ఛత్తీస్గఢ్లో ‘చట్టవ్యతిరేక’ కార్యకలాపాలు
ఛత్తీస్గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద ( సిఎస్పిఎస్ఎ) మూలవాసి బచావో మంచ్ (ఎంబిఎమ్)ని 'చట్టవ్యతిరేకమైన సంస్థ'గా ప్రకటిస్తూ 2024నవంబర్ 8 నాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది . చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం (యుఎపిఎ)- 1967 లాగానే, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం భావించే సంస్థలను నిషేధించడానికి సిఎస్పిఎస్ఎ ప్రభుత్వానికి అధికారాన్నిస్తుంది. ఈ చర్య చేపట్టడానికి ఆ నోటిఫికేషన్ రెండు కారణాలను పేర్కొంది: ఒకటి, "మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల "లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మంచ్ వ్యతిరేకిస్తోంది; రెండు, తమ భూముల్లో సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తోంది.










