కవిత్వం

కాలమంతా కాక్రొచులుదే!

అనుకుంటివా ఈరోజు ఒకటి వస్తుందని...ఇలాంటి రోజులు కూడా ఉంటాయని...బక్క పల్చని పిల్లలే భరి గీసి నిల్చుంటరనిజంతర్ మంతరే జనసంద్రమై హోరెత్తుతుందనికంటివి కదా పగటి కలలు...ఎల్లకాలం జనాలనునిద్రమత్తులో ముంచెత్తుతామనిఅసాంఘిక శక్తులంటివివిదేశీ శక్తులంటివి కదా కాళ్ళు విరిగినాచేతులు తెగినా తలలు పగిలినా...రక్తం ఎరులై పారినా...తల్లడిళ్లుతూ... తుళ్ళిపడుతూ ...ఒంటి చేతితోసైనిక వాహనాలనాపగలరని?దారిపొంట పోయే,ఒంటరి మహిలే,దావానంలా...వ్యాపించగలదని ?అనుకుంటివా...?గాడ్సేను పొగిడేటి నీకాలపు గారడీలు...సోనం కాలి దూలిగా మారుతుందని ?ఊహ కాదు ఉత్తుత్తి మాట కాదు,ఉద్యమమంటే !నిజంకదా నిజంకదా జంతర్ మంతర్ నిజమే కదా!నిలబడ్డాననుకుంటివినిటారుగా ఛాతి విరుచుకునిజారి పడితివి కదా...ఒకే ఒక జెన్ జీ ల కుదుపుకు !కాసుకో.... చుసుకో...కాలమంతా కాక్రొచులదే !
కవిత్వం

శిధిలాల మధ్య సంధి

పోటీ మొదలైంది అక్షరాలు మొలకెత్తాల్సిన పేపర్లమీద నెత్తుటి మందారాల రంగు పూస్తుంది రణధూళి పొరల మధ్య పిల్లల ఆకలి ఏడుపుల మధ్య ఈ సంధి విలువెంత ?శిథిల యినుప ఊసకు వేలాడిన బిడ్డ తల్లి అరుపుల శోకం మధ్య ఈ సంధి విలువెంత? ఎత్తయిన హర్మ్యాల నాగరికతల సాంకేతికత నేలచూపులు చూసిన అనాగరిక దూరచూపు వర్తమానమెంత? ఇప్పుడు ఇక్కడ ఏ పాఠశాల గోడను ముట్టుకున్నా కేరింతల్లాగిన పిల్లల కుర్చీలు కదలాడుతాయి. దేహం నుంచి వేరైన చేతులు బలపాల కోసం వెతుకుతాయి. రంగురంగులతో తడవాల్సిన పుస్తకాలిప్పుడు నెత్తుటిరంగుతో హోళీ చేసుకుంటున్నాయి హాయిగా నిద్రపోతున్న దేహాలిప్పుడు మృతదేహాలయ్యాయి ఇప్పుడు ఏ తూనీగ
వ్యాసాలు

రంగులు వెలిసిపోతున్న‌సీమ చేనేత

 "ఒక చేనేత వస్త్రం కేవలం నూలు పోగులతో నేసిన బట్ట కాదు, అది ఒక కుటుంబపు జీవన్మరణ ఆశల పోరాటం, ఒక కళాకారుడి చెమట, ఒక ప్రాంతపు సంస్కృతి, స్వాభిమానానికి ప్రతీక" ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం వెనుక ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. 1905 బ్రిటిష్ వలస పాలనలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం భారతీయులను విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ చేనేత వస్త్రాలను వినియోగించే దిశగా నడిపించింది. అదే స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 7ను జాతీయ
కవిత్వం

తగులబడుతున్నది దేశం

అడివంటుకున్నదివిద్యార్థి కొలిమంటుకున్నదియువభారతదేశం ఇపుడొక నిప్పుగుండంమీ పోలీసు ఉద్యోగభత్యంభద్రంగా ఉండనీ, మీకు ఇంక్రిమెంట్లు రానీలక్షలాదిబిడ్డలుఅడిగిందే తప్పయితేమీరు చేసిందేమిటి తండ్రీసిగ్గనిపించని ఉద్యోగవిధులా? వెనక నిధులా?వాళ్ళకెవడో డబ్బులిచ్చాడట?తెలియని గవర్నమెంటు దేనికి? ద్రోహి ఎక్కడ? ద్రోహమెక్కడ?వాళ్ళంతా విదేశీపోషకులైతేస్వదేశీయంత్రాంగం పెనునిద్దురలో వుందా?హైద్రాబాద్ నుంచి బువ్వ పంపిస్తేఖిలిస్తాన్ లీడర్ కైంకర్యమా?ఇంత గొప్ప ఇంటలిజెన్సా మీదిపేర్లపట్టీలు లేకుంట పోలీసులెవరు?అసలు డ్రెస్సు, అడ్రస్సులేని గూండాల మీకు ఆసరా?ఇంత పిరికోల్లకెందుకురా పదవులు?రాజీనామాలడిగారు కదా చెయ్యండిపోలీసులంటే ఆడ, మగతనాలు మరిచిచదువుకునే పిల్లల ఉసురు తీయడానికేనా?ఏడ మీ ఉద్యోగం? ఏడ మీ మనిషితనం?ఎందుకురా బానిసలకొక బానిసగా బతుకుతెరువు?తెరువు కండ్లు, చూడు దేశం?నిజమేందో, నిష్టూరమేందోభయమేందో, సత్యమేందో?చావు భయం తెలియని తరంవెనుకడుగెరుగని యువతరంఅడుగెస్తే భయమేస్తేదాచుకో అధికారపు విషపడగలవెనకనువ్వు
కవిత్వం

దీపక్ భారతి కవితలు

1. రామరాజ్యం అంటే భయంనాకు రామరాజ్యం అంటే భయం వేస్తుందిఎందుకంటే...వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి పాలనలోనే శంబూకుడు హత్య చేయబడ్డాడు సీత అవమానాలకు, బాధలకు గురైంది. దాసులు, శూద్రులు, ఆదివాసులు అవమానించబడ్డారు. గాంధీ యొక్క రామరాజ్యంలో శూద్రులు, దళితులు, ఆదివాసులు, మహిళలు… వెనుకబడిన వర్గాల్లోని అత్యంత వెనుకబడినవారు వెనుకబడిన వారుగానే మిగిలిపోయారు. అధికారం, సౌఖ్యం మాత్రం అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలకే దక్కింది.మరి నేటి రామరాజ్యంలో?ఇక్కడ మెజారిటీ ప్రజలు కేవలం వేధించడం మాత్రమే కాదు నేరుగా "బుల్డోజర్" చేయబడుతున్నారు.మొత్తం సమాజాన్ని ద్వేషం అనే మత్తుమందుతో ముంచేస్తున్నారు.అందుకే రామరాజ్యం పేరుతో జరుగుతున్న ఈ "అభివృద్ధి" నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది."జై శ్రీరామ్"
ఆర్థికం

ద్రవ్యోల్బణం: పరిణామాలు

ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక శాస్త్రంలో కనిపించే ఒక గణాంకం. అంతకు మించి, సామాన్య ప్రజల జీవితాల ను నిశ్శబ్ధంగా కుదిపేసే సామాజిక, ఆర్థిక వాస్తవం. ఆర్థిక ప్రపంచంలో అత్యంత కీలకమైన, మ‌నుషుల జీవితాల‌ను చాలా ప్రభావితం చేసే అంశం ‘ద్రవ్యోల్బణం’.  ద్రవ్యోల్బణం అంటే మీ చేతిలో ఉన్న డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గడం.  ప్రభుత్వం విడుదల చేసే ద్రవ్యోల్బణ శాతాలు, ధరల సూచీలు, గణాంక నివేదికలు సాధారణంగా నిపుణుల చర్చలకే పరిమితమైన అంశాలుగా కనిపించినప్పటికీ, వాటి అసలు ప్రభావం ప్రతి మ‌నిషిపై, ప్ర‌తి ఇంటిలోనూ ఉంటుంది. ద్రవ్యోల్బణం వినియోగదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులపైనే గాక‌ మొత్తం ఆర్థికవ్యవస్థపై గణనీయమైన
వ్యాసాలు

విద్యార్థి ఉద్యమం –  శేష ప్రశ్నలు

 నీట్ పేపర్ లీకేజ్ మరియు సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల అవకతవకలు పై చెలరేగిన విద్యార్థుల అలజడి, ఆత్మహత్యలు, పర్యవసానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు జూన్ -- 20 నుంచి జరిపిన నిరవధిక ఆందోళనలు ఆర్ ఎస్ ఎస్, బిజెపి పాలకవర్గాలకు ఒక్క కుదుపు ఇచ్చాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత మరియు పౌర సమాజంలోని ప్రముఖులు మద్దతు తెలియజేయడమే కాకుండా ఆ ఉద్యమంలో వారు పాలు పంచుకున్నారు. చివరి ఘట్టంలో జూలై 20న చలో పార్లమెంట్ ఉద్యమ దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది.  అంతవరకు
కవిత్వం

విత్తనం

బహుశా సృష్టిలో విత్తనమే మొదటి విప్లవానికి నాంది పలికి ఉంటుంది భూమిని చీల్చుకు విత్తనంగా మొలకెత్తడానికి భూమ్మీద పడడానికి శిశువు సైతం గర్భకుహరంలో పెద్దయుద్ధమే చేసి ఉంటది ప్రతిసారీ మట్టి నుండితల్లి నుండి ఆందోళనకారులకు ప్రేమ దొరికే ఉంటుంది ఎందుకంటే ఆందోళన చేయకపోతే నూతన సృష్టి సాధ్యం కాదని మట్టికీ మాతృమూర్తికీ తెలిసే ఉంటుంది **** అశోక్ కుమార్ (హిందీ కవి)అనువాదం: ఉదయమిత్ర
వ్యాసాలు

మైదానాలు ఉప్పొంగే రాత్రులు!

మానవ చరిత్ర ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు. స్వార్థం పెరిగిపోయిందని, "కేరీరిజం" వ్యామోహంలో యువత మునిగిపోయిందని, వాట్సాప్ స్క్రీన్‌లు, పబ్జీ (PUBG) గేమ్స్, ఎంజాయ్‌మెంట్‌ల మత్తులో ఉన్న నేటి తరం ఏ సామాజిక అంశంపైనా స్పందించదనేది నిస్సందేహంగా ఒక భ్రమ అని నేటి జెన్ జీ (Gen Z) ఉద్యమంతో తేలిపోతోంది. ​జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం, అన్నిటినీ మించి న్యాయసాధన కోసం అనాదిగా ప్రజానీకం పోరాడుతూనే వస్తున్నారు. అవి బానిస తిరుగుబాటులు అయినా, భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలు అయినా... పాలకులకు వ్యతిరేకంగా సాగిన పాలితుల పోరాటాలు, ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటులూ ఇవన్నీ
కవిత్వం

పిడికిలి

అడవి గుండెను చీల్చావు మైదానానికి పురిటి నొప్పులొస్తున్నాయి పంటను బూడిద చేశానని విర్రవీగావ్ సకలజనుల కన్నీటి పదునుకు భూపొరల్లోని విత్తనం మొలకెత్తుతుంది చూపుడు వేలు ఎర్రని పోగులతో తాడునేస్తుంది మనురాజ్యపు కుతిక పిసుకుటకై డప్పు ప్రకంపనానికి నియంత గుండె బెదిరింది కొలిమిలో కర్రు ఎర్రబడుతుంది నిరంకుశుడు ఫోబియాతో వణుకుతుండు అమావాస్య ఎల్లకాలముండదు మిరుమిట్లు గొలిపే వెన్నెల రాకపోదు! జై భీమ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ దేశ ప్రజల హృదయస్పందనలు తల్లిగర్భంలోనే పిడికిలి బిగించినోళ్ళం మళ్ళోసారి పిడికిలి బిగించుదాం మాతృదేశం కోసం రేపటిస్వప్నం కోసం