అడవి గుండెను చీల్చావు
మైదానానికి పురిటి నొప్పులొస్తున్నాయి
పంటను బూడిద చేశానని విర్రవీగావ్
సకలజనుల కన్నీటి పదునుకు
భూపొరల్లోని విత్తనం మొలకెత్తుతుంది
చూపుడు వేలు
ఎర్రని పోగులతో తాడునేస్తుంది
మనురాజ్యపు కుతిక పిసుకుటకై
డప్పు ప్రకంపనానికి
నియంత గుండె బెదిరింది
కొలిమిలో కర్రు ఎర్రబడుతుంది
నిరంకుశుడు ఫోబియాతో వణుకుతుండు
అమావాస్య ఎల్లకాలముండదు
మిరుమిట్లు గొలిపే వెన్నెల రాకపోదు!
జై భీమ్
ఇంక్విలాబ్ జిందాబాద్
ఈ దేశ ప్రజల హృదయస్పందనలు
తల్లిగర్భంలోనే పిడికిలి బిగించినోళ్ళం
మళ్ళోసారి పిడికిలి బిగించుదాం
మాతృదేశం కోసం రేపటిస్వప్నం కోసం




