వ్యాసాలు

ప్రజా యుద్ధ సేనాని 

తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు. బహుశా ఎంతో కొంత దు:ఖపుతడి సోకని వాళ్లెవరుంటారు?  అలాంటి సందర్భం మరి. ఎంత అద్భుత జీవితం! ఆయన చుట్టూ చేరి గభాల్న ఏదో ఒక మాట అనడం, రాయడం సాధ్యమయ్యేదేనా?   చనిపోయింది వ్యక్తిమాత్రుడు అయితే గుణగానం చేసి సర్ది చెప్పుకోవచ్చు  ఇది ముగింపు అయితే ఇంకేమీ లేదని నిరాశతో సరిపెట్టుకోవచ్చు. మావోయిస్టుపార్టీ కేంద్ర కార్యదర్శి అంటే అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశ ప్రజలు గడించిన   పోరాట అనుభవం. వాళ్ల ఆచరణలో
సాహిత్యం వ్యాసాలు

నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని
సాహిత్యం వ్యాసాలు

నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు

(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట)  తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో
వ్యాసాలు సమీక్షలు

జీవితం మలచిన కవి

'పూలపరిమళం'లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన
వ్యాసాలు

ఏడు నెలల మహత్తర సిల్‌గేర్ పోరాటం

డిసెంబర్ మాసం, చలి కాలం రాత్రి 10 గంటల సమయం. సిల్‌గేర్ గ్రామం…. చింత చెట్టు కింద మండుతున్న నెగళ్ళ  చుట్టూ దాదాపు 30 మంది యువతి, యువకుల బృందం కూచుని వుంది. మంటల నుంచి వచ్చే వెలుతురు చీకటిని చీలుస్తూ, చెట్ల నీడల్లో మెరుస్తోంది.  ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఇలా సమావేశం జరగడం చాలా అసాధారణమైన విషయం. భద్రతా బలగాలు,  మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న దారుణ, సుదీర్ఘ పోరాటానికి కేంద్రంగా ఉన్న దక్షిణ బస్తర్‌లోని అడవికి నడిబొడ్డున వున్న సిల్‌గేర్ అనేక మంది అమాయకులు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న యుద్ధ భూమి. సాధారణంగా
వ్యాసాలు

మతవర్గ తత్త్వం

(జనవరి 10 , 1985 గద్వాల విరసం సాహిత్య పాఠశాల ప్రసంగ పాఠంలోంచి కొంత భాగం - వసంత మేఘం టీం ) ...ఐతిహాసిక ,  పౌరాణికాంశాలను వదిలి, చరిత్రలో మధ్యయుగాలకు సంబంధించిన మతపరమైన యుద్ధాలకూ మారణదారుణాలకూ వస్తే, వాటి కారణాలు కేవలం మతంలోనే లేవని తేలుతుంది. మతసంస్థలకు చెందిన ఆస్తిపాస్తుల విషయంలో, రాజపోషణవల్ల సమకూరే శుద్ధభౌతిక సదుపాయాల విషయంలో, భూస్వామిక సమాజంలోని హెచ్చుతగ్గుల విషయంలో వచ్చిన సామాజికమైన పోటాపోటీలు మత విరోధాల రూపం పొందిన సందర్భాలు ఒకటీ రెండూ కాదు. బ్రాహ్మణ మతం ఎన్నడో గతించిపోగా, బౌద్ధాన్ని చావగొట్టిగానీ చచ్చుపార్చిగానీ హైందవం తన ప్రాబల్యం స్థాపించుకున్న తర్వాత
కొత్త పుస్తకం సాహిత్యం వ్యాసాలు

విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పు

నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ
వ్యాసాలు

హింస – అహింస – ప్రతి హింస

"న్యాయమూ, ప్రేమ లేకుండా శాంతి ఎల్లప్పుడూ గొప్ప భ్రాంతి మాత్రమే”- బెల్జియన్ ఆర్చి బిషప్ హేల్దేర్ కెమరా •             (Without justice and love, peace will always be a great illusion)  హింస- అహింస- ప్రతి హింస లపై చర్చ ఈ నాటిది కాదు. అసలు హింస లేనిదేనాడు? దానికి ప్రతిగా హింసా భాధితుల ప్రతిహింస లేనిదేనాడు? రూపంలో చాలా మార్పులు జరిగివుండవచ్చు. పీడకుల హింస, పీడితుల ప్రతిఘటన- శ్రీ శ్రీ అన్నట్టు “ ఏదేశ చరిత్ర జూచినా ఏమున్నది గర్వకారణం ”.  మనదేశ చరిత్రలో ఇతిహాసాలు,పురాణాలన్నింటా హింసాత్మక సంఘటనలే? ఆయుధం లేని దేముడున్నాడా? అయితే,మనం
వ్యాసాలు

సంఘటితం అవుతున్న బస్తర్ ఆదివాసీ పోరాటాలు

“గత సంవత్సరం, కొంతమంది జిల్లా రిజర్వ్ గార్డులు గ్రామానికి వచ్చి నన్ను పట్టుకుని, నక్సలైట్లు ఎక్కడ దాక్కున్నారో చెప్పమని వేధించడం మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు అడవిలో తిప్పారు. చాలాసార్లు శారీరకంగా హింసించి, చివరకు అడవిలో వదిలేశారు, ”అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాల ఆరోపణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్మిత (పేరు మార్చబడింది) అన్నారు. గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న భద్రతా బలగాల శిబిరాలకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో నిరసనలు చేస్తున్న వేలాది మంది గ్రామస్తుల్లో స్మిత ఒకరు. స్మిత గ్రామంలో మాదిరిగానే, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్, సుక్మా, తదితర జిల్లాల్లోని గ్రామాల్లో భద్రతా దళాల
కొత్త పుస్తకం సాహిత్యం వ్యాసాలు

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి