ఈ నెత్తుటేరులు
పారుడెప్పుడు ఆగునో..
మా ఆదివాసుల
బతుకులెప్పుడు మారునో..
ఆకులలములు ఏరుకుంటా
వనముకండగ ఉండి సాదినం..
నోరులేని మూగ జీవుల
దోస్తీగట్టి కలిసి బతికినం
"ఈ"
యాడజూడూ మిలటరోల్లే
ఈ క్యాంపు లెవరూ అడిగిరో..
ఎవని కండగ మందగొచ్చిరొ
ఎంటవెట్టీ మము తరుమవట్టిరి..
"ఈ"
నెత్తురొలకని ఘడియలేదు
గొంతు పెగలని క్షణము లేదు..
వొందలేండ్ల సంది జూడ
బతుకలన్నీ సలుపు గాయమే..
"ఈ"
కొండకోనలు గొల్లుమన్నా
తవ్విపోతలు ఆపనేఆపమన్నరు..
కని పెంచిన నేలకోసం
ప్రాణమిచ్చే రణంగడ్తిమి తల్లులం..
"ఈ"
మల్టినేషను కార్పొరేటుల
ఊడిగంల ఏలెటోని కళ్ళుగమ్మె..
దేశభక్తని మూలవాసుల
తరమ వట్టెను పాడు రాజ్యం..
"ఈ"
సిగ్గు శరములిడిసిపెట్టి
శత్రులోలె మట్టు వెడతనె..
మానాల్దీసీ గోసలు బెట్టి
గుండ్లుదించి సంపవట్టె వీనిఫౌజు..
"ఈ"
వికాస కూతలు ఎన్నోకూస్తూ
ఎవనెవనికో అమ్మజూస్తే జాగీరోలే..
చెట్టు పుట్టా ఆకు అలమూ
నీరునేలా మావని ఎగసిందిక మన్యం..
"ఈ"
ఎదురు దబ్బలే ఎక్కుపెట్టినం
ఎదురొస్తే తొక్కుతమన్నం సవరలం..
సేతులు గలిపీ పిడికిలి ఎత్తీ
కగార్లంతపు దండైలేసెను జంగల్లిదిగో..
సూడండిక నెత్తుటేరులు
ఎట్లా ఆగవో..
సూస్తామిక గోండుగిరిజన
బతుకులెట్లా మారవో...
దేఖేంగే.. అబ్ దేఖేంగే ..
ఖూన్ కె నదియాc కైసే బహతే...??
ప్రహారోం కే జుల్మ్ కె తాబే..!!
చింగారోం కీ తాఖత్ క్యా హై...!!!
Related