బహుశా
సృష్టిలో
విత్తనమే
మొదటి విప్లవానికి
నాంది పలికి ఉంటుంది
భూమిని చీల్చుకు
విత్తనంగా మొలకెత్తడానికి
భూమ్మీద పడడానికి
శిశువు సైతం
గర్భకుహరంలో
పెద్దయుద్ధమే చేసి ఉంటది
ప్రతిసారీ మట్టి నుండి
తల్లి నుండి ఆందోళనకారులకు
ప్రేమ దొరికే ఉంటుంది
ఎందుకంటే
ఆందోళన చేయకపోతే
నూతన సృష్టి సాధ్యం కాదని
మట్టికీ మాతృమూర్తికీ తెలిసే ఉంటుంది
****
అశోక్ కుమార్ (హిందీ కవి)
అనువాదం: ఉదయమిత్ర




