కొత్త పుస్తకం సమీక్షలు

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది
సమీక్షలు

జోజో – జాక్ వెల్లడిస్తున్న ప్రపంచ స్త్రీ-పురుష సంబంధాలు!

నెదర్లాండ్స్ దేశం నుంచి డచ్ భాషలో 2012 సంవత్సరంలో వచ్చిన అద్భుతమైన చిత్రం “కౌబాయ్”( Kauwboy) ఈ చిత్ర దర్శకుడ: “హెల్మర్ బౌడేవిజ్న్ కూలే” ( Helmer Boudewijn Koole). దీని నిడివి 90 నిమిషాలు. జోజో అనే  10 సంవత్సరాల బాలుడికీ - మన కాకి పిల్ల లాంటి చిన్నపక్షికీ మధ్య ఏర్పడిన స్నేహమే ఈ సినిమా ఇతివృత్తం. Kauwboy అంటే డచ్ భాష లో “బుజ్జి పక్షి” అని అర్ధం.  హాలండ్ శివారు ప్రాంతంలోని  ఒక ఆకుపచ్చని అందమైన గ్రామంలో  పదేళ్ళ జోజో తన తండ్రితో నివసిస్తుంటాడు. ఒత్తైన బ్రౌన్ కలర్ జుట్టుతో, ఆరోగ్యంగా, అప్పుడప్పుడే
సమీక్షలు

నెత్తుటి తడి ఆరని బస్తర్‌

దేశం కార్పొరేట్లకు’ అనే 84 పేజీల చిన్న పుస్తకంలోని వ్యాసాల్లో ఆదివాసులు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టులు కనబడతారు. దాన్ని ఓర్వలేని పాలకులు చేసిన దురాగతాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇందులో  నాకు అనిపించిన నాలుగు విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. పుస్తకం చదువుతుంటే పాలకులు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజ ఆరోగ్యానికి అవసరమైన గాలీ, నీరు, ఖనిజాలు, కలపను కాపాడుతూ అవి ఈ దేశ ప్రజలకు దక్కాలన్నందుకే ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వాలకు కంటగింపయ్యారు. ఆ వనరులను కాపాడటానికి పోరాడటం పాలకుల
పరిచయం కొత్త పుస్తకం సమీక్షలు

మహిళలు నిర్మిస్తున్న కొత్త ప్రపంచపు పోరాట  కథలు

46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు
సమీక్షలు

కొత్త ఒరవడి

(ఇది 2015 జనవరిలో విరసం ప్రచురించిన *సామాన్యుల సాహసం * అనే కథా సంకలనానికి రాసిన ముందు మాట.  మైనా , నిత్య, సుజాత రాసిన కథల సంకలనం ఇది. వీళ్ళు భారత  విప్లవోద్యమంలో సీనియర్ నాయకులు.  అజ్ఞాత కథలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలి వరుస రచయిత్రులు.  సామాన్య ప్రజలే  చరిత్రను నిర్మించగల సాహసికులుగా, సృజనశీలురుగా, మహాద్భుత శక్తిగా  వర్గపోరాటం లో  తయారవుతారని విప్లవోద్యమమం నిరూపించింది. ఆ మానవ పరిణామాన్ని ఈ కథలు చిత్రిక పట్టాయి. నలభై ఏళ్ళ అజ్ఞాత రచయిత్రుల కథలు *వియ్యుక్క* గా వెలువడుతున్న ఈ సాహిత్య సాంస్కృతిక వర్గపోరాట చారిత్రిక సందర్భాన్ని అర్థం
పరిచయం కొత్త పుస్తకం సమీక్షలు

విప్లవోద్యమ కథాసమయం

(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం ...వసంత మేఘం టీం ) పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ
సమీక్షలు

మానసిక గాయాల చరిత్ర

స్వయం సిద్ధ ఎవరి జీవన రాగాలాపన? ఏబిందువు నుండి ఏ బిందువు వరకు ప్రయాణం చేశాయి ఈ కథలు. కధావరణలో స్వయం సిద్ధ స్థానం ఏమిటి? ఒంటరి మహిళల జీవన గాథల వెనుక దాగిన సామాజిక నేపథ్యమేమిటి?   మహిళల జీవన పోరాటంలో అలసిన తరువాత మిగిలిన స్వేచ్ఛ మాటే మిటి . స్వయంసిద్ధ  కథలు  భారత సమాజన్ని స్త్రీల కోణం నుండి అంచనా వేసిన కథలు.  భూస్వామ్య సమాజం  దాని కొనసాగింపులో భాగంగా స్త్రీ పై అధికారాన్ని పురుషుడు మరింతగా కొనసాగిస్తున్నపుడు  తమ జీవితానికి తామే నిర్ణయించు కుంటాం అనే కోణం నుండి వచ్చిన కధలు. సామాజిక చలనంలో
సమీక్షలు

మోదుగుపూల కవిత్వపు జడివాన

సంఘర్షణ తీవ్రమైనట్లుగానే ఉద్యమ ఆకాంక్షలు సమాజంలో బలపడతాయి. దీని ప్రతిఫలం సాహిత్యంలోనూ కనిపిస్తుంది ‘‘జీవన పోరాటంలో స్వయం రక్షణ అనే మానవుని సహజ చోదన రెండు బలమైన సృజనాత్మక శక్తుల్ని అతనిలో పెంపొందించింది. అవబోధనాశక్తి, భావనాశక్తి. అవబోధనాశక్తి అంటే ప్రకృతి దృగ్గోచర విషయాల్ని సాంఘిక జీవిత వాస్తవాల్ని పరిశీలించి, పోల్చి అధ్యయనం చేసే శక్తి. భావనాశక్తి అంటే విషయాలకీ ప్రకృతి మూలశక్తులకీ మానవ లక్షణాలనీ అనుభూతులనీ, ఆమాటకొస్తే అభిప్రాయాలనీ ఆపాదించే శక్తి అన్నమాట’’ అని గోర్కీ  అంటారు. అవబోధనాశక్తి, భావనాశక్తులు రెండూ పల్లపు స్వాతి రాసిన మోదుగుపూల వాన కవిత్వం అంతటా నిండుగా పరచుకొంది. ఇరవై చిన్న కవితలున్న