ఖండన

విద్యార్థులపై కాల్పులు జరపాల్సిందే.. మహిళలు అత్యాచారాల్నిఇష్టపడతారు.. అని మాట్లాడిన టి.జి. మోహన్‌దాస్‌పైచర్య తీసుకోవాలి

శ్రీ మోహన్‌ భగవత్‌ గారికి, శ్రీ దత్తాత్రేయ హోసబలే గారికి, ఈ ఆగస్టు 9న, ఎన్‌ఏపీఎంకు చెందినఆల్‌ ఇండియా ఫెమినిస్ట్‌ అలయన్స్‌ (ఏఎల్ఐఎఫ్ఏ)సభ్యులమైన మేము చారిత్రాత్మకక్విట్‌ ఇండియా ఉద్యమాన్నిస్మరించుకుంటున్నాము. లక్షలాది సామాన్య భారతీయులు నియంతృత్వ పాలనను సమష్టిగా తిరస్కరించి, తమభిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కునుచాటిచెప్పిన చారిత్రాత్మక సందర్భమది.ఇదే రోజున మేము ఈ లేఖను రాస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం వలస పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు; తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే పౌరులను—అందులో యువతను కూడా—నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించేద్వేషపూరిత, హింసాత్మక భాష నుంచి కూడా విముక్తిఉండాలి. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఉద్యమాల్లో భాగస్వాములైన మహిళలు, ట్రాన్స్‌జెండర్‌
సమీక్షలు

అల్లిక వారసత్వంలోంచి అస్తిత్వ కథలు

పలమనేరు బాలాజి కవిత్వం చదివిన వాళ్ళకు తప్పకుండా ఒక ప్రశ్న వెంటాడుతు  ఉంటుంది. ఇంత దయతో, ఇంత ప్రేమగా,  ఇంత కరుణతో ఈ కవి  ఎట్లా మాట్లాడుతున్నాడని? కలిసిన ప్రతి సందర్భాన్ని వెచ్చని 'టీ' మయం, పోయెట్రీమయం ఎలా చేయగలుగుతున్నాడని? ఎన్నో సార్లు తన జీవన మూలాల గురించి అడగాలనుకొని ఆగిపోయాను.  ఇప్పుడీ 'ఏకలవ్య కాలనీ' ఎరుకల జీవన గాథలు చదువుతుంటే పలనునేరు బాలాజి మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి. కేవలం తన గురించో, తన కుటుంబ నేపధ్యం గురించో కాదు ఎరుకల జాతి కన్నీటి కథలను వినిపించిన ఎరుకల అస్తిత్వ కథలివి. అస్తిత్వ ఉద్యమాల చైతన్యంతో ఇప్పటి వరకు
వ్యాసాలు

పుస్తకం నేను మనిషిగాఎలా జీవించాలో నేర్పింది – మారుతి పౌరోహితం

మారుతి పౌరోహితం స్వస్థలం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే గువ్వలదొడ్డి అనే చిన్నగ్రామం. పౌరోహిత్యం, వ్యవసాయం చేసుకునే కుటుంబం నుండి వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణా కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా  పనిచేస్తున్నారు.  “పునరపి ” తొలి  కథ(2016).  “ఊరిమర్లు” “ఇల్లిడిసిన తొమ్మిది కథలు” కథా సంపుటాలు, “ప్రణయ హంపీ” చారిత్రక కాల్పనిక నవల ప్రచురించారు. మారుతి పౌరోహితం రాయలసీమ మట్టివాసనను, అక్కడి మనుషుల జీవితాలను, వారి భాషను, వారి బాధలను, బతుకు పోరాటాలను తన రచనల్లో ఆవిష్కరించే కథారచయిత, నవలాకారుడు. పుస్తక పఠనాన్ని తన సాహిత్య ప్రయాణానికి పునాదిగా చేసుకున్న ఆయన,
రిపోర్ట్

భారతదేశంలో 12.5 కోట్ల షెడ్యూల్డ్ తెగల గుర్తింపు;ఆదివాసీ హోదా నిరాకరణ

దేశంలో 12.5 కోట్ల మందికి పైగా పౌరులను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించినప్పటికీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆదివాసులను స్వదేశీ ప్రజలుగా అధికారికంగా గుర్తించడానికి భారతదేశం నిరాకరించడంపైన దృష్టి సారించాలని ఆదివాసీ, స్వదేశీ సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ఐక్యరాజ్యసమితిని కోరాయి. ఆదివాసి మహాసభ ఫౌండేషన్, ఇండియా ఇండిజినస్ పీపుల్స్, ఆదివాసి సమన్వయ మంచ్, ఇండిజినే గ్లోబల్ కాన్ఫెడరేషన్, ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండిజినస్ అండ్ ట్రైబల్ పీపుల్స్ (నార్త్ ఈస్ట్ జోన్), బోడో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ సంస్థలు ఐక్యరాజ్యసమితి ఆదివాసీ ప్రజల హక్కుల నిపుణుల యంత్రాంగంనిర్వహించిన 19వ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాయి.
వ్యాసాలు

బస్తర్‌లో భారత ప్రభుత్వ ఉక్కుపాదం

600కి పైగా హత్యలు, అరెస్టులు:  గనుల తవ్వకం బస్తర్‌లో భారత ప్రభుత్వ ఉక్కుపాదం అడవి మౌనంగా ఉంది కానీ ఆ మౌనంలో నరికివేతకు గురైన వేలాది చెట్ల  హాహాకారాల సమాధి   – లాపతా జంగిల్, సుధీర్ ధవాలే 'ఆపరేషన్ కగార్' పైన తమ తాజా నివేదికను  2026 జూన్ 11నాడు, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ విడుదల చేసింది. 2024 జనవరి నుండి  2026 మార్చి మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన భద్రతా చర్యల సమాహారమే ఈ ఆపరేషన్ కగార్. ఈ పదానికి అర్థం ఏదైనా ఒక  అంచుకు కుదించడం. ప్రధానంగా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో 'నక్సలిజం' లేదా
వ్యాసాలు

పాలిటెక్నిక్(సాంకేతిక) విద్యను పేద విద్యార్థులకు దూరం చేయొద్దు.

తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చాలని తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను  అభివృద్ధి చేయడం కోసమే స్కిల్ యూనివర్సిటీ లో విలీనం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికి ఈ విలీనం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని అర్ధమవుతుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు కు ముందే బ్రిటిష్ పాలనలో హైదరాబాద్  రాష్ట్రం స్వతంత్ర సంస్థానంగా ఉన్నప్పుడే 1923 వ సంవత్సరం తర్వాత ఉస్మానియా సెంట్రల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గా ఉండేది
వ్యాసాలు

ప్రతిఘటనా రూప౦గా కళ:

పాలస్తీనా చిత్రకారుడు స్లిమాన్ మన్సూర్ స్లిమాన్ మన్సూర్ (1947-2026) ఆధునిక పాలస్తీనా కళలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఆయన కళా రూపాలు  పాలస్తీనా అస్తిత్వానికి, ప్రతిఘటనకు బలమైన చిహ్నాలు.  79 ఏళ్ల వయస్సులో ఆయన ఆక్రమిత తూర్పు జెరూసలేంలో, 2026 ఆగస్టు 24న, అల్ మకాస్సెడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్సూర్ 1947 లో జన్మించారు.  తన బాల్యాన్ని తాను పుట్టిన బీర్‌జైట్ పచ్చని కొండలు, పొలాల మధ్య గడిపారు. ఆ తర్వాత తన యవ్వన౦లొ  బెత్లహేమ్, జెరూసలేంలో గడిపారు. ఈ అనుభవాలు ఆయన చిత్రాలపై గొప్ప ముద్ర వేశాయి. ముఖ్యంగా 1967
వ్యాసాలు

డీఎస్సీ – 2025 ఎంపిక విధానంలో ఆది నుంచి వివాదాలే

 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలోని  స్కూల్ అసిస్టెంట్ లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రత్యేక విద్యా అవసరాల అసిస్టెంట్ల ఖాళీలు 16347 పోస్టులు భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులను ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్,  మున్సిపల్, గిరిజన, దివ్యాంగుల సంక్షేమ పాఠశాలల్లో నింపడాని కోసం ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం మొత్తం 5.77 లక్షల మంది దరఖాస్తు చేయగా 3.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. సెప్టెంబరు 2025 లో 15,941
వ్యాసాలు

నేపాల్ విపత్తుకు కారణమేంటి?

నేపాల్ లో, చైనాలోని స్వయంప్రతిపత్త ప్రాంతమైన టిబెట్‌లో భారీగా నీటి ప్రవాహం పట్టణాలపై విరుచుకుపడటంతో వందలాది మంది మరణించగా, కనీసం 1,400 మంది గల్లంతయ్యారు. తన మార్గంలోని భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను వరద ధ్వంసం చేస్తూపోయింది. ఈ విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడానికి కొన్ని వారాలు లేదా నెలలు కూడా పట్టే అవకాశం ఉంది. అయితే, ఇంతటి విపత్తుకు అసలు కారణం ఏమిటి? దీనిపై ముందస్తు హెచ్చరిక ఎందుకు అందలేదు? ఈ ప్రశ్నలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. నేపాల్ అధికారుల ప్రకారం, ఈ వరదలకు కారణం హిమానీనదం (గ్లేసియర్) కూలిపోవడం కావచ్చు. 
వ్యాసాలు

తెలంగాణా ముఖ్యమంత్రి విద్యాశాఖ నుంచి ఎందుకు తప్పుకోవాలంటే?

గత నెలక్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... కొంద‌రు తనను విద్యా శాఖ మంత్రిగా రాజీనామా చేయాల‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్రమోష‌న్లు స‌క్రమంగా చేప‌ట్టినందుకా? ఎందుకు రాజీనామా చేయాలో వాళ్లు తెల‌పాల‌ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా తానే కొనసాగుతానని కుండ బద్దలు కొట్టారు. ఆయన చెప్తున్న మాటలకు ఆచరణలో విద్యాశాఖ నిర్వహణను గమనిస్తే పొంతన ఏమాత్రం లేదనేది స్పష్టం అవుతుంది. అంతే కాక ఆయన విద్యాశాఖ నిర్వహణలో విఫలం అయ్యారనేది స్పష్టమవుతుంది. ప్రతి సమావేశంలో విద్య ద్వారా