కొత్త పుస్తకం సాహిత్యం వ్యాసాలు

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి
సాహిత్యం కవిత్వం

మరో వైపు..

ఊరికేనీ ఇంట్లోకి చొరబడినీ పసిపాపల ముందునిన్ను పెడ రెక్కలు విరిచి కట్టిబలవంతంగా ఎత్తుకు పోతారు ఎక్కడో నువ్వొక సారిఎమోజీగానవ్వినందుకునీ మిత్రులతో కలిసిగొంతు కలిపినందుకునీ చేతిలోపచ్చగా ఓ రుమాలుఎగిరినందుకుఏమైనా కావచ్చునీ నుదుటిపై ఊపాముద్ర వేయడానికి ఇక నీ కను రెప్పల చుట్టూఇనుప చువ్వలు మొలకెత్తుతాయినీ గుండెలపై ఊపిరిసలపనంతగాఉక్కు పాదంతో తొక్కిపెట్టడానికిరోజు లేమీ మిగిలి వుండవు నీ పసిపాపల‌ నవ్వుల కేరింతలువినపడకుండా గాజుటద్దాలుఉబికి వస్తాయి నీ ఇంటి మీదకుబుల్డోజరు నడిచి వస్తుంది అనుమానపు పరిహాసాలతోచుట్టూ పరిక కంపలుపరచుకుంటాయి ఎప్పటికో ఒక వేకువలోమెలకువ వచ్చినన్యాయ పీఠం నిర్దోషిత్వాన్నిగుర్తిస్తూ నీ ముఖాన ఒక‌బెయిల్ కాగితం విసిరి కొడితేఅందుకోలేని నీ వణుకుతున్నచేతులు చివరిగా ఆసరానువెతుక్కుంటూ బయటకు
అలనాటి రచన సాహిత్యం కాలమ్స్

చెదిరినసమాజం

మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                             “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,
సాహిత్యం వ్యాసాలు

మనిషితనంపై విశ్వాసంతో

(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్  మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని  అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే  రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది.  కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే
సాహిత్యం కవిత్వం

పాడె పై ప్రజాస్వామ్యం

దుక్కి దున్నినచేతులురహదార్ల పై ఏడాది గాచలనం లేనినిరంకుశ పాలన పండిన పంట అమ్మకందళారీ కనుసన్నలలోఏ తీరానికి పయనం వాడికి లాభార్జనే ఎరుకనేల రకాలెరగడునేల సత్తువ ఎరుగడుకాలం కాక ముందే రోహిణిలోనేఒప్పందాలంటూ ఎగేసుకొస్తేరైతు ఒప్పుకోవాలా?!వాడు చెప్పిన పంట పండక పోతే బాధ్యత ఎవరిది? ఒక పల్లెలఎన్నో పంటలుచిన్న కమతాల నుండి పెద్ద కమతాల దాకారైతు రైతు కి ఒప్పందంఆచరణ లో అసాధ్యంపల్లె ఒక్క యూనిట్ గాపల్లె ఒక పంటగా సాగుతుందిఅనుమానమే లేదు సుమీ!! ఎరువులు పురుగు మందుల అప్పుల కోసంఅంది వచ్చిన ధర కాడికి తెగ నమ్మిఅప్పులు తీర్చే రైతుబండ్లు కిరాయికి మాట్లాడుకునిప్రాంతం కానీ ప్రాంతానికిభాష రాని అక్షరం ముక్క
సాహిత్యం కవిత్వం

అడవి నేను

ఆకు నేనుపువ్వు నేనుచెట్టు నేనుజీవి నేను ఈ గాలి నాదేఈ నీరు నాదేఈ భూమిఈ అడవి నాదే అడవి దేహంనేనో చెయ్యినేనో కాలు నేనేనోరే లేని నోరునేనే అడవి అడవికడుపు నేనునా కడుపుఅడవి నన్నువనం ఖాళీ చేయమంటేఅడవినేఅడవి ఖాళీ చేయమన్నట్టు బతుకు కాలి బాటజీవితంనడిచి పోతూనే ఉంటుంది అడవింత తినిపించగా మిగిల్నఆకలంటారా ?వాన మబ్బుల వెనకే నడిపిస్తాం కారు మేఘాల ఖడ్గాలుకళ్ళల్లోచొర బడినాచినుకు పరిమళాలేబతుకు దీపమౌతాయి ఇంటిముఖంపట్టడాని కేముంది ?నేనేనా అడవి ఇల్లు ! నే నింకెవర్ని ? నేనురోహింగ్యానా ?నేనుశరణార్ధినా ?నేనో వలసనా ? మైదానమా!నువ్వెక్కడైనా బతికి నట్టుఅడివినినేనెక్కడైనా బతకాలి క దా ! ఈ వాగుఈ
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

భ్రమాన్వితుడా…!

ఏమంది సునయన? ‘యూ హావ్‌ టు వర్క్‌ హార్డ్‌... రేపట్నించీ ఇంకో రెండు ఎక్సర్‌సైజెస్‌ ఆడ్‌  చేస్తాను, అండ్‌ డైట్‌లో కార్బ్స్‌ ఇంకా తగ్గించేయాలి. ప్రొటీన్స్‌ ఆడ్‌ చేయండి.. ఓకే, రేపు హిప్‌ లిఫ్ట్స్‌? ఫ్లిట్టర్‌ కిక్స్‌, సిసర్‌ కిక్స్‌, వి`సిట్స్‌, అప్స్‌ ఆడ్‌ చేస్తాను. డోంట్‌ వర్రీ... మీ పొట్ట తగ్గి బాడీ మంచి షేప్‌లోకి వచ్చేస్తుంది. యువర్‌ హస్బెండ్‌ స్టార్ట్స్‌ లవింగ్‌ యూ మోర్‌... శారదగారూ, జిమ్‌ కోచ్‌ సునయన కన్ను కొడ్తూ చిలిపిగా నవ్వింది. శారదా నవ్వింది. కానీ నీరసంగా, ఇబ్బందిగా. దేహ కొలతలు సంతృప్తిగా ఉంటేనే ఎక్కువ ప్రేమించే భర్త ఎందుకు? తన
ఎరుకల కథలు

చప్పుడు

“శీనుగా టీ తీసుకురా...." వెంకట రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు ఆ ఊరి రెడ్డి గారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు. రెడ్డిగారింట్లో హాల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, ఇఒఆర్డి, పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే  పెద్ద కులాల వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. గుమ్మం బయట తలారి నిలబడి హాల్లోకి తొంగిచూస్తున్నాడు.  ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే. ఆఫీసర్ల ఆఫీసర్లే. జవాను జవానే ఆఖరికి తలారోడూ తలారోడే. ఎటొచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే
సాహిత్యం సంభాషణ

సాహ‌సోపేతంగా పురోగ‌మించండి

(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయ‌న త‌త్వ‌శాస్త్ర ఆచార్యుడు. విశ్వ‌విద్యాల‌యంలో పాఠాలు చెప్పేవాడు.  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర పాఠాలు నేర్చ‌కోడానికి  యూనివ‌ర్సిటీని వ‌దిలేశాడు.    నేర్చుకోవ‌డం అంటే నేర్పించ‌డం అనే గ‌తిత‌ర్కం తెలిసిన‌వాడు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు నేర్పించాడు. ఆయ‌నే పెరూ విప్ల‌వ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్ర‌జా యుద్ధ మార్గ‌ద‌ర్శి. ప‌థ నిర్దేశితుడు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పెరూ ప్ర‌పంచ పీడిత వ‌ర్గానికి ఆశారేఖ‌లాగా వెలుగొందింది. ఆ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి అమెరికా, పెరూ పాల‌క‌వ‌ర్గాలు  ఆయ‌న‌ను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా క‌ఠిన కారాగార శిక్ష  అనుభ‌విస్తూ ఈ నెల 11న అమ‌రుడ‌య్యాడు.  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు   కాల‌పు ప్ర‌పంచ మేధావుల్లో ఒక‌రు. 
సాహిత్యం కవిత్వం

ఒక రహశ్యం చెబుతా..

పట్టుపరుపులు లేవుజారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు అప్పుడంతానడక నేర్పిన పూల దారుల పెరళ్ళవిఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమదినిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమదిఅప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే! ఇప్పుడుఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాంఇద్దరి మధ్యా కొలవలేనంత దూరంవేలు పెట్టి చూపిస్తూ!కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలనితీసివేతల జాబితా అదంతా!మెదడు అట్టడుగు పొరల్లోపూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది! ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?ఎవరు ఏమైనా అనుకోనీఒక మాట మాత్రం చెప్పుకోవాలిప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్నిప్లాస్టిక్ జార్ లో కుదించిన