కవిత్వం

ఇదేనా స్త్రీల ఉన్నతి?

బుక్కెడు బువ్వ కోసం కార్డు కోసం క్యూ కట్టాలి మోదీ గ్యారంటీ అన్న యోజన అంటూ చప్పట్లు కొట్టాలి ‘ఉజ్వల’తో నిప్పు రాజేస్తే పళ్లెంలోకి బువ్వ చేరుతోంది మోదీ స్మరణతో పొట్ట నింపాలి చీకట్లో, ముఖం చాటేసుకొని సిగ్గుతో బజార్లో దొడ్డికెళ్లక తప్పని దిక్కుమాలిన జీవితాల్లో శాచాలయం మోదీ గ్యారంటీ తల దాచుకోవడానికి నీడ కరువైన జీవితాల్లో ప్రధాన మంత్రి అవాస్‌ యోజనతో సంసారం చేయాలి సమాన హొదా అంటూ సర్పంచు పదవులతో నారీ శక్తికి వందనం అంటూ చట్ట సభలలో రిజర్వేషన్‌లతో అందలం ఎక్కిస్తున్నారు నిర్భయను మరిచిపొమ్మంటున్నారు హథారాస్‌ మనది కాదంటున్నారు కశ్మీర్‌కు అలా జరుగాల్సిందే అంటారు
కవిత్వం

పదేళ్ల అక్రమ నిర్భంధం

చేయని తప్పు చేసాడని కటకటాల వెనక్కి పంపిన రాజ్యం అక్షరం హేతువు ను బోధిస్తుందని హేతువు మార్క్సిజానికి మూలమని అక్షరానికి సంకెళ్ళు వేసింది వందశాతం ఫాసిజం కోరలు పీకి తొంభై శాతం వైకల్యం సాధించిన గెలుపు ఇంకా తరాజులో న్యాయం వుందని తేల్చింది ఎన్ని ఉదయాలు ఎన్ని అస్తమయాలు ఈ పదేళ్లలో తూర్పు పడమర ల మధ్య ఊగాయో ఓ కొత్త పొడుపు కోసం నిరీక్షించిన కళ్ళు నిజాన్ని బంధిస్తే అబద్దాల రాజ్యం కి వెసులుబాటు మసి పూసి మారేడు కాయ చేయజూస్తే మసి పూసుకోక తప్పదు ఎన్నాళ్ళైనా!! కోల్పోయిన సామాజిక జీవనం చీకటి రాత్రుల్లో కోల్పోయిన వెలుగు
సాహిత్యం కవిత్వం

వనాన్ని మింగిన కులం

ఒక చాటింపు పొద్దు కుంగే వేళఓ సమూహ కలయికవంటా వార్పు రేపుడప్పు పై దరువు తో మరునాడు పొద్దు పొడిచే వేళబండెడ్లు సిద్దంగిన్నెలు తపేలాలతో తరలుఅంతా ఒకే చోటు వనం అంటే చెట్లుఇళ్లకు గొళ్ళెం పెట్టిచెట్ల కిందకిసమూహాలుగాసమూహ సంఖ్య బట్టి చెట్టు ఎంపికనీడ కోసం ఉసిరి లేదు మర్రి లేదువేప లేదు రావి లేదుచల్లని గాలి కాసింత నీడ ఆ వేళమంత్రం లేదుతంత్రం లేదుసామూహిక వికాసంలో భాగంమానసిక సంఘర్షణకు ఉపశమనంఅందరిలో ఒకరమై ఒకరికి ఒకరమైమాటలు చేతలు కలివిడిగా చెట్టు కొమ్మలకు వేలాడే వేటలుజంతు అనాటమీ లో ఆరి తేరిన చేతులుపొందిక గా పోగులుపొయ్యి మీద నూనె తాళింపు చిటపటఅల్లం
కవిత్వం

యుద్ధం మధ్యలో

నెత్తుటి కన్నీరుతో ఇంద్రావతి ఎరుపెక్కిందిచావులను అంకెలతో లెక్క కడుతున్నాడు దేహాలను కుప్పలుగా పోసిఅంతిమ యుద్దమనిహెచ్చరిస్తున్నాడుముఖాలను గుర్తుపట్టక ముందే తలలకు కట్టిన వెలలు ప్రకటిస్తాడుపాలబుగ్గల పసివాళ్ళనుమెషీన్ గన్లతోచంపుతున్నాడునిరాయుధుల చెంత తుపాకులు పరిచి ఎదురుకాల్పుల కట్టు కథలు చెప్తాడుద్రోన్లతో విష వాయువులు చిమ్మి అడవి బిడ్డలప్రాణాలు హరిస్తాడు ఆకుపచ్చనిఅరణ్యమంతాసైనిక క్యాంపులు నింపుతున్నాడునేలకింది బంగారం వాడికి అమ్మకపుసరుకుగా కావాలి వాడిది కార్పొరేట్ యుద్ధంమనది జనతన పోరాటం.
సాహిత్యం కవిత్వం

వెలుగు‌ రేఖలు

అమ్మ  అంతే మౌనంగా  తన భుజాన్ని తనకు  ఆసరాగా ఇచ్చిన  సహచరిగా  నిబ్బరంగా  నిదానంగా తోడుగా  నిర్బంధాన్ని ఎదుర్కొన్న అమ్మతనమే తనది విసుగు లేని తన జీవనయానం తెల తెలవారే  చిరునవ్వుతో ఉదయించే అమ్మ సభలలో ఓ కాంతిరేఖ నిరాడంబరంగా  నిలకడగా తన తోవ  వెనక నడచిన సహచరిగా  ఎప్పుడూ గుర్తుండే  అమ్మ తను అమ్మలంతే  ఆకాశంలో వెలితిని  పూడ్చే వెలుగు రేఖలు వారికేమిచ్చి  రుణం తీర్చుకోగలం మనసంతా నిండిన  దుఃఖపు నివాళి తప్ప... (కా.ఆలూరి లలితమ్మకు నివాళిగా)
కవిత్వం

కొత్త పొద్దు

కబళించే కార్పొరేట్ సమయంలో దట్టమైన టేకు వనంలో తుపాకీల మోత వినిపిస్తుందిఆకుపచ్చని అడవిలో ఎరుపు చిమ్మిందిఎన్ని గడ్డిపోచలు ఆక్రోశం తో రగులుతున్నాయి మోదుగుపూలు కొద్ది నీళ్ళల్లో మరుగుతున్నాయిఇంకినాకా రసాన్ని కలంలో పోసి కసిని పాళీ వెళ్ళగక్కుతుంటే చావులను నిరసిస్తూ వ్రాస్తున్నాకాగితం ఎర్రబారిన అక్షరాలతో మెరుపులు సృష్ఠిస్తుంది కుంగిన పొద్దు మళ్ళీ ఉదయించే లోపుసరికొత్త పొద్దు వైపు నా అక్షరాలు పయనిస్తాయి!
సాహిత్యం కవిత్వం

అమ్మ

అవును!!!నేను..ఎన్నిసార్లు పిలిచినావిసుగురాని పదం అమ్మ! ఎందుకంటే..మా అమ్మ అందరి అమ్మలాటీవీ ముందు కూర్చునివంట ప్రోగ్రామోకామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ! నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!మరిమా అమ్మ ఎలాంటి అమ్మ ? ఈ భూమి మీదఅరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూపంటకి కలుపు తీసే అమ్మ… మా అమ్మ ! ఆకాశమంత దుఃఖంఅవనికి ఉన్నంత ఓర్పుమా అమ్మ సొంతం తన చెమట చుక్కల్నితన కన్నీటి గుక్కల్నితాగిన ఈ భూమిమా అమ్మకి ఎప్పుడు
సాహిత్యం కవిత్వం

దేశ‌మే గెలిచింది

ఇప్పుడు దేశమే లేచి నిలబడి గెలిచింది.. కాదు... కాదు నాగలి కర్రు గెలిచింది  మట్టి వ్యాపార కణమై మనుషుల అస్తిత్వమే నేరమైపోయిన చోట  మ‌ట్టి గెలిచింది ఆకలి నేరమై హక్కులు అడగడం నేరమై పోరాడడమే నేరమై దర్యాప్తు సంస్థల  దాడులు చేస్తున్న  చోట‌ ఎన్నెన్ని  కుట్రల వలయాలనో దాటి  ఈ నేల గెలిచింది ఇప్పుడు గెలిచింది దేశం కాదు.. కాదు దేశాన్ని కర్రు నాగలి  గెలిపించింది గెలిచింది ఈ దేశపు  మట్టి మనిషి. 
సాహిత్యం కవిత్వం

కాలం తొంగి చూస్తోంది

లిప్తలన్నిటినీ కొలిచిధాన్యపు గాజకు పోద్దాం యీ రెణ్ణెల్లలోఒక్క నీటిగింజమిగిలితే నీమీదొట్టు ఆగడానికే ముందక్కడ?జల్లలో మిగలడానికి చేపలా అవి!కారిపోయే కన్నీరేకదాచివరకుమన దోసిట్లో మిగిలింది    ***   ***    ****కాలం నిన్నూ నన్నూ గమనిస్తోంది ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కేరింతలు లేవునదుల్లో సృష్టినిమోసే జీవమూ లేదుపీక్కుతినేయగా మిగిలిన అస్తుల లెక్కనీవో, నేనో అప్పజెప్పాలి రాజూ లేడు..మంత్రీ లేడూ పూచీపడడానికిరాజ్యం పేరున సరిహద్దులు మాత్రమే వున్నాయిఅక్కడా మానవ హననమేపేరు ఎదయితేనేం?న్యాయంలేదు అడ్డుపడడానికిచట్టం పేరున సంకెలలు మాత్రమే వున్నాయిఅక్కడ నిండా మోసమే!***     ***      ***తర్కించుకొని తడిమిచూసుకుందామా కాసేపులిప్త కాలమైనా చాలులే! అగ్నిధారలై  ఏళ్లుగా కలసి ప్రవహించిన మనంఎప్పుడు  విడిపోయాం!కలవలేనన్ని పాయలుగా మత మానవులుగాస్త్రీలుగా , పురుషులుగాకులాలుగా,
సాహిత్యం కవిత్వం

చేవ

నాకు కావాల్సిందివేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రంఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదుమూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీఎప్పుడూ వెంటాడుతుందిమట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుందిగుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులుకొరడాలై కొడుతూ ఉంటాయ్పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికిఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్ ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటేఅటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలేఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారామృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపిఒకే వేటుకు నరికారా తరవాతి విషయం తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్నకన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులువిరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు