వియ్యుక్క వెలుగులో మరికొంత ముందుకు
వియ్యుక్క సంకలనాలను ఆదరిస్తున్న పాఠకులకు విప్లవాభినందనలు తెలియజేస్తూ మరికొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా సంకలనాలలో దొర్లిన కొన్ని పొరపాట్లను, కొత్తగా అందిన సమాచారం వల్ల గుర్తించిన వాటిని పాఠకుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధక విద్యార్థులు, ఒక విద్యార్థిని తమ థీసిస్ విషయవస్తువుకు ప్రధాన వనరుగా వియ్యుక్క సంకలనాలను స్వీకరించామని మరింత సమాచారం కోసం సంపాదకురాలిని సంప్రదించారు. నేటి తరం యువతను వియ్యుక్క సంకలనాలు ఆకర్షించటం, వారి బాధ్యతగా వారు విప్లవ సాహిత్యంలో మరింత సూక్ష్మ పరిశోధనలు చేపట్టటం చాలా సంతోషించవలిసిన విషయం. వారికి, వారిని ప్రోత్సహిస్తున్న ఆచార్యులకు విప్లవాభివందనాలు. ఇటువంటి పరిశోధనలను









