నాణేనికి ఒకవైపు
వాకపల్లి ఘటనకు పదిహేనేళ్లు నిండింది. న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు సుదీర్ఘకాలం వేచి ఉండిన తర్వాత న్యాయం తమకు అందదని ఈ దేశ న్యాయస్థానాలు కేవలం ఎంక్వయిరీ ఆధారిత తీర్పులు ఇస్తాయని వాకపల్లి బాధితులకు అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. ఇక్కడ న్యాయ స్థానం,పోలీసులు ఒక సాకు మాత్రమే. 2007 ఆగస్టు 20న తెల్లవారుజామున నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కూంబింగ్ కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులకు కనిపించిన గ్రామం వాకపల్లి. విశాఖ మన్యం ప్రాంతంలో తమదైన జీవితం గడుపుతున్న ఆదివాసి స్త్రీలు ఈ పోలీసులకు తమ లోపల వాంఛను తీర్చేవారిగా కనబడ్డారు. పోలీసులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఈ










