యుద్ధోన్మాద కాలంలో “తల్లి భూదేవి”
అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టిపెరిగి... తన రచనల ద్వారా కిర్గిస్తాన్ దేశానికి వన్నె తెచ్చిన రచయిత ఐత్మాతోవ్. అతడి రచనలు తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు, జమీల్యా వంటివి ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయి. చింగీజ్ ఐత్మాతోవ్ 1928 డిసెంబరు 12 న నగియా, తోరకుల్ ఐత్మాతోవ్‌లకు జన్మించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో యుద్ధం ద్వారా బాగా ప్రభావితమయిన సోవియట్ రష్యా గూర్చి... యుద్ధ విధ్వంసాలా గురించి, అక్కడి విప్లవానంతరం వచ్చిన పరిణామాలను రచించినాడు ఐత్మాతోవ్. ఈయన రచనల్లో అసాధారణమయిన సున్నితత్వం కనిపిస్తుంది.. సమకాలీన దృక్పథమూ కనిపిస్తుంది. ఆ రచనా శైలినే భిన్నమైనది ఈయన రచనలను తెలుగులోకి










