సమీక్షలు

అనంత జీవనకథా ముకురం

ఒక రచనను దేశకాల నేపథ్యంలో వివేచించడం ఒక పద్ధతి. అలా వివేచించడం వల్ల ఆ రచన ఆదేశ స్థితిగతులను వివరించడంతో పాటు ఆ రచన ఆకాలాన్ని విశ్లేషిస్తున్న తీరులో వైరుధ్యాల్ని గమనించి ఆ వైరుధ్యాల స్వభావాన్ని విశ్లేషించిన తీరునూ గమనించవచ్చు. ఆ వైరుధ్యాలలో ఆ రచన ఎటువైపు నిలబడిందో రచయిత అవగాహనకుండిన శాస్త్రీయత ఏ పాటిదో అంచనా వేయవచ్చు. ఇటీవల మల్లెల నరసింహమూర్తి 'మాకూ ఒక నది కావాలి” కవిత్వాన్ని పై వివరించిన నేపథ్యంలో వివేచించడం ఈ వ్యాస పరిమితి. ఈ కవితలు రాసిన తేదీలను రచయిత ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ౨౦౦౪ లో ఈ కవి రాసిన
వ్యాసాలు సమీక్షలు

జీవితం మలచిన కవి

'పూలపరిమళం'లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన
సమీక్షలు

ట్రాన్స్ జెండర్ జీవితానికి మరో పార్శ్వం

ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ సమస్యలు తెలుగు సాహిత్యంలో రావడం చూస్తున్నాం. ఇది ఆహ్వానించాలిసిన పరిణామం. కొన్ని కథలూ, కొన్ని కవితలూ, ఒక దీర్ఘ కవిత, స్వామి రాసిన "అర్ధనారి", వరలక్ష్మి తెలుగు లోకి అనువదించిన లైంగిక వైవిధ్యాలు, ఇప్పుడు సోలోమన్ విజయ కుమార్ రాసిన చిన్న నవల "సన్ ఆఫ్ జోజప్ప" ఈ కోవకి చెందినవి. భారత సమాజం ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని ఇంకా అంగీకరించలేక ఉంది. వారు కూడా మనుషులే అని గౌరవించలేక ఉంది. సమాజం సంగతి సరే, ఒక ట్రాన్స్ జెండర్స్ తన సొంత కుటుంబం నుంచి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. నిరాదరణ ఒక్కటే
సాహిత్యం సమీక్షలు

మంజీర.. స‌జీవధార

చెరబండరాజు సాహిత్య సర్వస్వం, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ విశ్లేషణ ‘కల్లోల కవితా శిల్పం’ పనిలో ఉన్నప్పుడు వీరిద్దరికి కొనసాగింపుగా కౌముది, సముద్రుడు, మంజీర, ఎమ్మెస్సార్‌ గుర్తుకు వచ్చారు. విప్లవ కవిత్వంలోకి చెర, అలిశెట్టి ప్రభాకర్‌ తీసుకొచ్చిన విప్లవ వస్తు శిల్పాలు ఆ తర్వాతి కాలంలో మరింత గాఢంగా, ఆర్దృంగా, సౌందర్యభరితంగా విస్తరించాయి. 1990ల విప్లవ కవిత్వం మొత్తంగా తెలుగు కవితా చరిత్రనే సాంద్రభరితం చేసింది. ఇందులో అనేక మంది విప్లవ కవులు ఉన్నారు. వాళ్లలో కూడా ప్రత్యక్ష విప్లవాచరణను, కవితా రచనను ఎన్నుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణ నేపథ్యం, విభిన్న రంగాల్లో పోరాట అనుభవం,
సాహిత్యం సమీక్షలు

విప్లవోద్యమాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 - 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా
సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో
సాహిత్యం సమీక్షలు

జీవన లాలస – పాఠకుడి నోట్సు

1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే
సాహిత్యం సమీక్షలు

త‌ల్లుల బిడ్డ‌ల వీర‌గాథ‌

ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన
సమీక్షలు

వేమన, వీరబ్రహ్మం దృక్పథం

వేమన, వీరబ్రహ్మాల్ని తెలుగు పాఠక లోకం ముందు మరోసారి చర్చకు పెట్టినందుకు ముందుగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వారిని అభినందించాలి. వీరిద్దరూ సామాజిక సంస్కర్తలు, తరువాతే కవులు.  ఈ పుస్తకం పేరు ‘‘తెలుగు సాహిత్యంలో వేమన వీరబ్రహ్మం - ఒక సంభాషణ’’. రచయిత జి.కల్యాణరావు.  మూడు వందల సంవత్సరాల క్రితం కవులు వేమన, వీరబ్రహ్మ  సంఘ సంస్కర్తలు. సాంస్కృతిక విప్లవం మార్పును కోరుతుంది. సంస్మరణ మార్పును కాక మరమ్మత్తులు కోరుతుంది. సంస్కరణ మార్పుకు వ్యతిరేకం కాదు. ముందుస్తు రూపం. పైగా ఈ కవులు కలం పట్టేనాటికి మార్పుకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతం ఇంకా రూపొందలేదు కదా! ఈ నేపథ్యంలో
సమీక్షలు

భావుకత, అన్వేషణ కలగలసిన కవిత్వం

ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి. శూన్యం కవితలో.. ‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’ అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’  కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ  వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు.