వ్యాసాలు

రెండు ఇంజన్ల ప్రభుత్వ ఆర్ధిక స్థితి లో మోడీ-యోగీ ప్రభుత్వం 

 ‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో తన రాజకీయాధికారాన్ని ప్రారంభించిన బిజెపి ప్రభుత్వం గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి చేర్చింది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తలసరి ఆదాయం: 2020లో ఉత్తరప్రదేశ్  మొత్తం జనాభా దాదాపు 23కోట్లు వుంది. ఆదాయ వార్షిక సంవత్సరం 2011-12లో  2015-16, 2016-17లలో దాదాపు 12 శాతం వుండిన స్థిరమైన విలువ అభివృద్ధి రేటు సగటు 4శాతానికి పడిపోయింది. మొదటి రెండు సంవత్సరాలలో 8 నుంచి 10 శాతం వుండిన తలసరి ఆదాయం పడిపోయి 4 శాతం అయింది. ఆ తరువాత 2.4 నుంచి 4.4 మధ్య
ఓపన్ పేజ్

దృశ్యంలోని అర్థాలు

ఢల్లీ కంటే గన్నవరమే అపురూపమట. చాల మందికి అట్లా అనిపించింది. అంతే మరి. రాజుకంటే రాజును నిలబెట్టినవాడే ఘనుడు.  భూస్వామ్యంలో ఇది చెల్లుబాటవుతుందా? ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. తరచూ ప్రజాస్వామ్యం సాధించే విజయం ఇదే. జూన్‌ 12వ తేదీ ప్రమాణ స్వీకార వేదిక మీద కనిపించినంత ఆహ్లాదంగా చంద్రబాబు అంతకముందెన్నడూ కనిపించలేదని ఎవరో అన్నారు. నరేంద్రమోదీ కూడానట. వేదిక మీద ఆ ఇద్దరూ  ఎన్ని ముచ్చట్లు కలబోసుకున్నారో. ఎంతగా  చిరునవ్వులు చిందించారో. అధికార ప్రదర్శన తప్ప మరేమీ తెలియని ప్రధాని మమతానురాగాలను ఎంతగా ప్రకటించాడో. తాను ఒక్కడే తప్ప మరెవరినీ పక్కన భరించలేని వ్యక్తి అంత మంది మధ్య ఎంత
వ్యాసాలు

అజ్ఞాత అమర కథా రచయిత్రులు

(*వియ్యుక్క* అంటే గోండిలో వేగుచుక్క. తెలుగు అజ్ఞాత  విప్లవ కథా చరిత్రకు దారులు వేసిన రచయితలు ఎందరో. వాళ్లలో మహిళల పాత్ర గణనీయం. విప్లవంలో  సగానికి పైగా ఉన్న మహిళలు విప్లవోద్యమ చరిత్రలో, విప్లవోద్యమ కథా చరిత్రలో ప్రముఖంగా ఉండటం సహజమే. విస్తారమైన అజ్ఞాత కథా గమనానికి నిజంగానే వేగుచుక్కలవంటి రచయిత్రులు ఉన్నారు. వాళ్ళ సాహసోపేత, సృజనాత్మక, ఆదర్శప్రాయ ఆచరణా రచనా జీవితాన్ని సగౌరవంగా స్మరించుకోకుండా ఈ వియ్యుక్క సంకలనాలు ఎలా తీసుకరాగలం? అలాంటి తొమ్మిదిమంది అమర కథా రచయిత్రుల జీవిత, రచనా విశేషాలను ఈ పుస్తకాల చివర ప్రచురించాం. *వియ్యుక్క*  అందడానికంటే  ముందు వాళ్ళ వివరాలను వసంత మేఘం
వ్యాసాలు

ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్

ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో
వ్యాసాలు

 ప్రపంచ వర్గ పోరాట సాహిత్యానికి చేర్పు

విస్మరణ, వక్రీకరణలతోపాటు  విధ్వంసమై పోయిన   ఆదివాసుల, దళితుల, బహుజనుల, మహిళల వర్గ పోరాట చరిత్ర, సాహిత్యం సిపాయి తిరుగుబాటుతోనే  తిరిగి  వెలుగులోకి రావడం మొదలైంది .  యూరప్‌లో జరిగిన పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు, పారిస్‌ కమ్యూన్‌, రష్యా, చైనాల్లో జరిగిన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలు ప్రపంచ  పీడిత ప్రజలను ప్రభావితం చేశాయి. 1967 నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి సాయుధ పోరాటాలు చైనా సాంస్కృతిక విప్లవం, గ్రేట్‌ డిబేట్‌ నేపథ్యంలో అర్ధవలస, అర్ధ భూస్వామిక పార్లమెంటరీ దగుల్బాజీ రాజకీయాలతో నలిగిపోయిన పీడితప్రజల ముందుకు విప్లవ శ్రేణులు వర్గపోరాటాన్ని  సాయుధ  రూపంలో బలంగా ముందుకు తెచ్చాయి. పదేండ్ల పోరాట అనుభవసారంతో 1977లో
వ్యాసాలు

సనాతనవాద సంకెళ్లు తెంచుకుందాం!

క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుండి పశుపాలక ఆర్యులు భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చారు.   ఆ తదనంతర పరిణామ క్రమంలో ఇక్కడ పితృస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. మాతృస్వామ్యం లేదా మాతృప్రధాన సింధూ నాగరికత ఆర్యుల దాడులతో దెబ్బతిని వారి పితృస్వామ్యమే ఇక్కడ క్రమంగా వేళ్లూనుకుంది. అయితే ఆర్యుల దాడులకు దూరంగా కొండ కోనలలో ఉండిపోయిన ఆర్యేతర మూలవాసీ ప్రజలలో మాతృ ప్రధాన లక్షణాలు నేటికీ అవశేషాలుగానైనా మిగిలి ఉన్నాయి. 19 -20వ శతాబ్దాలలో మూలవాసులలోకి బ్రాహ్మణవాదం వేగంగా చొచ్చుకురావడం, మూలవాసీ ప్రజలను బలవంతంగా హైందవీకరించడం జరుగుతోంది. భారతదేశానికి ఆర్యుల వలసతో అంతకు పూర్వపు నాగరికత చరిత్ర
వ్యాసాలు

ఆధిపత్య సమాజాల్లో ప్రాణాల విలువ

ఆధిపత్య సామాజిక వ్యవస్థల్లో (ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో కులం మౌలికంగా వర్గంతో పాటు ఒక ఆధిపత్య నిర్మాణం) సుదూర గత చరిత్రలోకి వెళ్లకుండా చూసినప్పుడు యూరోపియన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో ఆదివాసులు తెగలుగా, జాతులుగా ప్రాణం విలువతో కాకుండా పెట్టుబడిదారీ ప్రమాణాల్లో వనరుతో తూకం వేయబడుతున్నారు. ఇతర ఇంధనాలతో పాటు, ఒక దశలో అన్నిటికన్నా మార్కెట్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి ప్రాబల్యంలోకి వచ్చిన చమురు అనే వనరు దృష్ట్యా ఇస్లాం మతావలంబకులైన జాతులు అధికంగా ఉన్న దేశాలు (పాలస్తీనా, ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌ల
వ్యాసాలు

జతీన్ దా మన స్ఫూర్తి

మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలర్పించిన వేలాది సమరయోధులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ (జతీన్ దా) ఒకరు. ఆయన జైలులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ అమరణ నిరహారదీక్షకు పూనుకొని 63 రోజుల తర్వాత అమరుడైనాడు. ఆయన సంస్మరణలో సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటించడం మన దేశంలో ఒక పోరాట సంప్రదాయంగా నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు కూడ రాజకీయ ఖైదీల హక్కుల దినం సెప్టెంబర్ 13నాడు దేశ వ్యాప్త జైళ్లలోని ఖైదీలు, విచారణలోని ఖైదీలు  సంకల్ప దినంగా పాటించాలనీ. బయట ప్రజలు కూడ
వ్యాసాలు

స్త్రీల కథావికాసపు అత్యున్నత దశ *వియ్యుక్క*

తెలుగులో ఆధునిక కథకు ఆరంభం  1910 లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అని చాలాకాలంగా అనుకొంటూ వచ్చాం. కానీ భిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీలను వెతికి కేంద్రంలోకి తీసుకువచ్చే పూనిక పెరిగిన క్రమంలో 1901 నాటికే కథలు వ్రాసిన భండారు అచ్చమాంబను తెలుసుకోగలిగాం. 1879 నుండి ఆధునిక స్వరూప స్వభావాలను సంతరించుకొంటూ తెలుగు కథ ప్రయాణం ప్రారంభం అయితే ఆ ప్రయాణంలో అడుగులు కలిపిన  తొలి మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల జీవిత చైతన్య వికాసాలకు కేంద్రమైన సంఘ సంస్కరణోద్యమ ఆశయ ప్రచార నిబద్ధత నుండి ఆమె కథలు వ్రాసింది.
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా