వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర
విరసం నేత వరవరరావు భీమాకోరేగావ్ కేసులో దాఖలుచేసిన అన్ని పిటిషన్లను బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది. కంటి శస్ర్తచికిత్స పూర్తిచేసుకుని మూడు నెలల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన దరమిలా శాశ్వత బెయిలు కోసం పెట్టిన దరఖాస్తును తిరస్కరించింది. కండీషన్ తొలగించి ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వీలు కల్పించేందుకూ నిరాకరించింది. ఇక మిగిలింది తాత్కాలిక మెడికల్ బెయిల్. ఈ బెయిల్‌ను కూడా తీసివేసినట్టే! మూడునెలల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గడువు తీరగానే సమీక్షిస్తామని తన తీర్పులో కోర్టు చెప్పకపోవడమే దీనికి కారణం. కాటరాక్ట్ చికిత్స చేయించుకుని










