ఇలాంటి దారుణాలకు పాల్పడిన దోషులు ఇప్పటికి స్వేచ్చగా తిరుగుతున్నారు. ఆ దాడులకు వ్యతిరేకంగా పోరాడిన పది మందికి మాత్రం రాజ్యంపై తిరుగుబాటు చేశారని ఆరోపిస్తూ మరణశిక్ష విధించారు. కామ్రేడ్ ప్రమీల మొడియం, సుమిత్ర పునేం, ఐతే మార్కం, బంజామి సన్న, చైతు లెక్కం, జోగ మార్కమి మరియు మహదేవ్ నాగ వీరంతా కూడా మావోయిస్ట్ పార్టీ ఆదివాసీ కార్యకర్తలు లేదా పార్టీతో అనుబంధం ఉన్నవారు. వారు ఎదుర్కొన్న అణచివేత, దోపిడీ, దౌర్జన్యాల కారణంగానే వారు మావోయిస్టు రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. మహేంద్ర కర్మలాంటి నాయకులు వారికి అండగా నిలిచిన శక్తులు ఆదివాసీల భూములను, ప్రజలను దోచుకుంటున్నాయని వారు భావించారు. మరోవైపు, దాడికి ప్రధాన సూత్రధారులుగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న వారిలో కొందరు ఆ రాజకీయాలను వదిలి లొంగిపోయి తమ సహచరులకు ద్రోహం చేసినందుకు క్షమించబడి వారికి బహుమతులు, ఉద్యోగాలు కూడా లభించాయి. ఈ తీర్పు ప్రధానంగా రాజకీయపరమైనది అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ తీర్పు అసలు ఘటనకు క్రిమినల్ చట్టానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల కంటే వేరే ఉద్దేశంతో ఇచ్చినట్టుగా ఉంది. అందుకే దీనిని సవాలు చేయాలి. ఆ దాడి వెనుక ఉన్న రాజకీయాలను వ్యతిరేకించినప్పటికీ ఈ తీర్పు మరో అన్యాయానికి దారితీసిందని అంగీకరించాల్సిందే.
జీరామ్‌ఘాటి 10 మంది ప్రజల కోసం పోరాడారు.


రాజ్యం వారిని హత్యచేయటానికి మనం అనుమతించకూడదు.

Leave a Reply