కవిత్వం

ఆదిమ పూల వాసన

నేల ఒరిగిన ఓ శిరస్సు దాని పెదవులపై కత్తిరించబడ్డ చిరునవ్వు కనులలో ఒలికి గడ్డకట్టిన రక్త చారిక గాయపడ్డ గొంతులోంచి ఓ పాట ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ నీలోంచి ఉబికి వస్తూంది నువ్విదిల్చినా వదలని ఆ చిరునవ్వు నీలోకి ఇంకుతూ ఇగురుతూ నిన్ను అనామధేయుణ్ణి చేస్తూంది తొలి దారుల ఆదిమ పూల బాలింతరపు వాసనతో చుట్టూ పరివ్యాప్తమవుతూ మరల కార్యోన్ముఖుణ్ణి చేస్తూంది!!
కవిత్వం

ఆమె వెలుగు భూగోళ మయ్యింది 

ఇప్పుడు ఈ నేలా ఆమె కథ వింటోంది తన కాళ్ళూ చేతులూ తన మనసు మాట తన ఆలోచన ఆచరణ తరతరాల సంకెళ్ళ విడిపించుకోడానికి పితృస్వామిక గోడల పగలగొట్టింది తన నవ్వుల్ని తన ఏడ్పుల్ని మనసార కుమ్మరించి బతుకు కుదుట పడే పాటందుకుంది అర్థ రాత్రి స్వాతంత్రపుఅర్థ భాగ చీకట్ల అసాధ్య వెలుగుల కడగాలని స్వేచ్ఛా స్వాతంత్ర్య ప్రకృతి లోకి రెక్కలు తొడుక్కుని జీవితానికి సీతాకోకచిలుక రంగులద్దింది భారత స్త్రీ బానిస రంగు తూడ్చి కడివెండి వారసత్వం అద్ది ముట్టుకోవాల్సిన విప్లవాన్ని పరిచింది తన చూపు నిండా స్త్రీ విముక్త పుప్పొడి వెదజల్లుతూ మనుషుల నిండా నిండింది
కవిత్వం

ఈ చీకటి ముఖమ్మీద

నన్ను కప్పుకోవాలనే చూస్తుంటుంది.ఈ చీకటెపుడూ వొక నిషిద్ధ ముఖచిత్రాన్ని పట్టుకుచీకటి పడగల్తోనానీడై తిరుగుతుంటుంది. అనాది నేలమాళిగలోంచివిస్తరిస్తున్నవొక వెలుగు నువిషాద నవ్వుల మీద పగతోతలుపులు మూయడం కొత్త కాదు వసంతాన్నిఒంటి రంగుపుల్ముకున్నచెమటచుక్కను నేనుఈ కాలాన్నిక్వారంటైన్లో ఉంచు చూద్ధాం?! ఈ చీకటి ముఖమ్మీదైనా సరేజలజలా పారడమే తెల్సు!
కవిత్వం

కవితా పరాగం

కిటికీ కవితలు - 1 ఒట్టి కిటికీ అనే అనుకుంటామా..ఏదో కాసింత గాలీ , వెలుతురు ఇస్తుందని ప్రేమ దానిపై..కానీ ..నాకనిపిస్తుంది..కిటికీకి దేహం ఉంది.హృదయమూ ..కళ్ళూ ఉన్నాయి.అది ఎలా చూస్తుందనుకున్నారు?బయట భళ్ళున తెల్లవారటాన్ని?లోపల ..కలలు కరిగి కన్నీరైన చీకటి రాత్రుళ్ళని?కిటికీకి ఉపిరితిత్తులున్నాయి..గది లోపలి మనుషుల ఆశ నిరాశలను…ఊపిరాడ ని ఉక్కిరిబిక్కిరి తనాలను తను కాదూ శ్వాసించేది..శ్వాసఇచ్చేది? కిటికీ..ఒకసారి అమ్మ అయిపోయి..మరోసారి నాన్నగా మారి పోతుంది.కిటికీ ..తనని పట్టుకుని వేలాడే మనుషుల దుఃఖంతో….దీర్ఘ సంభాషణ చేస్తుంది… వాదోపవాదాలు చేస్తుంది.రెక్కలు చాచి..ఒంటరి మనుషుల్ని కావలించుకుంటుంది.అమ్మ దేహం మీది వంటింటి వేడి సెగలని.. చమట ను చల్లని గాలితో చల్ల బరుస్తుందివిరహాన వేగిపోయే
కవిత్వం

నాలుగు పిట్టలు

వస్తూ వస్తూ నీ ఇంటి బయట ఓ చెట్టు నాటి వచ్చాను నాది కాకపోయినా ఏదో ఒక నీడ నీకుండాలని * పని నీ కోసమే చేస్తున్న వాడిని పనిలోపడి నన్ను మరిచిపోకు అంటావు ** బతుకు తరిమితే వలస వచ్చాను ప్రేమ పిలిస్తే తిరిగి వెళ్ళిపోతాను * చెమట చుక్క నుదుటి నుండి టప్పున జారిపడినప్పుడంతా నీ గుండె ముక్కలైందేమో అని భయపడతాను * ఎలా నిజం అవుతాయి స్వప్నాలు దిండు కింద పడి నలిగిపోతుంటే * పర్లేదు ఖాళిగానే ముగిసిపోని రాత్రుళ్ళు నీ ఇంటిపని తగ్గిపోయే వరకూ * అందం గురించి దిగులుపడకు నీ లావణ్యం
సాహిత్యం కవిత్వం

విత్తనం పుట్టక మానదు

నెత్తు రోడ్డుతున్న నేలపై విత్తనం పుట్టక మానదు. పదునెక్కిన నేలపైన వసంతమై చిగురిస్తుంది  ఒకట రెండ ఎన్నో నింగి నేల నిండ నిండు త్యాగం. పుట్టుక కోసం పురటి నొప్పుల దారి పురుడు పోసుకుంటున్నది కాలం కౌగిలిలో గింజకుంటున్న హృదయాలు చరిత్ర దారిలో చెదరి పోవు ఆకాశం హద్దు లేకుండ తూర్పు కిరణాలు   ప్రసరిస్తయ్ ఎర్రపూలవనంలో పిడికిళ్ళు బిగుసుకుంటయ్ త్యాగాల దారిలో...
కవిత్వం

వర్తమానం

మిత్రోంతేలుతున్న శవాలతోనదులు పునీతంశవాల మతం మాత్రం తెలీదు అచ్చాదన లేని మునకలతోపావనమైన నదులుఈ మునకల మతం తెల్సు భాయియోం నూలుపోగు లేకుండాహరహర అంటుంటేబజార్లు సిగ్గుతో తల దించుకున్నాయ్బహనోం ముఖం తిప్పుకున్నారు అజ్ఞానులు వూరేగుతుంటేరక్షక భటుల కాపలాసరిహద్దులో సైనికుడు విస్తు పోయాడు సస్తున్న మనుషుల లెక్కలు తేలవనిమోగించిన గంటలు గరిటలు పళ్ళాలుగూళ్ళల్లోంచి కిందకు దిగట్లే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసినందుకుగాలిలో పెట్టిన కొవ్వొత్తులుస్మరణ జులుస్ తీస్తున్నాయ్ నిరక్షర కుక్షులుగద్దె పై కూకుంటేజరిగే తంతు కళ్ళ ముందు కదలాడుతుంది ఇంకా యజ్ఞ యాగాదులువైరస్ సంహారి అంటూ భ్రమలుకల్పిస్తున్న నపుంసక రాజ్యం రాజ్యానికి శస్త్ర చికిత్స అత్యవసరంఅవసరమైన ఆయుధాల ఎంపిక దేశవాసులదే
సాహిత్యం కవిత్వం

తండ్రి తొవ్వ‌లో

మున్నా మున్నా మున్నా- నా చిన్నారి పొన్నారి కన్నా నాన్న ప్రేమకు నువ్వు వారధివి నా కలల ప్రపంచం సారధివి పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం నడుమ అడివే తీర్చింద సందేహం ॥ము­న్నా॥ నీ తండ్రి భుజంపైన బందూకురా నిన్నెత్తుకునే జాగ యాడుందిరా నీలాగే సుట్టూత జనసేనరా కొడుకైన జనంలో భాగమేరా పొద్దంత మీ నాన్న సూర్యుడైతే రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥ము­న్నా॥ నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా నిన్ను చుట్టు వ­ట్టిందో పద్మవ్యూహం నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం   ॥ము­న్నా॥ పృథ్వంటు ఒక పేరు
కవిత్వం

ఆమె ధైర్యవచనం

ఆమె నవ్వుచింత చెట్లపై మిణుగురు పువ్వులా విరబూస్తుందిఆమె తనపెన్నుఇన్సాస్ రైఫిల్ ను వారసత్వంగా వదిలి వెళ్ళిందిఆమె ఇన్నేళ్లుగెరిల్లా యోధగాఏమని తలపోసిందిఅమ్మలకు అక్కలకుభూమ్యాకాశాలలోసగం హక్కు కావాలని పోరాడిందిఆమె కడవండి బిడ్డగా మొదలై AOB నుండి బస్తర్ వరకు జీవించిన కాలమంతాఆదివాసీ ఆడబిడ్డల ధైర్యవచనమైందిఆమె రేణుక నుండి చైతూగా మారి దమయంతిగా భానూ దీదీగాఅడవి బిడ్డల కొంగు ముడి అయిందిఆమె తెరచిన కనులు చూసి వాడికొకటే భయం అరణ్యమిప్పుడు మరల మిడ్కోవెలుతురుతో భగ్గుమంటుందని!! కెక్యూబ్01-04-2025
కవిత్వం

మీ యుద్ధం ఎవరి కోసం…?

ఎవరి కోసంమీ త్యాగంఎవరి పైమీ పోరాటం నరహంతకుడు రాజైరాజముద్రీకుడైప్రజా….ప్రాణాన్నిమానాన్నితీస్తుంటే ఎవరి పై మీ పోరాటం ఫాసిజంప్రజలను చీల్చే యుద్ధంగా మారి తడిగుడ్డతోగొంతులు కోస్తుంటే ఎవరి కోసం మీ త్యాగం మాయన్నలారవీర జవానులారఎవరి పై మీ పోరాటం చచ్చినా శవాన్ని లేపిజ్ఞాన మార్గపుదారులేసికటిక చీకట్లనెల్లాకాలరాసినవీరులపైనా ఎవరి కోసంమీ పోరాటంఎవరి కొసంమీ త్యాగం పచ్చినెత్తూరుమరిగినట్టిపడగవిప్పీనిలిచినట్టీఆధునికనీరో చక్రవర్తినైజాం చక్రవర్తుల పైన అన్నలారవీర జవానులారవాని పైన చేయియుద్ధంఅదే ప్రజా యుద్ధం