ఆయన తనకిచ్చిన పనిమీద వచ్చినప్పుడు నిష్పక్షపాతంగానే వచ్చాడు
భిన్నమైన ఆహారపు అలవాట్లతో
సరిపడని దేవుళ్లతో ఉన్మాదంలో ఉన్న
రెండు సముదాయాలున్న ఈ దేశాన్ని
ఆయన కళ్ళు
ఎన్నడూ చూడలేదు కానీ విభజించడానికి వచ్చాడు
లండన్ లోనే వాళ్లు ఆయనకు వివరించారు
"సమయం చాలా స్వల్పంగాఉంది
ఇద్దరినీ సర్దుకోండని చెప్పడానికైనా,
సహేతుక చర్చకైనా ఇప్పుడింకా చాలా ఆలస్యమైపోయింది
పరిష్కారం ఇప్పుడు దేశ విభజన లోనే ఉంది
ఆయన లేఖను బట్టి చూస్తే ...
వైస్రాయి సాహచర్యంలో నువ్వు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది
అందుకని నీకు వేరే వసతి కల్పించే ఏర్పాటు చేయమన్నాం
నీకు ఇద్దరు న్యాయమూర్తులనిస్తాం సంప్రదించడానికి,
ఇద్దరు ముస్లింలు ఇద్దరు హిందువులు
కానీ అంతిమ నిర్ణయం మాత్రం నీదే"
దినమూ రాత్రీ పోలీసు పహరా లోని
ఉద్యానవనంలో జనాంతికం నుంచి దూరంగా ఉంచే ఒక ఏకాంత భవనంలో
బందీ అయి ఆయన తన పని మొదలు పెట్టాడు
కోట్లాది మంది అదృష్టాన్ని నిర్ణయించే పని
"తన ముందున్న దేశ పటాలన్నీ కాలం చెల్లినవి
జనాభా లెక్కలు దాదాపు నిశ్చయంగా తప్పుల తడకలు
అవి సవరించే సమయం లేదు పర్యవేక్షించే సమయం లేదు వివాదాస్పద ప్రాంతాలు
వాతావరణం భీతి గొల్పేంత వేడిగా ఉన్నది
విరేచనాలు మొదలై శౌచాలయానికి బయటికి తిరుగుతూ కూర్చోవడానికి కుదురు లేదు
కానీ ఏడు వారాల్లో ఆ పని ఐపోయింది
సరిహద్దులు నిర్ణయమై పోయాయి
ఒక ఉపఖండం...
మంచికో చెడుకో విభజించబడింది
మర్నాడే ఆయన ఇంగ్లండ్ కు ప్రయాణమయ్యాడు
అక్కడయితేనే ఆయన సమస్యను మరచిపోగలడు
ఏ మంచి న్యాయవాది అయినా చేయవలసిందదే
(మరచిపోవడం)
మళ్లీ రావడం ఆయనెప్పుడూ ఇష్టపడడు
ఆ పని చేస్తే, తనను కాల్చి చంపుతారని
ఆయన తన క్లబ్బులో (సభ్యులకు) భయపడుతూ చెప్పాడు
-డబ్ల్యు .హెచ్.ఆడెన్
(స్వేచ్ఛానువాదం అనే స్వేచ్ఛ కూడా లేదు...అను:)
(రచయిత పెట్టిన పేరు పార్టిషన్ ...partition- దేశ విభజన)
15, ఆగస్టు
Related