కవిత్వం

టవర్ ఆఫ్ zealotry

వాహ్ రే విశ్వగురూ!మీ మత మౌడ్యమ్ఐఫిల్ టవర్ ను మించి పోయిందిలిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటెర్నిటీఅనే మూడు విలువల్నిచ్చిన ఫ్రాన్స్ లోఈక్వాలిటీ ని తొక్కేసిన అక్షరధామాలూ!దీనిని లోకార్పణం చేసిన మహామానవా!ఆడ వాసన గిట్టని స్వాములూ!మీ విశ్వగురుత్వానికి ద్వేషమే తెలుసుఐఫిల్ టవర్ మీదినించి చాటుతున్నాపారిస్ అంటే ప్రేమపారిస్ అంటే స్వేచ్ఛపారిస్ అంటే సమానత్వంఅబుధాబి, పారిస్ లో అక్షరాధామాలుమరి ఢిల్లీ, ఉత్తరాఖండ్ లలోఅల్-ఇస్లాం మసీదులు వద్దావాహ్ రే విశ్వగురూ! (అక్షరధామ్ స్వాముల కోసం ఐఫిల్ టవర్ లోఆడ ఉద్యోగులను వేరే విధులకు మార్చిన సందర్భం)
కథలు

క్రియేటర్స్

మాటా మాటా పెరిగింది. తూటాదాక వచ్చింది. మనిషన్నాక మాట వుండదా? వుంటుంది. కుండకు కుండే రాపిడి. అలాంటిది మాటకు మాట రాపిడి వుండదా? వుంటుంది. అందుకని చిలికి చిలికి గాలివానవ్వదా? అయ్యింది. ఎటొచ్చి ఆర్గ్యుమెంటు అన్నాక పెరుగుతుంది. మరి పెరిగిన ఆర్గ్యుమెంటు యెక్కడ ఆగుతుంది? ఎవరిదో వొకరిది పైచేయి అయితే ఆగుతుంది. పై చేయి అన్నిసార్లూ మాటల రూపంలో వుంటుందా? ఉండక్కర్లేదు, చేతల రూపంలోకి మారొచ్చు. అప్పుడు మాటలు ఆగిపోతాయి. సమానంగా సాగితే ఆగవు. అయితే, మాటలు ఆగాయి. హీరో వేషాలు వేసి వేసి లీనమైపోయి కెమెరా ముందు లేకపోయినా ‘వొకే- రోల్ కెమెరా, యాక్షన్’ అనకపోయినా కాల్చేశాడు
వ్యాసాలు

శక్తివంతమైన పౌర రక్షణ దళం ఎందుకు?

ఆగస్టు 15 ఉపన్యాసంలో మోదీ దేశ ప్రజలనుద్దేశించి తమ ప్రభుత్వం, సాయుధ నక్సల్స్/మావోయిస్టుల ప్రమాదాన్ని నిర్మూలించాం కానీ దిమాగీ నక్సల్స్ (మేధావి నక్సల్స్)మిగిలే ఉన్నారని, భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతి కృషి నుండి దేశ యువతను పక్కదారి మళ్ళించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అసమ్మతి గళాలపై, సమూహాలపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమైన వారు ఏళ్ళుగా దేశంలోని గత ప్రభుత్వ యంత్రాంగంలో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా పనిచేశారు. ఈ సంక్షోభం నుంచి దేశానికి విముక్తి కల్పించాం. అడవుల్లో ఉన్న సాయుధ నక్సలైట్లను తుదముట్టించడంలో విజయం సాధించాం. అయితే మేధో
పరిచయం

జీవించి ఉండగానే తన శ్రద్ధాంజలి రాసుకున్న విదర్భ రైతు

'గ్రామీణ ప్రాంతంలో ఘోరమైన ఏదో తప్పు జరుగుతోంది.' -ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్, 2005 యాభై ఏళ్ల రైతు శ్రీకృష్ణ కలంబ్ 2008 మార్చి 24న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  రెండు రోజుల ముందు, తన మరణానంతర నివాళిని తానే రాసుకున్నాడు. కేవలం ఆరు లైన్ల ఆ నివాళిని తన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బ్రిటిషర్లు బరార్‌[i] గా పిలిచే పశ్చిమ విదర్భ ప్రాంతంలో మాట్లాడే మరాఠీ మాండలికం అయిన స్వచ్ఛమైన వర్హాడీలో, అది ఇలా  మొదలవుతుంది: మీ ఆగలా వెగలా, మాహి న్యారిచ్ జిందగాని; మహ్యే మరణ భీ ఆహే, జసే అవకలి పాని. నేనో ప్రత్యేకమైన
సంపాదకీయం

‘రాజద్రోహ’ గేయానికి రాజ్యాంగబద్ధతా?

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు గంగూలీ, వందేమాతర గేయం ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా మీడియా డెస్కులు వేరయ్యేవి. బెంగాలీల అక్షరమాలలో 'వ' లేదు కాబట్టి సౌరభ్ గంగూలీ అని రాయాలని ఇన్చార్జి అంటే, అలాగయితే... మనం బందేమాతరం అనాల్సిందేనని వాదించేవాళ్ళం. యుపీ, బిహార్ వాసులతో బందేమాతరం అనిపించాలని సరదాగా అనేవాళ్లం.వందేమాతరం పార్లమెంటు చట్టం ద్వారా రాజ్యాంగబద్ధతను పొందిన తర్వాత ఇప్పుడు అలాంటి సరదాలకు సాధారణంగానే తావు లేదు. వందేమాతరమా... బందేమాతరమా? ఆ గేయంలోని రెండు పాదాలు పాడాలా లేక మొత్తం ఆరూ ఆలపించాలా అనే చర్చకూ వీల్లేని వాతావరణంలోకి మనమంతా ప్రవేశించాం. బహుళత్వాన్ని ఏకరూపకత వడివడిగా ఓడిస్తున్న సందర్భం ఇది.సంఘీ సభ్యులు
కవిత్వం

కార్టూన్ కవిత

పాలకుల విధ్వంస నిర్మాణాల మీదిఆగ్రహాన్నంతా హిమాలయ పర్వతాలుహిమానీ నదులు బీభత్సంగాపాలితుల మీద కూడ చూపిన మాట నిజమే కానీప్రకృతి కదా ఎక్కడోపసిపిల్లల పట్ల పాలకులకున్నంతనిర్లక్ష్యం కనిపించలేదు ఒక టీచర్‌ను హెచ్చరించడంలోనే కాదుఆక్రమణ యుద్ధాల లక్ష్యమే పసిపిల్లలైనాద్వేషం కనిపించలేదుఅవును కదా మనం దివిసీమఉప్పెనపుడు చెప్పుకున్నట్లుగాప్రకృతి 'అక్రమంలోనూఒక క్రమముంటుంది' 'అక్రమంలో కూడ క్రమముంటుంది .'-కెవిఆర్.(యు.పి.ఉన్నీకి, కెవిఆర్ కు కృతజ్ఞతలతో
గల్పిక

యక్ష ప్రశ్నలు

నరేంద్ర భూపతికి చాలా అసహనంగా వుంది. అడవిని ఆక్రమించుకోడానికి గొడ్డళ్ళు పట్టుకొని వెళ్ళిన మంత్రివర్గ సహచరులు తిరిగి రాకుండా మాయమైపోతున్నారు. ఏం జరుగుతోందో ఆయనకి యెంత తల బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదు. తన సహోదర తుల్యులు అత్యంత ఆప్తులు అంతరంగ మిత్రులు కిచెన్ క్యాబినెట్ సభ్యులు రాత్రికి రాత్రి అదృశ్యమవడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నాడు. విదేశీ కుట్రలన్నీ తన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి కాబట్టి విదేశీ కుట్రకి ఆస్కారం లేదు. ఆంతరంగిక సమావేశ మందిరానికి రమ్మని రక్షణ సలహాదారుకి కబురంపాడు. విషయం అప్పటికే తెలుసుకున్న అతను తక్షణం ఆయన ముందు చేతులు కట్టుకొని వాలాడు. మిత్రదేశం ఇజ్రాయెల్ నుంచి
విశ్లేషణ

వంశగర్వం వెనుక దాగిన మర్మాన్ని ఆవిష్కరించే ‘రావు బహదూర్’

అనగనగా ఒక రాజు. పేరు రామప్ప రావు బహదూర్. రాజు నివసించే ఒక పెద్ద రాజభవనం. భారీ పాత రాజభవనం/ఎస్టేట్ పేరు “భువనాలయం”. గోడల నిండా పూర్వీకుల చిత్రాలు. ప్రతి చిత్రంలోనూ ఒకే గర్వం.ఒకే చూపు. ఒకే వంశం. ఆ చిత్రాల మధ్యలో ఒక మనిషి- ఒక పిల్లవాడు మాత్రం అతకనట్టు ఏడుపు మొహం వేసుకుని ఉంటాడు. అక్కడ ఇమడలేనట్టు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసినా అతడిని రాజప్రాసాదం వేర్లు లాగి పట్టి తిరిగి గోడలలోని ఫోటో ఫ్రేమ్ లో బిగించేస్తాయి. రామప్ప నివాసం ఉండేది ఒక విశాలమైన పూర్వీకుల భవనం. (sprawling ancestral mansion/estate). భువనాలయంలో ఒక
వ్యాసాలు

ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి రెండవ భాగం

(స‌వ‌ర‌ణ-వివ‌ర‌ణ:  ప్ర‌పంచ చ‌రిత్ర ఎందుకు చ‌ద‌వాలి అనే శీర్షిక‌తో  గ‌త సంచిక‌లో కె.వి.ఆర్. ర‌చ‌న‌గా ఒక ర‌చ‌న‌ను ప్ర‌చురించాం. సృజ‌న‌ 1978 జ‌న‌వ‌రిలో అచ్చ‌యిన ఈ ర‌చ‌న కె.వి.ఆర్ సాహిత్య స‌ర్వ‌స్వంలో పొర‌బాటున  పున‌ర్ముద్ర‌ణ కావ‌డంతో వ‌సంత‌మేఘంలోకి కూడా అట్లాగే వ‌చ్చింది. ఆ త‌ర్వాత తిరిగి చూసుకుంటే ఇది నిజం కాద‌ని తేలింది. ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి? అనే ఈ శీర్షిక‌తో సృజ‌న‌లో అచ్చ‌యిన‌ది అనువాద వ్యాసం. దీని మూలం   చైనా ప‌త్రిక ‘పెకింగ్ రివ్యూ’ లో అచ్చ‌యింది. ఈ పెద్ద వ్యాసం అనువాదాన్ని సృజ‌న 1978 జ‌న‌వ‌రి నుంచి నాలుగు సంచిక‌ల్లో సీరియ‌ల్‌గా ప్ర‌చురించింది. అమ‌రుడు
పత్రికలు

ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ సాలిడారిటీ విత్ పోలిటికల్ ప్రిసనర్స్

అంతిమ ప్రకటన ప్యారిస్, డిసెంబర్ 20-21, 2025 2025 డిసెంబర్ 20–21 తేదీలలో పారిస్‌లో జరిగిన "రాజకీయ ఖైదీలకు మద్దతుగా అంతర్జాతీయ సదస్సు"కు పాలస్తీనా, కుర్దిస్తాన్, టర్కీ, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, ట్యునీషియా, చిలీ, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, కెమరూన్, ఇరాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, పెరూ, గ్రీస్, మెక్సికో దేశాలకు చెందిన విప్లవకర, పోరాట సంస్థలు, వక్తలు హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు తీర్మానంతో—ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని తెలియచేస్తూ, ప్రజలు సాగిస్తున్న పోరాటాలు, ప్రతిఘటనల మార్గాన్ని వెలిగించే ఒక ప్రాథమిక శక్తిగా తీర్చిదిద్దడానికి మా ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. సామ్రాజ్యవాద