సాహిత్యం కవిత్వం

తునకలు మా ప్రాణం

మా పోలేరమ్మ కాడనరికిన దున్నపోలేరమ్మ తినదని ఎరుకేపోగులు వేసిదండేలపై వేలాడే ఎర్ర గులాబీలువాటికి ముల్లుండవ్ముక్కల పులుసు కుతకుత వుడుకుతా వుంటేవాడంతా ఘుమఘుమమీకేం నొప్పిదున్న మీది కాదునరికింది మీరు కాదుసాకింది సవర తీసింది మీరు కాదు కట్ట మైసమ్మ కాడఒక్క వేటుకి యాటనేసినంయాతలన్నీ బోవాలనిమా మైసమ్మ ని మా యాసలో నే మొక్కుతాంబాగా అర్థమైతది ఆమెకీ మాకూవూర్లన్నీ జన సందోహం తోచెర్లన్నీ అలుగులు దుంకుతాయనితెగిన యాటల కుప్పలుమా పొట్టలు నింపు అదేందోమా గంగమ్మ తల్లి కీమా మల్లన్న కీమా కాటమయ్యకిమా ఎల్లమ్మ ఉప్పలమ్మ ముత్యాలమ్మ మారెమ్మలకి సైతంజంతు మాంసమే ఇష్టంమాకూ అదే ఇష్టంసిన్నప్పట్నుంచి మా అయ్య గదే పెట్టిండుమా అయ్య
సాహిత్యం కవిత్వం

నావికుడు

నెత్తురు కక్కుతున్న కాలాన్ని తన నగ్న పాదాలతోనే అధిగమించాడతను పూసే పొద్దుకు అభిముఖంగా అనివార్యపు యుద్ధంలా పర్చుకొని చరిత్రను విస్తృతం చేశాడు అతను కేవలం అస్తమించాడు ఈ ముసురు యుద్ధపు విచ్ఛిత్తిలో అనునయంగా మనతో సంభాషిస్తూనే ఉంటాడు కాళ్ల కిందికి విస్తరిస్తున్న మృత్యువును శతృ కల్పిత వేల వేల సందిగ్ధాలను నిరంతరంగా తిరగ రాసుకుంటూ ఆయువును ద్విగుణీకృతం చేసుకున్నాడు 0   0 0 ఒక్కడిగా పేరుకుపోయిన మానవుడ్ని శుభ్రం చేస్తూ నగరానికొచ్చినా సమూహాల నిస్సత్తువకు మందుగుండు దట్టించినా కల్పన కానిది.. కత్తుల అంచున రొమ్ము విరిచిన యుద్ధ ప్రియుడి సారాంశం కథకాదది గుండె విప్పిన దుక్కిలా రేపటిని
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత
కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
సాహిత్యం కవిత్వం

శాంతి స్వప్నం

పుస్తకాలు రాజ్యాన్ని భయపెట్టిస్తున్నాయి అందుకే అది పుస్తకం పుట్టకముందే పురిటీలోనే బంధిస్తున్నది పే....ద్ద పాలక ప్రభుత్వం చిన్న పుస్తకానికి, పుస్తకంలోని అక్షరాలకు భయపడటం చరిత్రలో మాములే కానీ.. పుస్తకాలు పురిటినొప్పులు  పడుతున్నప్పుడే పుట్టబోయేది "సాయుధ శాంతి స్వప్నమని"  భయపడి బంధించడమే ఇప్పుడు నడుస్తున్న అసలు రాజ్యనీతి అంతేకదా నెత్తురు మరిగిన రాజ్యానికి శాంతి స్వప్నమంటే  పాలకులకు పెనుగులాటే కదా మరి స్మృతులు యుద్ధాన్ని సృష్టిస్తాయట దుఃఖాల కలబోతకు కూడా కలవరపడుతున్న రాజ్యం ఎంత దృఢమైనదో తెలుస్తున్నది కదా అంతా మేకపోతు గంభీరమే అని
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  
సాహిత్యం కవిత్వం

చిత్రవధ

చిత్రవధ చేస్తావనుకోలేదుకన్నీళ్లు నడిచి వస్తున్న చరితను కొన్ని రంగు పూసిన పాత్రలుఇంకొంచెం సరిగమలుకొన్ని భౌగోళిక దృశ్యాలుకథే కదా!కాకుంటేకళ్ళు మూసుకొని కళ కన్నావు విషాదం మంచు కురవడం ఎలా తెలుస్తుంది ఒక దేవాలయం ఒక మసీదు ఒక గురుద్వారా ఒక ఆరామం బతుకు వెతుక్కుంటూ భయం రహదారి నడపడం దాల్ సరస్సు దుఃఖమే !ఈ దేహావయవం అన్నందుకే కదా !ఇక్కడ పారిన నెత్తుటికి మతం లేదువయసు లేదు కాశ్మీరీయత తప్ప !నీ తెర అస్పృశ్య౼రెక్కాడితే డొక్కాడని నెత్తుటి వాసనమన ముక్కుపుటాల్లోకి చొరబడుతుంది ఈనేల ఇష్టపడిన పేర్లన్నీ ఈ మట్టిలోనే దాక్కున్నాయి మానభంగాలు మౌనభంగాలు ఎన్ని అర్ధరాత్రులు మౌనం మోశాయి రాలిన కలలన్నీ హిందువులు ముస్లిములు బౌద్ధులు సిక్కులు మరణానికి మతం లేదు కాశ్మీరీయత తప్ప !కళ్ళల్ల చెవులల్లసృజనాత్మక విషం పోసినీ మతం కోరిక తీర్చావుకన్నీళ్ళకు