సాత్వికి “అక్షర”  స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతోంది. ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళిరావడం, సాయంత్రమైతే ట్యూషన్ కి వెళ్ళడం ఇదంతా తన దినచర్యలో భాగం.

అలాగే నిన్నటి రోజు కూడా ట్యూషన్ కి వెళ్ళి
“మామ్! రేపు సోషల్ ఎగ్జామ్ , క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా…”
అని టీచర్ని అడిగింది. టీచర్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసింది.

    అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే… India is an example of unity in diversity. చాలా హ్యాపీగా చాలా ఉత్సాహం తోటి ఈ పాపకు రకరకాల ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని మైండ్లో ఆలోచించుకుంటూ ఎన్నో ఉదాహరణలతో వివరించింది టీచర్ పాపకి.

    ఇలా నాన్న, ‘నో పర్టికులర్ రేస్ నో పర్టికులర్ క్యాస్ట్ అండ్ నో రిలీజియన్ ఇలా అంతా అద్భుతంగా ఒకటే అనుకొనేలా అన్నీ కలిసి విలసిల్లే ఒక అందమైన రంగురంగుల పువ్వుల ప్రపంచంగా మన భారతదేశం ఉంటుంది, ఉండాలి నాన్న’ అని  వివరించింది.  పాప కూడా తనకు అర్థమైన వరకూ
ఓకే… మామ్ అంటూ తను ఆ విషయాల్ని ఇంట్రెస్ట్ గా చదువుకుంది. ట్యూషన్ అయిపోయాక ఇంటికెళ్లింది.

          ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ల అమ్మ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్  చేసింది సాత్వికి. Mummy I understood this question very well అని …
మన ఇండియాలో there is no single racism, there is no single religion there is no single caste అట మమ్మీ! ఇలా స్పెషల్ గా ఉండే ఒకే ఒక దేశం మన భారతదేశం అట!! వేరే ఏ దేశం చూసినా అది పర్టికులర్గా ఏదో ఒక రిలిజియన్ తోనే డామినేట్ గా ఉంటుందట మమ్మీ!… టీచరూ …!
అదేదో స్పెషల్  వర్డ్ తో భలే చెప్పింది మమ్మీ “వైవిధ్య భరితం”  అని పాప టీచర్ చెప్పిన విషయాల్ని తల్లితో చాలా చాలా హ్యాపీగా పంచుకుంది.  

          ఆ నైట్ సాత్వికి వాళ్ళమ్మ టీచర్ కి ఫోన్ చేసి మేడం! పాపకు క్వశ్చన్ ఆన్సర్స్ చాలా బాగా అర్దమయ్యాయట. వెరీ హాప్పీ మేడం అని చెప్పింది. అలా క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లెసన్ అంటే చాలా లెంతీ ప్రాసెస్ కదా! అని కూడా చెప్పి షేర్ చేసుకుంది. అదలా  లవ్లీగా జరిగిపోయింది.

  తెల్లవారి లేచి పాప ఎగ్జామ్ టైమ్స్ అని హడావిడిగా స్కూల్ కి సిద్ధమౌతోంది. తన ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుంటూ బిజీ బిజీగా ఉంది. వాళ్ళ అమ్మ, పాపకూ అందరికీ బ్రేక్- ఫాస్ట్ ప్రిపరేషన్ లో బిజీగా ఉంది. ఈ లోపుగా సాత్వికి వాళ్ళ ఇంట్లో కాలింగ్ బెల్ మోగింది. ఒక అరగంట నుంచి కాలనీ మొత్తం కోలాహలంగా ఉంది. అలా ఎంతో పెద్ద పెద్ద డీజే సౌండ్లతోటి, పెద్ద పెద్ద పాటల హోరుతో కాలనీ అంతా చుట్టు పక్కలా మారు మ్రోగుతోంది. ఈలోపు వాళ్ల కాలింగ్ బెల్ వినిపించీ వినిపించనట్టు మ్రోగగానే, సాత్వికి వెళ్లి డోర్ తీసింది. అక్కడ వాళ్ళు, ఒక ఇద్దరు అంకుల్స్ ముందు నిలబడి తనకు ఒక పాంప్లెట్ ఇచ్చారు. వాళ్లని చూస్తూనే పాప మనసు ఏదో తెలియని అసాధారణ  భావనకు లోనైంది. దానిలో ఏముంది? తనకి తెలుగు అంతగా అర్థం కాదు కదా ఇంగ్లీష్ బ్యాచ్ స్టూడెంట్ కదా!
ఆ అమ్మాయి వెంటనే వెళ్లి వాళ్ళ అమ్మకిచ్చింది. అమ్మా! ఏంటమ్మా ఇది అని అడిగింది సాత్వికి. దాంట్లో ఉందేంటంటే
   “హిందూ సమ్మేళనం”.
పాంప్లెట్ లో ఉన్న హెడ్డింగ్ హిందూ సమ్మేళనం  సో అండ్ సో డేట్. తప్పకుండా రావాలి! మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి!! ఇది అందులో ఉన్న కాన్సెప్ట్. పాపకి చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదా అనే డైలమాలో వాళ్ళమ్మ ఉంది.

    సాత్వికి వాళ్ళమ్మ ఓ గృహిణి. ఆమెకు తెలిసిన ఈలాంటి విషయాలు చాలా పరిమితం. అందువల్ల అదేదో  కరపత్రం లే బిడ్డ! దాన్ని పక్కన పెట్టేసేయ్ .అదీ  హిందువుల గురించి, మన దేశంలో  హిందువులు ఐక్యత  అవ్వాలి! హిందువులంతా ప్రేరేపించబడాలి! మనది హిందూ దేశం కావాలి అన్నట్టుగా ఏదో తనకు అర్థమైన మాట చెప్పి వదిలేసింది.

    కానీ పాపకి డౌట్స్ అన్ని అలానే ఉండి ఆ పేపర్ పట్టుకుని వచ్చి ఈవినింగ్  ట్యూషన్ లో టీచర్ కు చూపించింది. చూపించి, ఏంటి మామ్ ఇది! అసలీ “pamphlet”  ఏంటి? నాకస్సలే అర్థం కాలేదు. ఏదో పాట పాడుతూ వచ్చి ఇచ్చారు అంటూ చూపించింది.

    టీచరుకు ఒకే సారి నిన్న ‘సాత్వికి’కి  చెప్పిన ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అంతా కళ్ళల్లో కదలాడింది. “Unity in diversity”  అని నిన్ననే ఎంతో బాగా వివరించాలనే తపనతో సాత్వికి తో పంచుకుంది… ఈరోజు ఈ హిందూ సమ్మేళనం పాంప్లెట్ నా చేతుల్లో…

ఈ పాపకి ఇప్పుడు ఏమని వివరించాలి ఎలా ఎక్స్ప్లైన్ చేయాలి? టీచర్ బాగా ఆలోచించసాగింది
‘తను ఫోర్త్ క్లాస్ పాప. తనకి ఈ విషయాలు ఎలా అర్థం అవుతాయి? ఎలా వివరించాలామెకు.’
నిన్ననే కదా చెప్పింది. ఒక మతమని ఒక కులమని కాకుండా అన్ని రకాల మనుషులందరూ కలిసిమెలిసి ఉంటున్న దేశం మనదని నిన్ననే చెప్పింది టీచర్.
ఈరోజున ఇట్లా ఒక మెజార్టీ మతస్తుల సమ్మేళనం జరుగుతుంది నాన్న! ఇదీ ఓ ‘మూక తత్వం’ అని చెబితే ఈ చిన్న మనసుకు ఎట్లా అర్థమవుతది! ఏమర్థమవుతది? ఈ ప్రశ్నలన్నీ టీచర్ మెదడు లో తీవ్రమైన సంచలనాన్ని రేపుతున్నాయి.

      అప్పుడు టీచర్ కి ఒకటే తోచింది. తప్పుని తప్పని చెప్పడమే మేలు. పాప ఎంతగానో ఆలోచిస్తుంది ఇదే ఆలోచన కొనసాగితే సమాజంలో యీ పాపే మిగతా వారిని చైతన్యపరుస్తుంది అని అనుకుంది టీచర్. పాపని దగ్గరిగా తీసుకుని కూర్చోబెట్టి
“ నిన్న మనం అనుకునట్టు మన దేశంలో చాలా మతాలు, కులాలు ఉన్నాయి కదా. అలా ఎవరి మతం వారికి, ఎవరి కులం వారికి గొప్ప. అంతేకానీ మా మతమే గొప్ప మా కులమే పెద్ది గొప్పది మిగతవన్నీ పనికిరానివి చెడ్డవి అని ఎవరు చెప్పిన ఎవరు మాట్లాడిన అది చాలా పెద్ద తప్పు. భారతదేశంలో ఎవరైనా జీవించవచ్చు అది ప్రతి పౌరుడి హక్కు.
 ఇలాంటి పాంప్లెట్ లో ఉన్నదంతా తప్పు. వీళ్ళు రాసిందంత సుద్ద తప్పే. ‘గడప లోపడే కులం గడప దాటితే హిందువులం’ అనే నినాదం మనుషులను రెచ్చగొట్టనికి ఇచ్చిందే.  మనం ఇలాంటి వాటికి వెళ్లకూడదు, వ్యతిరేకించాలి. మనుషులంతా ఒకటే అనే సూత్రం పాటించాలి. నేను నిన్న చెప్పిందే గుర్తుపెట్టుకో నాన్న” అంటూ తనలో లేని శక్తిని తెచ్చుకుని అక్కడి నుంచి లేచి చెత్తబుట్టలో వేసింది ఆ పాంప్లెట్ని.

Leave a Reply