విప్లవ ప్రేమికుడు కామ్రేడ్ ఎల్. సుబ్బయ్య
బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, విప్లవాభిమాని ఎల్. సుబ్బయ్య(88)గారు గత కొద్ది కాలంగా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతూ ఏప్రిల్ 6వ తేదీ హైదరాబాదు ఆస్పత్రిలో అమరుడయ్యాడు. ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా మొదలై జీవిత పర్యంతం లౌకిక ప్రజాస్వామి విప్లవశక్తుల పక్షాన దృఢంగా నిలబడ్డారు. బైటి ప్రాంతాల్లో కర్నూలు సుబ్బయ్యగారిగా ఆయన అనేక మంది ప్రజాసంఘాల కార్యకర్తలకు, మేధావులకు, రచయితలకు చిరపరిచితుడు. కోవిడ్‌కు ముందు మూడు నాలుగేళ్ల వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రజాసంఘాల కార్యక్రమాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు. ఏ ప్రగతిశీల సంస్థ కార్యక్రమం జరిగినా, ఉద్యమం నడిచినా వాటికి సంబంధించిన కరపత్రాలను ప్రజల్లోకి తీసికెళ్లడం ఆయనకు



