నిప్పుల కొలిమిగా యూరప్
ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌వేవ్ (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి.. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రజలను కష్టాల పాలు చేస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రాత్రిని నమోదు చేయగా.., బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్-టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు చవి చూశాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్ స్లాబ్‌లు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు కరిగిపోయి దెబ్బతినడం.. రోడ్లు బీటలు బారడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండలతో యూరప్ దేశాలలో 6000 మందికి పైగా










