వాళ్లు కాంగో, గిని ఇంకా అంగోలా రూపంలో అమెరికాకి వచ్చారు.
వారి ఆఫ్రికా పియానో సాంస్కృతిక సంగీత లయలకు అనుగుణంగా అలవాటు పడిన, బొటన వేళ్ళు,పాదాలతో నడిచి వచ్చారు!
వాళ్ళ పాదాలు ఇంకా ఆఫ్రికా సంగీతపు జ్ఞాపకాలను మోస్తూ తిరుగుతున్నాయి!
~~
వాళ్ళు బార్లీ, అవిశె పొలాల్లో పనిచేయడానికి బలవంతంగా బానిసత్వంలోకి నెట్టబడిన వాళ్ళు !
పశువుల కాపర్లుగా, రాళ్ళు, పలకలు, ఇటుక, సున్నం,
చెక్కపీపాలు తయారు చేయడానికి శ్రామికులుగా బందీలై వెళుతున్నారు !
వాళ్ళల్లో బానిసల నుండి సేవకులన్నారు!
పూర్తిగా స్వేచ్ఛ పొందని పౌరులు కూడా ఉన్నారు!
~~
వాళ్లు నాలుకతో సీసం కలిపిన చెక్కలను తయారు చేసిన అద్భుతమైన కార్మికులు!
అక్కడే చిక్కుకుపోయిన వాళ్ళని న్యూ ఆమ్స్టర్ డామ్ లో
వాళ్ళ ఇళ్ళల్లోకి శాశ్వత సేవకులుగా తీసుకు వెళ్ళారు!
వాళ్ళ శ్రమతో దశాబ్దాల ఋతువులు నగరాన్ని పూర్తిగా మార్చివేశాయి.
~~
డచ్ నుండి న్యూ యార్క్ నగరంగా మారే వరకూ శ్రమ చేస్తూ
కలతతో, వణుకుతూన్న కలల పాదాలతో చేసిన కఠినమైన నడక
వాళ్ల ఎముకలని చిద్రం చేసి పడేసింది!
వారి శ్రమని ఎవరు గుర్తించారని?
అయినా కానీ వాళ్ళు అలసిన రాత్రుళ్లల్లో
ప్రత్యేకమైన “అశాంటి” అనే తమ ఆఫ్రికా తెగ నృత్యాన్ని మైమరిచి చేశారు.
~~
వాళ్ళు తమ ప్రాంతాన్ని, సంస్కృతినీ ప్రేమించారు!
వాళ్ళు అలా నిత్యం శ్రమ చేస్తూ జీవించారు.
వాళ్ళంతా అలానే మరణించారు కూడా!
చివరకి వాళ్ళని బట్టల్లో చుట్టి
దేవదారు చెక్కల శవపేటికలలో పెట్టారు!
వాళ్లని ట్రినిటీ చర్చ్ లోని
ఆరున్నర ఎకరాలలో సమాధి చేసారు!
ఒకరా ఇద్దరా?
వేలమందిని!
పరాయి దేశంలో అది వారి సమాధి స్థలం!
~~
తర్వాత వాళ్ళ సమాధి భూమి వొట్టి పనికిరాని వాలుగా ఉన్న నేలంటూ లాభ నష్టాల అంచనా వేసే వ్యాపారుల ఊహాగానాల దగ్గరికి వచ్చేసరికి కలుపు మొక్కలు ఆక్రమించాయి!
చివరికి ఆఫ్రికన్ బానిసల సమాధి స్థలం మీద
మెరిసి పోయే న్యూయార్క్ నగరం వెలిసింది!
కానీ విషాదం ఏమిటంటే ఈ విషయం చాలా
సులభంగా మరుపులోకి వెళ్ళిపోయింది!
~~
ఇంకా అక్కడ తోలు పరిశ్రమ కార్ఖానాలను కూడా ఖాళీ చేశారు!
శ్రామిక వారసులు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు చేసేదేం లేక
భుజంపై పెద్ద రాళ్ళకి బదులుగా
వదులైన కంకరను ఎత్తుకోవడం మొదలు పెట్టారు!
~~
ఆధునిక భవన నిర్మాణ బృందాలు రావడం కంటే ముందే
తమ పూర్వీకుల సమాధి భూమి గుండెల్లోకి దుఃఖంతో కంకరను నింపుతారు!
పని చేస్తున్నప్పుడు వాళ్ళ గిటార్లు హార్మోనికాలు సంగీతాన్ని పాడేవి.
లేదా వాళ్ళ శ్రమ ఆ ధ్వనులని పలికేది.
~~
వాళ్ళు తమ మధ్యాహ్నపు భోజన విరామంలో
తమ గత జీవితాల్లోని చెప్పుకోలేని బాధ
అణిచివేత హింస అనే దయ్యాలని తరిమి కొట్టే శబ్దాన్ని
పుట్టించడానికే ఆ వాయిద్యాలు అలా మిగిలిపోయాయని నమ్ముతారు కూడా!
~~
చూస్తూ ఉండండి!
త్వరలో లోయర్ మాన్ హట్టన్ లో వాళ్ళ అడుగుజాడల చప్పుడు వినిపిస్తుంది!
పాత తిరస్కరణలు, కొత్త ఆగమనాల మధ్య వాళ్ళంతా
చాలా ఎత్తు నుంచి వాళ్ళని అణిచి వేసిన వాళ్ళ తలల మీదుగా
అటు ఇటు గర్వంగా నడుస్తారు!
~~
పాత క్రూరమైన,స్వార్థపూరిత ఆచరణల నుంచి
కొత్తవైన మానవత్వపు దారుల్లో నిత్యం నడుస్తూ వాళ్ళు చేసే ప్రయాణంలో
వారి పాదాల మడమల చప్పుడు, అగ్ని లాంటి డప్పు శబ్ధపు వేడి
ఆఫ్రికన్ బానిసల స్మశాన స్థలంలోని వేల కొద్దీ మృతులను నిద్ర లేపుతుంది!
..




