ప్రతి రోజూ చుట్టి ముట్టే 
ఈ పూల పరిమళమే కదా
నన్ను వెన్నెల్లో తడిపి హృదయాన్ని ముంచేది.

ఈ మల్లెల వెలుగులోనే కదా
నీ నవ్వులు మెరిసిపోతుంది.

ఇన్ని సువాసనల వెనుక
నలిగే జీవితాలు లేవంటావా

ఎండలో పేలే దేహాలు
ఇక్కడ చూడలేమంటున్నావా

నువ్వు చూపే పూల దండ వెనుక
చేతులు నలిగిన కథలను తెలుసుకో
కాసిన్ని కన్నీటి ప్రవాహాలు దాగుంటాయి

పెదవులు పూసే ఉదయం విరాజితమై
ఇలా పువ్వుల్లా పరిమళిస్తుంది.
జీవితం నిగూఢంగా ధారమై ప్రవహిస్తుంది.

మట్టి దేహాలు మొగ్గల్లా ఎదిగి
సువాసనలకి ఆధారమౌతుంటే
గొడుగు కింద పూలమ్మే ముసలమ్మ
ప్రాణవాయువు ఇక్కడే పైకి లేస్తుంది.

ఈ మాల దేవునిదైనా పెళ్ళింటి సందడిదైనా
పుష్ప గుచ్ఛమై ప్రేమను అలంకరించినా
ప్రేమ గుబాళింపు తుళ్ళింతలైనా
చెమట చుక్కల వికాసమే కదా.

ఇన్ని సమయాలు వాకిట్లో తొంగి చూస్తున్నాయి
ఈ పరిమళం వెనుక కథలను
పెర్చుకుంటూ పోతున్నాను

ఆమె ముఖంలో జీవితాన్ని
పువ్వుల పరిమళంలో దాగిన
రహస్యాల్ని అన్వేషిస్తున్నాను.....

- గవిడి శ్రీనివాస్

Leave a Reply