గల్పిక

ద నేషన్ వాంట్స్ టు నో

ధర్నా ప్రాంతంలో నిఘా వర్గాలు పోలీసులు జర్నలిస్టులు స్వయం సేవకులు రూలింగ్ పార్టీ కార్యకర్తలు యెవరేంటో గుర్తు పట్టలేని విధంగా మందిలో కలిసిపోయి సమాచారం సేకరిస్తున్నారు. ఒకరి చేతిలో మైక్ మరొకరి దగ్గర కాగితం కలం యింకొకరి చేతిలో దుడ్డుకర్ర వేరొకరి మెడలో కెమెరా అందరూ కాలికి వేలికి అడ్డువచ్చినవాడినల్లా గుచ్చి గుచ్చి ప్రశ్నలడుగుతున్నారు. “ఎక్కణ్ణుంచి వచ్చావ్?” “బిహార్ నుంచి” “చూస్తే ఉద్యోగం సద్యోగం లేనోడిలా ఉన్నావ్. ఇంత దూరం వచ్చి యిన్ని రోజులు సిటీలో వుండటానికి పైసలు యాడ నుంచి వచ్చినయ్? … “అరేయ్ పిల్ల నాయాలా యిట్రా రా” “సర్” “వయసెంత రా” “17 యేళ్లు
కథలు

యాభైయ్యారు మార్కులు!

ఉన్నట్టుండి బ్లాంక్ అయిపోయేను. నే మెడిటేషన్ చేసినప్పుడు కూడా నాలో అంత బ్లాంక్‌నెస్ లేదు. చేతిలో రీవాల్యేషన్ చెయ్యాల్సిన ఆన్సర్ షీట్‌నే చూస్తూ కనురెప్పలు ఆర్పడం మరిచిపోయాను.           “ఈ రీకౌంట్‌లూ రీవాల్యేషన్‌లూ కాండిడేట్స్‌కు బెనిఫిట్ వున్నా లేకపోయినా ప్రభుత్వానికి పక్కా ఇన్‌కమ్...” అన్నాడు పేపర్లు దిద్దుతూ సారీ- దిద్దిన పేపర్లు చెక్ చేస్తూ మా కొలీగ్.           నేనేమీ మాట్లాడలేదు. ఎగ్జామినేషన్ ఫీ వొక్కటే కాదని, రీకౌంటింగ్ ఫీ అని, రీవాల్యేషన్ ఫీ అని- అన్నీ బాగానే వసూలు చేస్తున్నా, మనకు పేపరుకు యిచ్చే కాస్ట్ మాత్రం పెంచడంలేదని మా కొలీగ్ వాపోతున్నాడు.           అవేవీ నా
కథలు

భక్తి కాండ!

విచారణ మొదలైంది!           “మీ టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది, అంటే మీరు యెలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు?” విచారణ కమిటీ సభ్యుడు అడిగాడు. ఆ టీవీ ఛానల్ వోనరుకు యేమీ అర్థం కాలేదేమో అయోమయంగా చూశాడు. ‘ఇందులో మా తప్పు యేమీ లేదు’ అన్నట్టు చూస్తున్న సిబ్బంది వైపు చూపు తిప్పి అందర్నీ చూస్తూ “ఆన్సర్ మీ” గొంతుపెంచి అన్నాడు కమిటీ పెద్ద.           “ఇప్పుడూ వో శానిటేషన్ వర్క్ చేసేటప్పుడు కూడా చేతికి గ్లౌజులు వేసుకుంటారు. కాళ్ళకి బూట్లు వేసుకుంటారు. ఊ... ముఖానికి మాస్క్ తగిలించుకుంటారు... అలాంటిది మీరు...” తలడ్డంగా వూపి భరించలేనట్టు “మైండ్‌లెస్ ఫూల్స్” గొణుక్కున్నట్టు
కథలు

“రా”

ఆగస్టు నెలలోని ఆ ఉదయం ఎప్పటిలాగే చాలా సాధారణంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో దశాబ్దాల నాటి పాత పుస్తకాల వాసన, వంటగది నుండి వస్తున్న వేడి ఫిల్టర్ కాఫీ సువాసనతో కలిసిపోయి ఒక అదృశ్యమైన పొగమంచులా గదిలో తేలియాడుతోంది. రావు తన పాత కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నారు. ఎనభై ఏళ్ల వయసు ఆయన ముఖంలో, గీతల రూపంలో గీసిన మ్యాపులా స్పష్టంగా కనిపిస్తోంది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి, అది కాలం ఆయన శరీరానికి బహుమతిగా ఇచ్చిన పార్కిన్సన్స్. బయట రోడ్డు మీద పాలు అమ్మేవాడి సైకిల్ బెల్ మోగింది. అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. ఆ
కథలు

“గూగు” కథ 

విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక వ్యాధిలా వ్యాపిస్తోంది.  సాయంత్రం వేళ కొండల మీద పడే ఎండ కూడా సహజమైన రంగును కోల్పోయి, ఎల్‌ఈడీ స్క్రీన్ మీద వెలుగుతున్న పాలిపోయిన పసుపు రంగులా కనిపిస్తోంది. నగరంలో ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు, కానీ అందరి కళ్ళలో ఒక నిశ్శబ్దమైన, అర్థంకాని అలసట. అన్నిటికంటే విషాదకరమైన విషయం ముడసర్లోవ జలాశయం. రాత్రికి రాత్రే ఆ జలాశయం ఎండిపోవడం మొదలైంది. కానీ నీరు మామూలుగా ఆవిరి కావడం లేదు. ఆ
గల్పిక

పరీక్షా పే రచ్చ

పరీక్షా పే రచ్చ ప్రోగ్రామ్ లో వెనక వరసలో కూర్చొన్న వేదాన్తకి చాలా అసహనంగా వుంది తాను అసలే ఫిజిక్స్ లో కొంచెం వీక్  రివైజ్ చేసుకోవాల్సినదెంతో వుంది దాదాపు మూడు గంటలకి పైగా దేశ్ కా నేతా ని కలవడానికి టైం వేస్ట్ అవుతూన్నందుకు  చిరాగ్గా వుంది సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ హాల్ ఏమంత హాయిగా లేదు బయట సెక్యూరిటీ వాళ్ళు ఫిజిక్స్ పుస్తకం లోపలికి తెచ్చుకోనీయనందుకు కోపంగా కూడా వుంది తన పేరులో సనాతనమ్ ధ్వనించడం వల్ల తండ్రి విశ్వగురు భక్తుడు కావడం వల్ల యీ ప్రోగ్రామ్ కి తనను సెలెక్ట్ చేశారు   చివరికి ఖరీదైన
కథలు

లైక్

నువ్వు నీ ఫాలోవర్స్ కౌంట్ కాదు. నువ్వు వేసుకునే బ్రాండెడ్ బట్టల మురికివి కాదు. నువ్వు బతుకుతున్న ఈ ప్లాస్టిక్ జీవితపు చెత్తబుట్టవి నువ్వు.  తిరుపతి శివార్లలో, ఎప్పుడో మూతపడిన 'లీలా మహల్ పాత టాకీస్' ముందు ఆ పది మంది నిలబడి ఉన్నారు.  వాళ్లందరూ ఈ తరం రచయితలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, పాడ్కాస్టర్లు. ఆన్లైన్ లో ఒక అనామక ప్రకటన చూసి వాళ్ళు అక్కడికి వచ్చారు  "మూడు నెలలు. ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు. ఒక పాడుబడిన థియేటర్లో మిమ్మల్ని లాక్ చేస్తాం. బయటికి వచ్చేసరికి మీ జీవితపు అత్యుత్తమ మాస్టర్ పీస్ రాయాలి. ఆ
కథలు

UNITY IN DIVERSITY🌈

      సాత్వికి "అక్షర"  స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతోంది. ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళిరావడం, సాయంత్రమైతే ట్యూషన్ కి వెళ్ళడం ఇదంతా తన దినచర్యలో భాగం. అలాగే నిన్నటి రోజు కూడా ట్యూషన్ కి వెళ్ళి“మామ్! రేపు సోషల్ ఎగ్జామ్ , క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా...”అని టీచర్ని అడిగింది. టీచర్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసింది.     అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే... India is an example of unity in diversity. చాలా హ్యాపీగా చాలా ఉత్సాహం తోటి ఈ పాపకు రకరకాల ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని
కథలు

పారంపర్యం!

కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిచ్చి ‘యిదేమీ టౌన్ కాదు, సిటీ అంతకన్నా కాదు, పల్లెటూళ్ళో అడ్రస్ పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలి?’ అన్నాడు మా ఫ్రెండు. నాకొస్తున్న కోపానికి చేతిలోని చెంబుతో వాడి తల పగలగొట్టాలని వొక్కక్షణం అనిపించింది. కాని పక్కనే వాడి పేరెంట్స్ వుండిపోయారు. అందుకని నవ్వుతూ చూశాను.             ప్రయాణం బాగా జరిగిందా- నుంచి అన్ని కుశల ప్రశ్నలు వేస్తూ ‘అడ్రస్ డెడ్ యీజీ’ అన్నాడు అంకుల్. ‘మీ అంకుల్ పేరు చెప్పి యెవర్ని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు’ అంది ఆంటీ. ‘నన్ను యెందుకు రెచ్చగొడతార్రా?’ అని ఆవేశాన్ని అణచుకొని కూల్ ఫేస్ పెట్టాను.            
కథలు

అలర్జీ

తూర్పు దిక్కున సూర్యుడు ఇంకా పూర్తిగా బయటకు రాకముందే, తిరుపతి చుట్టూ ఉన్న శేషాచలం కొండలు గాఢ నిద్రలో ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ కొండల భారీ ఆకారాలు ఆకాశం అంచున ఒక ముదురు రంగు సిరా మరకలా విస్తరించి ఉన్నాయి. పట్టణం ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. అప్పుడప్పుడే పాల వ్యానుల శబ్దాలు, పక్షుల కిలకిలలు వినబడుతున్నాయి. ఉదయం 5 గంటలు. అలవాటు ప్రకారం శారద కళ్లు తెరిచింది. ఆమె వయసు 38 ఏళ్లు. చూడటానికి చాలా సాధారణమైన, ప్రశాంతమైన గృహిణి. తిరుపతిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం. బాల్కనీలో నిలబడితే ఎదురుగా భారీగా కనిపించే కొండల వరుస