ఆమె నవ్వింది…
ఆమె నవ్విందట... ‘భలే నవ్వారే’ ఆంకర్ చిన్నగా నవ్వుతూ అంటోంది. ఆమె నిజంగా నవ్వితే ఇలాగే ఉంటుందా? బిల్కిస్ నిజమైన నవ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వితే ఆమె నవ్వెలా ఉంటుంది ఏమో ఊహించలేం... ఇరవై రెండేళ్ల నుంచే ఎన్ని ఊర్లు... ఎన్ని ఇళ్లు... ఎన్ని బళ్లు... ఎన్ని దేశాలు.... ఎన్నెన్ని కన్నీటి సముద్రాలు ఇంకెన్ని ఎడారులు మార్చి మార్చి పరిగెడ్తూ పారిపోతూ... పరిగెత్తి పరిగెత్తి గసబోస్తూ ఆయాస పడ్తూ... చమటలు కన్నీళ్లు... రక్తం కక్కుతూ కక్కుతూ... ఊపిరాడక ఎగబోస్తూ ఆగి... ఆగి కూలబడ్తూ... విరిగిపోతూ కరిగిపోతూ శ్వాస ఆడట్లేదు... ఓప్హ్ా ఊపిరాడట్లేదు... కాస్త గాలివ్వండి... ఏంటి... ఏంటి ఈ










