నేను తొలి ఉపాధ్యాయుడు పుస్తకం చదివాను. ఈ పుస్తకం రాసింది చింజిచ్ ఐత్ మతోవ్.
ఈ బుక్ లో నాకు బాధాకరమైన విషయం ఏంటంటే… అందులో అల్తినాయ్ తను ఉపాధ్యాయుడు ద్యుయ్ షేన్ కోసమని మూడు రోజుల సమయం వరకు ఎదురు చూసింది. మూడవ రోజున తను ఉపాధ్యాయుడు అల్తీనాయ్ ఉన్న ఇంటికి వెళ్లి, ఆమె కూర్చున్న దగ్గరకు వెళ్లి పలకరిస్తే, అల్తినాయి మాట్లాడకుండా అలిగి కూర్చుంది. తన ఉపాధ్యాయుడైన ద్యుయ్ షేన్ ను కౌగలించుకుని ఎంతగానో ఏడుస్తుంది. తనలో ఉన్న ఏడుపు మొత్తం బయటపెట్టింది. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది.
ఆల్తినాయ్ ని వాళ్ల కక్కి చీటికి మాటికి తిట్టడం కూడా నాకు చాలా బాధాకరమైన విషయం. ఆ బాధ చెప్పుకోవడానికి కూడా రావడం లేదు . నేడు ఆల్తినాయి స్థానంలో ఉండి, ద్యుయ్ షేన్ స్థానంలో ఉపాధ్యాయుడైనా మా సూర్యచంద్ర సార్ ను ఊహించుకుని చదివాను. అపుడు నా దుఃఖం ఎక్కువైంది. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ద్యుయ్ షేన్ రెండు పోప్లార్ మొక్కలను తీసుకుని, అల్తినాయ్ పిల్లలతో ఇంటికి వెళ్తుండగా, తల్లి అల్తీనాయ్ , ఇటురామ్మా నేను మన పాఠశాల ముందు ఈ రెండు ఈ మొక్కలను నీ చేతులతో, నా చేతులతో నాటుదాం అని ఆ టీచర్ ద్యుయ్ షేన్ ఆల్థీనాయయ్ ని అని, చిట్టి తల్లి, బంగారు తల్లి అని ముద్దు ముద్దు మాటలతో తనను పిలిచి మొక్కలు వేశారు. అది నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. ఇప్పటివరకు నాలో ఐదవ తరగతిలోని నా టీచర్ శ్రీకాంత్ రెడ్డి సార్ నాకు పుస్తకం చదివినప్పుడు గుర్తించారు . ఇప్పుడు అలాంటి ఉపాధ్యాయుడు మా తెలుగు ఉపాధ్యాయుడు సూర్యచంద్ర సార్ వంటి ఉపాధ్యాయుడు ఉండడం ప్రతి పాఠశాల మరియు ప్రతి ఒక్క విద్యార్థి అదృష్టం. తొలి ఉపాధ్యాయుడు పుస్తకం చదివిన తర్వాత నాకు మళ్ళీ ఏమనిపించిందంటే ఆల్తి నాయ్ స్థానంలో నేను ఉంటే ఎంత నరకం అనుభవించి ఉండేదానో అని. నాకు ఒక విషయం అర్థమైంది. ఆల్తినాయ్ తన అమ్మ నాన్నలను తనకు 14 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయింది కదా….
వాళ్ళ ఇద్దరి ప్రేమ అనురాగం కలిపి ఒక ఆత్మలా ద్యుయ్ షేన్ లోపలికి ప్రవేశించి వారి ఇద్దరి మధ్య తండ్రి కూతుర్ల సంబంధం కల్పించిందేమో అని నాకు అనిపించింది. అయినా కూడా నాకు ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత,ఇంకా ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదవాలనే ఆలోచన కలిగింది. తొలి ఉపాధ్యాయుడు పుస్తకం నేను చదివిన మొట్టమొదటి పుస్తకం. దీని ద్వారా ఒక ఉపాధ్యాయుడు మరియు విద్యార్థిని వీళ్ళ ఇద్దరి మధ్య తండ్రి కూతుర్ల అనుబంధం ఉంటుందని. ఆనాటి కాలంలో బడులు లేకపోతే ఎన్ని పోరాటాలైనా చేసి పాఠశాలలు ఎందుకు పెట్టించారో నాకు అర్థమైంది. ఉపాధ్యాయుడిపై ప్రేమానురాగాలు పెంచుకుంటే ఎలా ఉంటుందో అదే మా సార్‌తో నేను పంచుకుంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఆల్తి నాయ్ కు జరిగిన సంఘటన నాకు మా తెలుగు ఉపాధ్యాయుడు సూర్యచంద్ర సార్ కు జరిగినట్టు ఊహించుకొని బోరున ఏడ్చాను నేను.
ఈ లోకంలో విద్యార్థులను ఇలా కంటికి రెప్పలాగా కాపాడుకునే ఉపాధ్యాయులు కూడా ఉంటారా అని తొలి ఉపాధ్యాయుడు పుస్తకం చదివాక నాకు అర్థమైంది.
ఆ పుస్తకంలో ఒక సంఘటన ఉంటుంది. ఆల్తి నాయ్ బడికి వెళ్తున్నప్పుడు ఓసారి ఏటి మధ్యలోకి వచ్చేసరికి తన పిక్క నరాలు కొంకర్లు పోయి,ఇక ఆ బాధ తను భరించలేక తనకు తానే కండ్లు తిరిగి కింద పడిపోతుంది. నీళ్లల్లో మునిగిపోతుంది. ఆమెకు కేక వేద్దామన్న మాటలు రావడం ఉండదు. అటు నుంచి వెళ్తున్న ద్యుయ్ షేన్ కు ఆల్తి నాయ్ మునిగిపోతుండడం కనిపించేసరికి అక్కడికి పరుగున వెళ్లి, ఆల్తి నాయ్ ని చేతుల్లోకి తీసుకొని, ఒడ్డుకు తీసుకువెళ్లి తను వేసుకున్న వెచ్చని కోటును ఆల్తి నాయ్ కి తొడిగి పడుకోబెట్టాడు. తిమ్మిర్లు ఎక్కిన ఆల్తి నాయ్ పాదాలను తన చేతులతో రుద్దసాగాడు. ఆమె చేతుల్ని పట్టుకొని వెచ్చని శ్వాసని ఊదాడు. ఇలా తన విద్యార్థి కోసం ఇంతలా సాహసం చేసే ఉపాధ్యాయుడు కూడా ఈ లోకంలో ఉంటాడా అని నాకు ఆశ్చర్యం అనిపించింది.
ఇలా పిల్లలను చదివించడానికి సిద్ధమైన లెనిన్ అప్పట్లో ఎంతటి సాహసం చేసి ఉంటాడో అని నాకు అనిపించింది. అసలు ఇప్పటివరకు కూడా పాఠశాలలు లేకపోతే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే సహించబుద్ధి కాదు.
తొలి ఉపాధ్యాయుడు పుస్తకంలో ద్యుయ్ షేన్ ఎన్నో సాహసాలు చదువు కోసం చేశాడు. ఊరి వాళ్ళు అతన్ని అవమానించారు. రకరకాల మాటలు అన్నారు. అయినా కూడా పట్టించుకోకుండా పిల్లలను చదివించి పెద్ద స్థాయిలో చూడాలన్న ద్యుయ్ షేన్ కలను ఆల్తి నాయ్ నెరవేర్చింది. ఆమె పెద్ద స్థాయికి ఎదిగి మళ్ళీ తన ఊరికి తిరిగి వచ్చి,చిన్నప్పుడు తనూ మరియు ద్యుయ్ షేన్ నాటిన పాప్లర్ మొక్కలను చూసింది. ఆల్తి నాయ్ ఈ స్థితికి చేరుకోవడానికి కారణం ఆమె ఉపాధ్యాయుడు ద్యుయ్ షేన్. నాకు ఒక మాట అనిపిస్తోంది. ఎంత ధనవంతులైనా, ఎంత పేదవారైనా తలదాచుకోవడానికి ఇల్లు లేకపోయినా, మేము బాగా చదువుతాం అని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉంటే వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోగలరు మన ఆల్తి నాయ్ లాగా.




