కవులు, రచయితలు లేని నేల ఎవరైనా చూడగలరా?
ఆలోచనలు అంకురించని ఖాళీ జాగా ఎక్కడైనా ఉందా?
మనుషులు కలుసుకోని సమాజాలున్నాయా?
అభయహస్తాన్నందించే పాలకుల భయాలేమిటి మరి?

ప్రతి విప్లవ కవీ ప్రజలకు ఆప్తుడే
వాళ్ళ ప్రతి అక్షరమూ ప్రజల గుండె చప్పుడే!
సమాజ దిక్సూచిగా కొన్ని కలాలు కవాతు చేస్తూనే ఉంటాయ్
ప్రశ్నల వర్షాలై ప్రజల మెదళ్ళు పరవళ్ళు తొక్కుతూనే ఉంటాయ్...

Leave a Reply