కవిత్వం

విప్లవమే ఊపిరిగా

నాన్నా !నీ కమ్మని ,తియ్యని గొంతుప్రేమకు ప్రతి రూపమైన నీ మోముఆదివాసీ త ల్లుల నాన్నల పసిపాపలఅపార ప్రేమ వాత్స్యల్యంనిత్యం నన్ను నిమురుతాయి దోపిడీ అన్యాయం ఫై మాట్లాడకుంటేతిన్న బువ్వ స హించదనినేవు చెప్పిన మాటలునా మనసులో మెదులుతాయి ! కడుపు కట్టుకొని కష్టపడి సాదివిద్యా బుద్ధులు నేర్పిసమాజం జీవనం సంస్కృతినివర్గ దృష్టితో చూసేందు కు ప్రేరణనీ నీతి మాటలే ! కుళ్ళిన భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృ తిసమాజాన్ని విష తుల్యం చే స్తూవ్యక్తి స్వార్థం, కేరిరిజం తోమానవ విలువలు ధ్వంసమైకుటుంబాలు చితిల మవుతున్న వేళ.. నాన్నావ్యక్తీ స్వార్థాన్ని ,అమ్మానాన్నలని విడిచినిస్వార్థంగా ప్రజలకోసందోపిడ సమాజాన్ని సమూలంగానిర్మూలించే సేద్యంలోదోపిడి పీడన
కవిత్వం

బిడ్డడితో తల్లి

బిడ్డానా జీవితం ఎప్పుడూఅందమైన పాల రాతి మెట్ల మీదుగా విలాసంగా సాగింది కాదు నేనెక్కిన మెట్లలో ఎన్నో పగుళ్లున్నాయిఅతుకులున్నాయిఅంచులు పగిలి ఉన్నాయి నేనడిచిన నేలంతా ఉత్త దిబ్బ నేల ఎర్ర తివాచిపరిచి నన్నెవరూ ఆహ్వానించింది లేదు కానీ నేను మెట్టెక్కుతూనే ఉన్నానుఅవరోధాలు అధిగమిస్తూనే ఉన్నానుగమ్యాలు చేరుతూనే ఉన్నానుఒక్కొక్కసారి గాఢాంధకారంలో నడక చేతిలో దీపముండదు బిడ్డామడమ తిప్పొద్దు మెట్ల మీద చతికిల పడొద్దు పగుళ్ళ మధ్యా, అతుకుల మధ్యా పడిపోయినాలేచి నిలబడు అరికాళ్ళు చీలినానడక సాగించునేను పడిపోయినానడుస్తూనే ఉంటానుమెట్లెక్కుతూనే ఉంటాను జీవితమెప్పుడు పూలపాన్పు కాదని గుర్తుంచుకోసాహసం గానే సాగిపో .. *** లాంగ్ స్టన్ హాఫ్ "Mother to Son
సాహిత్యం కవిత్వం

గణ “తంత్రం”

హక్కులు వచ్చాయనిఆనందపడే వాళ్ళుఅరడజను అయితే.. హక్కంటే ఏంటోతెలియక పూట తింటేమారు కూటికి లేనోల్లు 94 మంది.. ప్రజలను పాచికలు చేసిఆడిన ఈ చదరంగంలోహక్కుల కాలరాసేవాడు "రాజకీయనాయకుడ"య్యాడువాటి కోసం గొంతు చించేవాడు"రాజకీయ ఖైదీ" అయ్యాడు ఇదే గణతంత్రంనేటికి ఈ ఘనమైన "తంత్రం"ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే.. చీకటి నిండినఈ మాయాజాలం లోనక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..! (72 ఏండ్ల గణ"తంత్ర" రాజ్యం పై)
కవిత్వం

కులం కండువా…

జేబులో ఉన్న పది రూపాయలతోఇద్దరం అయిదు రూపాయల బువ్వ లొట్టలేసుకు తిన్నోళ్ళంసాయంత్రం అయితే ఛాయి నీళ్లు తాగుతూసమాజాన్ని విశ్లేషించినోళ్లం ధర్నాల దగ్గర ఒక్కటిగా హక్కులను నినదించినోళ్ళంనాలుగు గోడల మధ్య విప్లవ నిర్మాణాన్ని చర్చినోళ్ళం సభలలో సమావేశాల్లో ఒక్కటే విషయాన్ని మాట్లాడినోళ్ళంఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగానే తిరిగినోళ్ళం కానీ మా ఊరు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆటో దిగి గానేవాడు ఒక వాడ కి నేను ఒక వాడకి పోవాలిబోనాల పండుగోస్తే వాళ్ల బోనాలు ముందు రోజు మావి ఆ తెల్లారిబతుకమ్మ దగ్గరైతే మా బతుకమ్మ వాళ్ల వాటికి ఆమడ దూరంలోనే ఉండాలిఒక్కటేమిటి ఊరికి వెళితే అడుగు అడుగునా కులం కండువా
కవిత్వం

ఎంపిక

నేనేమీసుడిగాలుల పిడి గుద్దులకుతుఫానుల రౌడీతనానికీచలించిపోయే గోడను కానుభూమి లోలోపలి పొరల్లోపాతుకు పోయిన రాయినీ కానుగుచ్చుకొన్న దుఃఖపుసూదుల చురుక్కుమనే పోట్లకుపట్టించుకోని తనపు నిర్లక్ష్యపు కత్తిగాట్లకువిలవిలలాడే సున్నితత్వాన్నిగుడ్డులో నుంచి అప్పుడే రెక్కలు విప్పుకొంటున్న సౌకుమార్యాన్నిప్రతి చిన్నదానికీ కరిగి కురిసే చినుకునునా రెక్కల్ని ముక్కల్ని చేసేహక్కు నీకెవరిచ్చారుఅమ్మ గర్భాంతరంలోఉమ్మనీటి తటాకం నుంచిబాహ్య ప్రపంచంలోకి రాగానేఅలా ఉండు ఇలా ఉండకుఈ విధి నిషేధ సూత్రాలే కదానా బ్రతుకు వ్యాకరణం నిండాఈ ప్రపంచపు సూర్యకిరణాల వర్షంలో తడవకుండానా దేహ పుష్పానికీ గాలిసోక కుండాకప్పేసిన ఈ నల్లని ముసుగేమిటి?అసలు నా కట్టుబొట్టుపైపరాయి పెత్తనమేమిటి?నా ఊపిరి మీద నా బట్టల మీదఒకరి ఆజ్ఞ లేమిటిన్యాయమూర్తులైనా పాలకులైనామీ నిర్ణయాలతో పనేమిటిఇక
కవిత్వం

‘మన కాలం పిల్లలు’

మేము మన కాలపు పిల్లలం.ఇది రాజకీయ కాలం.దినమంతా, రాత్రంతాఅన్ని వ్యవహారాలు, మీవి, మావి, వాళ్ళవి -అన్నీ రాజకీయ వ్యవహారాలేమీకిష్టమైనా, కాకపోయినా.నీ జన్యులకి రాజకీయ గతం వుందినీ చర్మం ఒక రాజకీయ కులంనీ కళ్ళు ఒక రాజకీయ దృష్టినువ్వేం చెప్పినా అది ప్రతిధ్వనిస్తుందినువ్వేం చెప్పకపోయినా దానికదే ఒక వ్యక్తీకరణ.కనుక రెండు విధాల నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు.నువ్వు అడవిలోకి ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడనువ్వు రాజకీయ కారణాలతో రాజకీయ ఎత్తుగడలే వేస్తున్నావు.వి/రాజకీయ కవితలు కూడా రాజకీయమేమామీద ప్రకాశిస్తున్న చంద్రుడుఇంకెంత మాత్రమూశుక్ల వర్ణము కాదుఅస్తిత్వంలో ఉన్నామా లేమాఅదీ అసలు ప్రశ్న.అది జీర్ణం చేసుకోవడం కష్టం కావొచ్చుకాని అది ఎల్లప్పుడూ ఒక రాజకీయ ప్రశ్న.రాజకీయ అర్థాన్ని
కవిత్వం

కాల్చిన బూడిద కుప్ప కింద

సత్యం ** సత్యమిపుడు సంకెళ్ల కింద రక్తమోడుతూ ఉండవచ్చు జైల్లో అండా సెల్లో అనారోగ్యంతో కునారిల్లుతూ ఉండవచ్చు ముస్లిం మొహల్లాలలో మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో ఇరుకిరుకు బతుకుల్లో కప్పబడి ఉండవచ్చు అడవిలో గూడేల్లో కాల్చిన బూడిద కుప్ప కింద ఊపిరాడక గింజుకోవచ్చు.. ఇంద్రావతి అలల మీద శవమై తేలి యాడ వచ్చు కోర్టు మెట్ల మీద దిగాలుగా కూర్చుని దిక్కులు చూస్తుండవచ్చు అనేకానేక కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు దాన్ని సముద్రంలో ముంచండినిప్పుల్లో కాల్చండిఏడేడు నిలువు ల లోతునభూమి లోపల పాతిపెట్టండి
కవిత్వం

వస్తున్నాను

లేను నేను ఏ కర్రెగుట్టల్లో మధ్య భారతాన్ని ఏలే ఏ దండకారణ్యంలో దిక్కులు దద్దరిల్లే ఏ యుద్ధ క్షేత్రంలో తిరగపడ్డ ఏ గలాల గర్జన పరిధిలో దూసుకొచ్చే ఏ తూటాల దారిలో అయినా నాలో యుద్ధ చురకలు ఉరకలెత్తుతున్నాయి అమరుల గుండె నెత్తుటి వేడి నాలో ప్రవహిస్తుందివెనుతిరగని వీరత్వం అటు వైపుగా నడిపిస్తుందినా ప్రశ్నకు నీ సమాధానం తూట అయితే నా ధైర్యాన్ని చంపే ఆయుధం నీ దగ్గర లేదంటాను నా గమనాన్ని నిలిపే ముగింపు మరణమే అయితే నా ఆలోచనలను ఆపే నీ బలగాలు సరిపోవంటాను తిప్పుతాను దిక్సూచినై నీ వైపు అందరి చూపులని కాల్చుతాను నిప్పునై
కవిత్వం

మొక్కలను నాటుదాం

నీళ్లతో కాదు ఇప్పుడు ఆ నేలంతా నెత్తురుతో సాగు చేయబడుతుంది రండి మనమంతా కలిసి మొక్కలు నాటుదాం మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను అరుణతారలను కాస్త దగ్గరగా నాటుదాంఒకనాటికి ఎర్రని పువ్వుల వనాన్ని తయారు చేద్దాం మీకు తుపాకీతో ఎవరైనా కనబడితే ఒక మొక్కను నాటమని చెప్పండి నీడ వారికి కూడా అవసరమే కదా మొక్కలను నాటి నాటి చివరకు మీరు అలసిపోతే మీ కంటిమీద కునుకు ఏదైనా వస్తే ఇక్కడే ఇలాగే కాస్త విశ్రాంతి తీసుకోండి మీ చేతులకంటిన మట్టిని ముద్దాడడానికి మీరు నాటిన మొక్కలను చూడడానికి ఒక ఉదయాన తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు
కవిత్వం

సత్యమెప్పుడూ ఓడిపోదు

ఒక్కొక్కరూ నిన్ను చెరిపేస్తామని చెప్పే వాళ్ళే కానీ ప్రతి సారీ నువ్వో కొత్త చరిత్రగా నెత్తుటి సంతకంగా వేలాది పుటలుగా వెలుగొందుతున్నావు కోట్లాది ప్రజల ఆకాంక్ష కలలు నీలో దాగున్నవి వాటిని ఛిద్రం చేసేందుకు వాడెప్పుడూ ఆయుధాలనే నమ్ముకున్నాడు కానీ నువ్వెప్పుడూ నిరాయుధ ప్రజల చేతులలో సుత్తి కొడవలి నాగలిపనిముట్లతోనే ఇన్నేళ్ల యుద్ధాన్ని పోరాడుతూ సేద్యం చేస్తున్నావు పుడమీ ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ తోడుగా సాగే బాట నీది వాడెప్పుడు ఏవేవో కుట్రలు కుతంత్రాలతో నిన్ను ఓడిద్దామని విరుచుకు పడుతుంటాడు కానీ గడ్డి పరకలతో ఏనుగును బంధించిన చేతుల చేవ నీదని చరిత్ర చెబుతోంది మనుషులను చంపితే నిన్ను