కథలు

ప్రవాహం

(కా. మిడ్కో గా పాఠకులకు సుపరిచితమైన కా. జి.రేణుక స్వస్థలం వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామం. తిరుపతిలో ఎల్‌ఎల్‌బి చదువుతుండగా “మహిళాశక్తి” సభ్యురాలిగా మహిళా ఉద్యమంలో పనిచేసింది. 1995 లో మహిళా శక్తి మరొక 9 సంఘాలతో కలిసి చైతన్య మహిళా సంఘంగా ఏర్పడిన తరవాత రాష్ట్రవ్యాప్త మహిళా ఉద్యమంలో తిరుపతి కేంద్రంగా 2000 వరకూ విశాఖపట్నం కేంద్రంగా 2004 వరకూ పనిచేసింది. మహిళామార్గం పత్రిక లో సంపాదక వర్గ సభ్యురాలుగా పనిచేసింది. తరవాత 2004 లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుని ఆంధ్ర ఒడిష బోర్డర్ జోన్ లోనూ, దండకారణ్యంలోనూ పనిచేసింది. అనేక కలం పేర్లతో 30 కి
సాహిత్యం కవిత్వం

అమాయకులు వాళ్ళు

అవును, వాళ్ళు  భ్రమల్లోనే వున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య చంద్రుడు వెన్నలకాంతులు విరాజిమ్ముతుంటే, కానన కారుచీకట్లో వెలుగుకై వెదుకుతున్నఅమాయకులు వాళ్ళు పచ్చని పంట పొలాలపై కార్పొరేట్ గద్దలు వాలుతుంటే, పంటను కాపాడే రైతన్న  వడిసెల విసురు నేరమైన చోట ప్రశ్నించిన ప్రతివాడూ దేశద్రోహయిన  నేతి బీరకాయ ప్రజాస్వామ్యం లో హక్కుల నేతికై దేవులాడక ,  ఫాసిస్ట్ ఎడారిలో సామ్యవాద ఒయాసిస్ కై దేబరించని అజ్ఞానులు వాళ్ళు.   కులం,మతం పేరుతో మానవత్వం మంటగలుస్తున్న మహోన్నత భారతంలో, హక్కులకై గొంతెత్తిన ప్రతివాడు అర్బన్ నక్సల్ దేశద్రోహి,పాకిస్తానీ ఏజెంట్ అయిన నేల ఎన్నికల చదరంగంలో పావులుగా మిగలక, బిర్శాముండా,కొమురం భీమ్ పంథానవసరంగా పట్టిన
ఎరుకల కథలు

దేనికీ భయపడొద్దు

“ దీన్ని టీ అంటారా ?  ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది. పైకి గట్టిగానే  అంటున్నట్లున్నా  ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి,  కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ  గొంతులో ఏదో మొహమాటం, బెరుకు. నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని  బెరుగ్గా  “ స్టీల్ గ్లాస్ లోనే టీ  ఇవ్వు రెడ్డీ , వేడిగా  వుంటుందని ఎన్నోసార్లు చెప్పింటా.  అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ ..  ” అంటున్నాడు
సాహిత్యం కవిత్వం

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల మాటునదాగే ప్రశ్నవిరుచుకుపడుతుందని వాడి వెన్నులో వణుకు నాటిన ప్రతి మొక్కఓ ఆయుధ భాండాగారమౌతుందేమోననికలవరింతకాకులే కాపలాగాఅరిచే అరుపుఎరుపై మూకుమ్మడి దాడి చేస్తారేమోననేభావి స్వప్నం వాడ్ని నిదుర పోనీయట్లేదేమో శరదృతువు లోకాచే వెన్నెల్లోపల్లె బతుకుల్లో వెలుగులు నింపే దారులు వెతికే పనుల్లో సేద్యగాళ్ళు వాడ్నినిలువెత్తు గొయ్యిలోపాతరేసి హేమంతాన్ని ఆహ్వానిద్దామనేఆకాంక్ష నేడు కాక పోయినా రేపైనానెరవేరుతుంది లే
సాహిత్యం కవిత్వం

దేశం కల కంటోంది

దుఃఖ సంచారి చంద్రుడు  కలల్లా పగులుతున్న వెన్నెల  ఈ సింహాసనానికి సిగ్గు నరం లేదు ఒక చలన సౌందర్య మానవ జీవ కళ జీవితంలో తడుస్తున్నప్పుడు- కళ్ళల్లో  శిశిరం! ఒక చిరునామా  జాతీయ జెండా నెత్తుటి దాహమై పోయింది ఒక నిప్పుల కల మీద  ప్రవహిస్తున్న మృత్యువు  బువ్వ కుండలో  బుల్లెట్ చొరబడింది  రెక్కలు తెగిన చూపుల్లో  కుప్పకూలిన నవ్వులు  ఒక అకాల యుద్ధం పగలబడి నవ్వుతున్నా కాలం కన్నీళ్లు సానపడుతూ ఒక అంతర్గత ప్రమాద కంపం తొంగి చూస్తూ ఉంటుంది దేశభక్తి నిధి  సామ్రాజ్యవాదం చీకట్లో కులుకుతున్నా పొన్న పూలు రాలిపడిన  ధ్వని సుడుల్లో దేశ దరిద్రం 
సాహిత్యం కవిత్వం

అలల హోరుకు సంకెళ్ళేస్తావా..!?

సుఖమయ జీవితాల్లోని సంతోషాల్ని నిషేదించుకున్నోళ్లం గాఢాంధకారంలో చిక్కిన మట్టి బిడ్డలకోసం చిమ్మ చీకట్లను ఆలింగనం చేసుకున్నోళ్లం  నెర్రెలిచ్చి డొక్కలెండిన దుఃఖ్ఖ సాగరాల కనుకొలుకుల్లో కాంతి రేఖలమై పునర్జీవించినోళ్ళం శతాబ్దాల శుష్కవాగ్దానాలనీ పురోభివృద్ధి పాదాలకింద చితికినఆకలి పేగులమన్యానికి సైనిక కవాతునేర్పినోళ్ళం  అడవిని అన్యాక్రాంతం అవనివ్వని శపథాన్ని ఎరుపెక్కిన పతాక రెపరెపల్లో                                                         నిత్యం నిగనిగలాడే                                             నిఘా
కథలు

కొత్త బంగారు లోకం

సూర్యుడు పడమర దిక్కున ఎరుపు రంగులోకి మారుతూ, మెల్లమెల్లగా కిందికి జారుకుంటున్నాడు. అప్పుడు సమయం 6 గంటలు. 5, 6 ఇండ్లున్న ఆదివాసీ గ్రామం చేరుకున్నాం. నేను బాబాయ్‌, మమల్ని తీసుకొచ్చిన అన్నయ్య, మేము కలవాల్సిన వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్‌లో మాట్లాడక, మెసేజ్‌ చూసుకోక సరిగ్గా 48 గంటలవుతోంది. వాచ్‌ ప్రతి గంటకు శబ్దం చేయగానే, నాకేదో మెసేజ్‌ వచ్చినట్లుగా నా చూపులు సైడ్‌ బ్యాగ్‌ వైపు వెళుతున్నాయి. తీరా వాచ్‌ సౌండ్‌ అని ఓ లుక్‌ వాచ్‌పైకేసా. నేనొచ్చే ముందు డిజిటల్‌ వాచ్‌ ఐతే అక్కడి ప్రదేశానికి అనుకూలమని మా పిన్ని కొనిచ్చింది. డిజిటల్‌
కథలు హస్బెండ్ స్టిచ్ - 3 సాహిత్యం

అనగనగనగా… ఒక మంచం!

‘నానమ్మా ఇప్పుడే చెప్తున్నాను ఈసారి వచ్చినప్పుడు పందిరి మంచం తీస్కెళ్ళిపోతాను నువ్విక ఆపలేవు నన్ను. పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడిస్తావు నానమ్మా... నువ్వూ పడుకోవు, అమ్మనీ పడుకోనీవు. నాకూ ఇవ్వవు. స్టోర్‌ రూమ్‌లో ఆ నల్ల దుప్పటితో కప్పెట్టేస్తావు అదేదో పురావస్తు గ్నాపకంలా... షాజహాన్‌ ముంతాజ్‌ కోసం కట్టిన తాజ్‌మహల్లా... ఏంటది నానమ్మా అర్థం ఉండాలి. వస్తువులు, మనుషులు అందరికీ ఉపయోగపడాలి అంటావుగా నువ్వు. అంత పెద్ద అందమైన పందిరి మంచం, చూస్తేనే నిద్రొచ్చేలా ఉండే పందిరి మంచం, జోలపాడుతూ అమ్మ ఒడిలా కమ్మగా జోల పాడుతూ నిద్రపుచ్చే పందిరి మంచం... కమ్మటి కలల్నిచ్చే పందిరి మంచం
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

వ‌ర్త‌మాన క‌థ‌కుల‌కు గ‌ట్టి వెన్నెముక లేదు

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.     కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని
కథలు

ఆవు శాస్త్రం!

వయసు మీద పడ్డ వైస్ ఛాన్సలర్  కళ్ళద్దాలు తుడుచుకొని కళ్ళు పులుముకొని రెప్పలు ఆడించి చేతిలోని ఆర్డర్‌ని మరోసారి చూశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి వచ్చిన లెటర్ అది. మళ్ళీ చదువుకున్నారు. క్షణకాలం అలానే వుండిపోయారు. రిజిస్ట్రారూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరూ డీన్లూ డిపార్టుమెంటు హెడ్లూ సూపరింటెండెంట్లూ యింకా ప్రొఫెసర్లూ కొద్దిమంది స్టూడెంట్లూ వారి నాయకులూ అంతా అయన వంక చూశారు. ఒకరకంగా అది ఇంటర్నల్ మీటింగ్. ఇంకా చెప్పాలంటే కాన్ఫిడెన్సియల్ మీటింగ్. ‘నేషనలిజమ్... జాతీయవాదం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యీ ప్రతిపాదనలు చేసింది...’ అన్నారు ఛాన్సలర్. ‘విద్యారంగం అందుకొక మార్గం... సో’ అని ఆగిపోయారు.