ముందుకే నడువు బిడ్డా
పచ్చ పచ్చనిఅడవుల్లో పారేటి జలపాతాల్లో ఎనక ముందు శత్రువులుంటరు చేతులు పట్టుకో నా బిడ్డా ఆకలి నేర్పిన దారులలో సాయుధ పోరు బాటలలో నవ్వుతూ ముందుకు నడిచే దారిలోచేతిని వదలను నా కొడుకావీరుల గన్న తల్లులతో పోరుల కలిసే అక్కలతో మోదుగు తీగల అల్లుకుపోయిదండిగ నడువు నా బిడ్డా గాయం తగిలిన చెల్లెలితో గేయం పాడినా తమ్ముడితో త్యాగం నేర్పిన అన్నల బాటలఅడుగులు ముందుకే నా కొడుకాకమ్మిన కారుమబ్బుల్లో కురిసే చినుకుల జల్లులలో ఎముకలుకొరికే గాలుల్లో ఎదురుగానడువు నా బిడ్డా బాంబులవర్షపు దారులలో భారు ఫిరంగుల మోతలలోఅదురు బెదురు అటకనబెట్టి ముందుకె నడవు నా కొడుకామనసుకు భారంఅవుతున్నదేహం అలిసిపోతున్న










