సంభాషణ

“ఇదిగో, నా సోదరి వచ్చేసింది; ఇప్పుడు నాకు ఆమె డబ్బు ఇవ్వండి”

రచన: విశాద్ కుమార్ | ఏప్రిల్ 28, 2026 ఒడిశాలోని కియోంఝర్ జిల్లా నుండి ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వానికే సిగ్గుచేటుగా నిలిచిపోతుంది.   ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన, మన పరిపాలనా వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని, అసంబద్ధతను కూడా బట్టబయలు చేస్తోంది. అంతేకాకుండా, అధికార యంత్రాంగపు పత్రాల ప్రక్రియలలోని సంక్లిష్టతలకు సంబంధించి ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఏప్రిల్ 27న ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివాసీ జీతు ముండా, తన మరణించిన సోదరి అస్థిపంజరాన్ని మోసుకుంటూ ఒక బ్యాంకు వద్దకు చేరుకున్నాడు.  అంతకుముందే అతను బ్యాంకుకు డజన్ల సార్లు వెళ్ళాడు; కానీ ప్రతిసారీ
తొలికెరటాలు

ఉపాధ్యాయుడికి ప్రేరణనిచ్చే  “పగటి కల”

గిజుభాయి బదేక రాసిన "పగటికల" పుస్తకం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆశించే ఉపాధ్యాయులకు ఓ గొప్ప మార్గదర్శక పుస్తకం. పోలు శేషగిరిరావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. పేరులో ఉన్నట్టు ఈ పుస్తకం"ఈ పగటి కల" కాకుండా పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా భయం లేని విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ప్రేరణను ఇస్తుంది. ఈ పుస్తకం ముఖ్యంగా నేటి ఆధునిక విద్యా వ్యవస్థకు కూడా ఎంతో అవసరం. పుస్తకంలో గురువు పాత్ర పోషించినది లక్ష్మీకాంత్ అనే ఓ నూతన ఉపాధ్యాయుడు. అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి అక్కడ ఉన్న పాత బోధనా పద్ధతులను మార్చి,
సందేశం

మిత్రులకు కాత్యాయని సందేశం

(కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలు కాత్యాయని డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం వల్ల, ఆమె ఫేస్‌బుక్‌లో చురుకుగా ఉండలేకపోతున్నారు; తన సాహిత్య, సామాజిక సహచరులను సంప్రదించలేకపోతున్నారు. అందువల్ల, ఆమె ఈ సందేశాన్ని నా ద్వారా మీకు పంపారు. – కవిత) మిత్రులారా ఏప్రిల్ 17వ తేదీన జరిగిన సంఘటనల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది: అర్ధరాత్రి తర్వాత పోలీసులు మా ఇంటి నుండి సత్యంను ఎలా అపహరించారో, రెండు రోజుల తర్వాత అతన్ని నోయిడా కోర్టులో హాజరుపరిచే వరకు అతని గురించి మాకు ఎలాంటి సమాచారం అందలేదో. జనచేతన ఆవరణలోనూ, మన మా ఇంటిలోనూ
రిపోర్ట్

పోలీసుల వెంటాడి వేధింపులు;అక్రమ నిర్బంధాలు, తప్పుడు వర్ణనలు

వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇద్దరు వ్యక్తులు కార్మికుల నిరసనను 'మాస్టర్‌మైండ్' చేశారన్న యూపీ పోలీసులు, ప్రధాన స్రవంతి మీడియా కథనం 'నిరాధారం' అని ఆదివారం, ఏప్రిల్ 19నాడు జరిగిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలు తెలిపారు. అదుపులోకి తీసుకున్న కొందరు కార్యకర్తల ఆచూకీని వెల్లడించడానికి పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిరాకరించాయని కూడా వారు చెప్పారు. ఇటీవల జరిగిన నోయిడా కార్మికుల నిరసనలో పాల్గొన్న కార్మికులను, కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు, యంత్రాంగమూ "వేధింపులకు", "అణచివేతకు" గురిచేశారని, అలాగే నోయిడా హింసాకాండలో వారు కూడా భాగస్వాములని ఏప్రిల్ 19 నాడు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలు, న్యాయవాదులు,
వ్యాసాలు

కె.పి అశోక్ కుమార్

కె.పి అశోక్ కుమార్ (1956) జననం - ప్రాథమిక విద్యాభ్యాసం మచ్చ బొల్లారం., సికింద్రాబాద్. ఇంటర్ వరకు బొల్లారంలో చదివి బికాం సర్దార్ పటేల్ కాలేజ్, సికింద్రాబాద్ లో చేరారు. ఉస్మానియాలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో గ్రంథాలయ సమాచార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదటి ఐదు సంవత్సరాలు స్పెషల్ టీచర్ గా పని చేశారు. తర్వాత సాంకేతిక విద్యాశాఖలో గ్రంథపాలకుడిగా ఎంపికై, హైదరాబాద్ లోని పాలిటెక్నిక్ లలో 25 ఏళ్లుగా పనిచేసి 2014లో పదవీ విరమణ చేశారు. 2014 - 19 వరకు పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్
కథలు

పారంపర్యం!

కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిచ్చి ‘యిదేమీ టౌన్ కాదు, సిటీ అంతకన్నా కాదు, పల్లెటూళ్ళో అడ్రస్ పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలి?’ అన్నాడు మా ఫ్రెండు. నాకొస్తున్న కోపానికి చేతిలోని చెంబుతో వాడి తల పగలగొట్టాలని వొక్కక్షణం అనిపించింది. కాని పక్కనే వాడి పేరెంట్స్ వుండిపోయారు. అందుకని నవ్వుతూ చూశాను.             ప్రయాణం బాగా జరిగిందా- నుంచి అన్ని కుశల ప్రశ్నలు వేస్తూ ‘అడ్రస్ డెడ్ యీజీ’ అన్నాడు అంకుల్. ‘మీ అంకుల్ పేరు చెప్పి యెవర్ని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు’ అంది ఆంటీ. ‘నన్ను యెందుకు రెచ్చగొడతార్రా?’ అని ఆవేశాన్ని అణచుకొని కూల్ ఫేస్ పెట్టాను.            
వ్యాసాలు

మహిళల భుజంపై తుపాకీ పెట్టి..

కేంద్రంలోని కూటమి ప్రభుత్వం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2026 ను ఏప్రిల్ 18వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో లోక్ సభ, శాసనసభల స్థానాల పునర్విభజన, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గూర్చి పేర్కొన్నారు. ఈ బిల్లు 2 /3 వ వంతు మెజారిటీతో గెలుపొందవలసి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వానికి లోక్ సభలో అంత మెజారిటీ లేకపోవడం వలన వీగిపోయింది. అనంతరం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పక్ష నాయకులు ప్రతిపక్షానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదంటే, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని
కవిత్వం

ఈ  పాడు కాలంగడిచిపోతది

ఓ దుఖంపెనుగంగలా ఉప్పొంగిజీవితాన్ని ముంచెత్తిమనశ్శాంతిని భగ్నం చేసినప్పుడుకనుచూపుమేరాప్రియమైనవన్నీ దూరమైనప్పుడునీ హృదయానికి పదేపదే ఇలా చెప్పు"ఈ పాడుకాలం గడిచిపోతది" అంతులేని శ్రమనీ సంతోషగానాల మీదమౌనపు తెరల గమ్మినప్పుడుప్రార్థించడానికి సైతంనీ పెదాలు వొణుకుతున్నప్పుడుఈ సత్యంమబ్బుల తొలగించినిన్ను తేలికపరచనీ"ఈ పాడుకాలం గడిచిపోతది " జీవితంవిలాసవంతమైభౌతిక సుఖాలలోకాలం దొర్లుతున్నప్పుడుఈ మాటలునిన్ను ఎప్పుడూ వెంటాడనీ"ఈ పాడు కలం గడిచిపోతది" నీ శ్రమ జీవజలంలోకీర్తి కాంతులు పుష్పించినప్పుడుప్రపంచంలోనేఉన్నతమైనవి నీకందివొచ్చినప్పుడుఈ జీవితంఒక అంతులేని, అద్భుత కథ అని గుర్తించుకో జీవితం దుర్భరమైన చోటజీవించడం మానకు అవిశ్వాసం లేనేలేదుమనకు తెలియకుండానేపెదాలు తిరస్కరించినచోటమనసు విశ్వాసంతో ఉరకలేస్తుంది** Elizabeth Y.case (1840)," This too shall passaway"కు స్వేచ్చానువాదం : ఉదయమిత్ర
కవిత్వం

గడువు ముగిసిన పన్నెండవ రోజు

అప్పటి వరకుఆమె భుజాల మీద ఏ బాధ్యత కూర్చుండ వచ్చునో భూమి కన్నీళ్ళు తుడుస్తూనోఅడవి వీపు నిమురుతూనోకాల్పుల్లో అనాదైన ఆదివాసీ చిన్నారిఆకలి కడుపు తీడుతూనో ఏ దుఃఖంఆమె కాళ్ళను చుట్టుకొని ఉంటుందో అడవిలోరాలి పడిన నెత్తుటి జెండాల్నేరుతూనోకాల్పుల్లో కూలిన శిరస్త్రాణాల గుండె కత్తుకుంటూనోవిరిగి పడిన ఆయుధాల ఆనవాళ్ళు కుప్పేస్తూనో లొంగుబాటులల్లనో అరెస్టులల్లనో కనిపించని'రూపి'ఏ ఆర్తి అమ్మలా కమ్ముకొనిఆమెను అడవికి కట్టేసుకోనుంటుందో కొంత ఫాసిజంఊడలైన సహచరత్వం నడుమకొంత ఆశయాలు పారి పోయిన మనుషుల నడుమకొంత పిరికితనం పొగచూరిన అడుగుల మధ్య ఎర్రజెండా రెపరెపలాడ్తూఆమెను ఏ దృశ్యం నిలబెట్టి ఉంటుందో ! అమ్మకలల్నో నాన్న కలల్నోకొంచెం ఊపిరి పీల్చిఆశల చెట్టు ఆకుల్లా
కవిత్వం

యుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..?

ఎప్పటికప్పుడుచెరలు చెరసాలలు దాటుకుని మరీపోరాటం పునరావృతమవుతూనే ఉంది..మళ్లీ మళ్లీ కొత్త జ్ఞానం వికసిస్తూనే ఉంది..పరిణామక్రమమంతా యుద్ధాలమయమే కదా!విశ్వాంతరాళాల్లోప్రకృతి మొదలుపెట్టిన సహజ యుద్ధాన్నిదేశాల మధ్యకు బదిలీ చేసిఒకడెవడో సంతోషిస్తున్నాడు గానీమనిషిలో అంతర్లీనంగాఈ యుద్ధమేనాడో మొదలైంది..సంపద మొదలైననాడుఅది పోగుపడడం మొదలైననాడుగుంపు నుండి ఒక్కడి వైపుమనిషి ప్రయాణం మొదలైన నాడుప్రకృతి పచ్చదనంనోట్ల పరపరలకు అమ్ముడు పోవడం మొదలైన నాడుఉనికి అస్తిత్వం గుర్తింపుఅన్నిటికీవిపణి ముట్టడిలోనేనిర్వచనాలు తయారవుతూపోతుంటేయుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..కింద పడిన ప్రతిసారీపైకి లేసేందుకుజరగాల్సిన యుద్ధాన్ని వదిలేసిపడిపోవడంలోనేపడుకోవడంలోనేరాజీని వెతుక్కుంటున్నప్రతి సందిగ్ధ సమయంలోనూమళ్లీ మళ్లీ యుద్ధం పుడుతూనే ఉందియుద్ధంలో మనిషిమనిషిలో యుద్ధంకలగలిపి చేసేసమాంతర ప్రయాణమే కదా చరిత్ర!మరిప్పుడు మళ్ళీ కొత్తగా మొదలవడమేంటి..? అందుకే వాడిలాగేమనకూ యుద్ధం